ఆ పిచ్చి ప్రేమే.. రోజూ 40-45 ఓవర్లు వేసేలా చేస్తోంది: అశ్విన్

చెన్నై: క్రికెట్ ఆటపై ఉన్న పిచ్చి ప్రేమే సుదీర్ఘంగా బౌలింగ్ చేసేలా చేస్తోందని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. రోజూ 40-45 ఓవర్లు విసిరాక నెట్స్‌లో సాధన చేయడం యువకుడిగా ఉన్నప్పటి నుంచే అలవాటైందని వెల్లడించాడు. బౌలింగ్ చేసేటప్పుడు దేహంలో కొన్ని శరీరభాగాలు స్పందించకపోయినా ఆటను ఎంతో ఆస్వాదిస్తానని యాష్ చెప్పుకొచ్చాడు. చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 73 ఓవర్లు వేసి 9 వికెట్లు తీశాడు.

ఆటను ఎంతో ప్రేమిస్తాను
నాలుగో రోజు ఆట ముగిశాక రవిచంద్రన్ అశ్విన్ మీడియాతో మాట్లాడాడు. 'యువకుడిగా ఉన్నప్పటి నుంచే 40-45 ఓవర్లు విసిరి నెట్స్‌లో సాధన చేయడం ఆటలో భాగమైంది. బౌలింగ్ విషయానికి వస్తే.. నా దేహంలో కొన్ని శరీరభాగాలు స్పందించకపోయినా నేను ఆటను ఎంతో ఆస్వాదిస్తాను. మొండిగా ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఆటను నేనంతగా ప్రేమిస్తాను. వీలైనంత సుదీర్ఘంగా బౌలింగ్ చేయడానికే ఆలోచిస్తాను' అని అశ్విన్ తెలిపాడు. సోమవారం అశ్విన్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. టెస్ట్ ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ తీసిన తొలి భారత స్పిన్నర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికి వికెట్ తీసిన మూడో స్పిన్నర్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు.

టాస్ గెలవడం కీలకం
చెపాక్‌లో ఇంగ్లండ్ టాస్ గెలవడం కీలకంగా మారిందని రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. 'వికెట్‌ను చూసినప్పుడు బ్యాటింగ్ చేసేందుకు బాగుందని అనిపించింది. కానీ తొలి రోజు అంతకన్నా మెరుగ్గా బ్యాటింగ్‌కు అనుకూలించింది. ఊహించిన దాని కన్నా పిచ్ చాలా ఫ్లాట్‌గా ఉంది. టాస్ మాకు కీలకంగా మారింది. అయినప్పటికీ మేం పోరాడాం. మూడు, నాలుగో రోజు బాగా పుంజుకున్నాం. ఐదో రోజు బాగా ఆడితే చాలు' అని యాష్ అన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 337 పరుగులకు ఆలౌట్ అవగా.. అశ్విన్ (31; 91 బంతుల్లో 3x4, 1x6) బ్యాటింగ్‌లో కూడా మెరిశాడు.

ప్రణాళికలు రచించాల్సిందే
'జో రూట్ గొప్ప బ్యాట్స్‌మన్. కానీ బౌలింగ్‌లో తక్కువ స్వీప్ షాట్లు ఆడాడు. స్వీప్ చేసే విషయంలో అతడు ఆచితూచి వ్యవహరించాడు. ఎందుకంటే ఏ లైన్‌లో బంతులు వేయాలో మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి. మంచి ఆటగాళ్లు ఆడుతున్నప్పుడు ప్రణాళికలు రచించాల్సిందే. కొన్నిసార్లు అవి పనిచేస్తాయి. కొన్నిసార్లు కుదరదు. నిజానికి రెండో ఇన్నింగ్స్‌లో రూట్ స్వీప్ ఆడేందుకు సౌకర్యంగా కనిపించలేదు. ఫ్లయిటెడ్ డెలివరీలను ఆడలేకపోయాడు. అంటే తొలి రోజు, నాలుగో రోజు పిచ్‌కు ఎంతో తేడా ఉంది' అని అశ్విన్ పేర్కొన్నాడు.

అందుకే ఇంగ్లండ్ ఫాలో ఆన్ ఆడించలేదు
జస్ప్రీత్ బుమ్రా తరహాలో జోఫ్రా ఆర్చర్, జేమ్స్ అండర్సన్ పిచ్‌పై తక్కువ బౌన్స్‌ను ఉపయోగించి బంతులేశారన్న వాదనను అశ్విన్ తిరస్కరించాడు. 'బుమ్రా బౌలింగ్ విషయంలో మనం కొన్ని విషయాల్ని అర్థం చేసుకోవాలి. అండర్సన్, ఆర్చర్‌తో పోలిస్తే బుమ్రా ఆర్మ్‌పాత్ భిన్నంగా ఉంటుంది. ఉపఖండం పిచ్‌లపై బుమ్రా, ఇషాంత్‌కు అత్యంత అనుభవం ఉంది. ఎంతో కాలంగా వారు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడుతున్నారు. కొన్నిసార్లు బయటవాళ్లు దీనిని గమనించరు. సుందర్ అద్భుతమైన బ్యాట్స్‌మన్. అతడికి ప్రత్యేక ప్రతిభ ఉంది. బౌలర్లకు విశ్రాంతి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఇంగ్లండ్ ఫాలో ఆన్ ఆడించలేదు. అలసిపోయిన వారికన్నా తాజాగా ఉన్న బౌలర్లు కొన్నిసార్లు మెరుగ్గా బంతులు వేయగలరు' అని భారత స్పిన్నర్ చెప్పుకొచ్చాడు.
ఇంగ్లండ్ వ్యూహం ఏంటో అర్ధం కావట్లేదు.. రూట్ సేన పిరికి క్రికెట్ ఆడింది! వార్న్ సంచలన వ్యాఖ్యలు!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications