
కండరాల గాయంతో బాధపడుతున్న శార్దూల్
శార్దూల్ ఠాకూర్ పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడని సమాచారం తెలిసింది. రెండో టెస్ట్ కోసం మంగళవారం సాధన చేసేటప్పుడు అతడి కండరాలు పట్టేశాయి. శార్దూల్ గాయం తీవ్రతపై ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారమైతే లేదు. ఆడలేని పరిస్థితిలో ఉంటే మాత్రం సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ రెండో టెస్ట్ ఆడనున్నాడు.
తొలి టెస్టులో వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్‌ను కాదని శార్దూల్‌ను తీసుకున్నారు. పేస్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అతడి సొంతం. ఇంగ్లండ్‌లో నలుగురు సీమర్లు, ఒక స్పిన్నర్ కూర్పుతో ఆడతామని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంతకు ముందే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అశ్విన్‌ను చోటు దక్కడం కష్టమేనని అనిపిస్తోంది.

బ్రాడ్ కాలికి గాయం
లార్డ్స్ టెస్ట్ కోసమే మంగళవారం సాధన చేస్తుండగా.. స్టువర్ట్ బ్రాడ్ కాలి మడమ మలుచుకుందని అంటున్నారు. గాయం తీవ్రంగానే ఉందని తెలుస్తోంది. అతడు లేచి నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం అతడిని వైద్యబృందం పర్యవేక్షిస్తోంది.
ఇప్పటివరకు బ్రాడ్ 149 టెస్టులు ఆడాడు. లార్డ్స్‌లో 150వ మ్యాచ్ ఆడి కెరీర్‌ను చిరస్మరణీయం చేసుకోవాలని అతడు భావించాడు. బ్రాడ్ ఈ టెస్టు ఆడతాడా లేడా అన్నది బుధవారం సాయంత్రం తెలియనుంది. గాయం తీవ్రంగా ఉందని, పూర్తి సిరీసుకు దూరమైనా ఆశ్చర్యం లేదని కొందరు అంటున్నారు.
టీ20 ప్రపంచకప్ అనంతరం రవిశాస్త్రి ఔట్.. ఐపీఎల్ జట్లతో ఇప్పటికే చర్చలు! స్టార్ టీమ్‌తో ఒప్పందం?

బ్రాడ్‌కే కాదు ఇంగ్లండ్‌కు దెబ్బే
లార్డ్స్‌లో 150వ టెస్ట్ ఆడబోతున్న స్టువర్ట్ బ్రాడ్‌కే కాదు.. అంతటి సీనియర్ బౌలర్ సేవలు మిస్ కానున్న ఇంగ్లండ్‌కు కూడా ఇది మింగుడు పడనిదే. ఇప్పటికే ఇంగ్లండ్ టీమ్ జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్ లాంటి బౌలర్ల సేవలు కోల్పోయింది. తొలి టెస్ట్‌లో టీమిండియా గెలిచేలా కనిపించినా.. చివరి రోజు ఆట మొత్తం వర్షార్పణం కావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండు ఇన్నింగ్స్‌లలో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ తృటిలో ఓటమిని నుంచి గట్టెక్కింది.

జట్టులోకి మోయిన్ అలీ
రెండో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు తమ ఆల్‌రౌండర్ మోయిన్ అలీని పిలిపించింది. దాంతో అలీ మంగళవారం నుంచి జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేశాడు. అలీ ప్రస్తుతం 'ది హండ్రెడ్ లీగ్'లో ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే గురువారం నుంచి లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగే రెండో టెస్టుకు అతడిని తిరిగి పిలిపించారు. తొలి టెస్టులో కెప్టెన్ జో రూట్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించకపోవడంతో ఆల్‌రౌండర్ జాబితాలో అలీని తిరిగి జాతీయ జట్టుకు పిలిపించినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లంతా ఇలాగే సరైన ప్రదర్శన చేయకపోతే కచ్చితంగా జట్టులో మార్పు ఉంటుందని కోచ్ సిల్వర్‌వుడ్ ఇదివరకే స్పష్టం చేశాడు.


Click it and Unblock the Notifications












