Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్‌గా అజింక్య రహానే ఒకే.. మరి బ్యాట్స్‌మెన్‌గా?! జట్టుకు భారమే: మంజ్రేకర్‌

India vs England: Sanjay Manjrekar Points Out Ajinkya Rahanes Batting Issues

చెన్నై: ఇటీవల ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ అద్భుత ప్రదర్శనతో సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అజింక్య రహానే ఆ సిరీస్‌తో కెప్టెన్‌గా తానేంటో నిరూపించుకున్నాడు. డే/నైట్ టెస్టులో ఘోర పరాజయం ఎదురైన తర్వాత ఆత్మవిశ్వాసంతో జట్టును ముందుకు నడిపించి, బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని టీమిండియా మరోసారి కైవసంలో తన వంతు పాత్ర పోషించాడు. గాయాలతో సీనియర్‌ ఆటగాళ్లు జట్టుకు దూరమైనా.. గెలుపు అసాధ్యం అనుకున్న చోట యువ ఆటగాళ్లతోనే సిరీస్‌ నెగ్గి సత్తాచాటాడు. దీంతో సారథ్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించిన రహానేపై ప్రశంసల వర్షం కురిసింది.

రహానే విఫలం

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో బ్యాట్స్‌మెన్‌గా కూడా అజింక్య రహానే మెరుగైన స్కోర్ చేశాడు. మెల్‌బోర్న్‌ టెస్టులో 112, 27 పరుగులతో రాణించాడు. చివరిదైన గబ్బా టెస్టులోనూ 24, 37 పరుగులతో చెప్పుకోదగ్గ స్కోరుతో ఆకట్టుకున్నాడు. ఈ రెండు టెస్టులో భారత్ విజయాలు అందుకుంది. దీంతో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న తొలి టెస్టులో రహానే ప్రదర్శనపై అంతా దృష్టి సారించారు. రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టగా.. వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రహానే బ్యాట్స్‌మెన్‌గా ఇంకా బాగా రాణిస్తాడని అందరూ అంచనా వేశారు. ఆ అంచనాలను రహానే పటాపంచలు చేశాడు. చెన్నైలోని చెపాక్‌ వేదికగా ముగిసిన మొదటి టెస్టులో పూర్తిగా నిరాశపరిచాడు.

మంజ్రేకర్‌ విమర్శలు‌

మంజ్రేకర్‌ విమర్శలు‌

తొలి ఇన్నింగ్స్‌లో 6 బంతుల్లో ఒకే ఒక్క పరుగు చేసిన వైస్‌ కెప్టెన్ అజింక్య రహానే.. డామ్‌ బెస్‌ బౌలింగ్‌లో జో రూట్‌ పట్టిన అద్భుత క్యాచ్‌కు ఔట్ అయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో జేమ్స్ ఆండర్సన్ అద్భుత బంతికి డకౌట్‌ అయ్యాడు. కీలక వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న వేళ రహానే మరోసారి తేలిపోవడంతో నెట్టింట విమర్శలు వినిపిస్తున్నాయి.

భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ బ్యాట్స్‌మెన్‌గా రహానే ప్రదర్శనపై పెదవి విరిచాడు. 'కెప్టెన్‌గా అజింక్య రహానే ఒకే. మరి బ్యాట్స్‌మెన్‌గా?. మెల్‌బోర్న్‌ టెస్టులో సెంచరీ తర్వాత 27(నాటౌట్‌), 22, 4,37, 24, 1, 0. అద్భుతమైన 100 తర్వాత క్లాస్‌ ప్లేయర్లు ఫామ్‌ కొనసాగిస్తారు. కొన్నిసార్లు ఫామ్‌ కోల్పోయి జట్టుకు భారంగా మారతారు' అంటూ ట్వీట్‌ చేశాడు.

ముంబై నుంచి వచ్చాడన్న కారణంతోనే

ముంబై నుంచి వచ్చాడన్న కారణంతోనే

అజింక్య రహానే బ్యాటింగ్‌పై సంజయ్‌ మంజ్రేకర్‌ మాత్రమే కాదు నెటిజన్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. 'రహానే నిలకడగా ఆడిన సందర్భాలు లేవు. కెప్టెన్‌గా తనకు వంక పెట్టడానికి లేదు. కానీ బ్యాట్స్‌మెన్‌గా ఇలా ఆడటం సరికాదు' అని ఒకరు ట్వీట్ చేయగా.. ' ముంబై నుంచి వచ్చాడన్న ఒకే ఒక్క కారణంతో జట్టులో ఉన్నాడా?' అని మరొకరు ట్వీటారు. మరికొంత మంది మాత్రం అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. 'ఒక్క మ్యాచ్‌తోనే అతడిపై విమర్శలు తగవు', 'తనదైన రోజు కచ్చితంగా బ్యాట్‌తో సమాధానం ఇస్తాడు' అని అండగా నిలుస్తున్నారు.

టీమిండియా ప‌రాజ‌యం

టీమిండియా ప‌రాజ‌యం

ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా దారుణ ప‌రాజ‌యం పాలైంది. చెన్నై పిచ్‌పై చివరి రోజు అనూహ్య‌మైన బౌన్స్‌, ట‌ర్న్‌ కారణంగా కోహ్లీసేన రెండు సెష‌న్ల పాటు కూడా నిల‌వ‌లేక చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో 227 ప‌రుగుల భారీ తేడాతో గెలిచిన ఇంగ్లండ్ 4 టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (72) కాసేపు పోరాడినా.. టీమ్ ఓట‌మిని మాత్రం అడ్డుకోలేక‌పోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 192 ప‌రుగుల‌కే ఆలౌటైంది.

ఆ పిచ్చి ప్రేమే.. రోజూ 40-45 ఓవర్లు వేసేలా చేస్తోంది: అశ్విన్‌

Story first published: Tuesday, February 9, 2021, 14:25 [IST]
Other articles published on Feb 9, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+