For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మైదానంలో రోహిత్ బ్యాటింగ్.. డ్రెసింగ్ రూమ్‌లో కోహ్లీ ఎంకరేజింగ్! ఇప్పుడు చెప్పండిరా అబ్బాయిలు!

India vs England: Rohit Sharma scoring on ground, Virat Kohli cheering from dressing room

చెన్నై: 2019 వన్డే ప్రపంచకప్‌ ముందు వరకు కెప్టెన్ విరాట్ కోహ్లీ‌, పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ మధ్య విభేదాల ప్రస్తావన తెరమీదకు రాలేదు. మెగా టోర్నీలో న్యూజిలాండ్‌ చేతిలో భారత్ ఘోరంగా ఓటమి పాలవ్వడంతో.. కోహ్లీ, రోహిత్‌ మధ్య స్నేహం సవ్యంగా లేదనే సంగతి బయటపడింది. కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ కోహ్లీ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని.. జట్టులో మిగతావాళ్ల అభిప్రాయాలకు విలువేలేదని రోహిత్ ఆగ్రహించాడని వార్తలు వచ్చాయి. ఆటగాళ్ల ఎంపికలోనూ రోహిత్ మాట వినిపించుకోలేదని, జట్టు అవసరాల మేరకు కాకుండా తన శిబిరం వారినే కోహ్లీ తుది జట్టులోకి తీసుకోవడం హిట్‌మ్యాన్‌కు నచ్చలేదని అప్పట్లో వార్తలు షికార్లు చేశాయి.

ఐపీఎల్ 2020 సమయంలోనూ:

ఐపీఎల్ 2020 సమయంలోనూ:

కొన్నిరోజుల పాటు దేశవ్యాప్తంగా కెప్టెన్, వైస్‌ కెప్టెన్‌ చర్చ కొనసాగింది. ఈ వివాదంలోకి కుటుంబ సభ్యులనూ లాగారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇన్‌స్టా ఖాతాలను రోహిత్‌ శర్మ అన్‌ఫాలో చేశాడు. కోహ్లీ మాత్రం రోహిత్‌, రితికాను ఫాలో అయ్యాడు. ఇక అనుష్క ఇద్దరినీ ఫాలో కాలేదు. రితిక సైతం విరుష్కను అన్‌ఫాలో చేశారు. ఇక మ్యాచులు ఆడేటప్పుడు అనుష్క ఆ చివరన కూర్చొంటే.. రితిక ఈ చివరన కూర్చొని వీక్షించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఐపీఎల్ 2020 సమయంలోనూ ఇద్దరూ పెద్దగా మాట్లాడుకున్న దాఖలు లేవు. ఆసీస్ పర్యటన ముందు కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. రోహిత్ గాయం పరిస్థితిపై పూర్తి సమాచారం లేదని, అంతా గందరగోళం నెలకొందని అన్నాడు. దీంతో కోహ్లీ-రోహిత్ మధ్య గొడవలు నిజమేనని అందరూ అనుకున్నారు.

చప్పట్లు కొడుతూ కోహ్లీ ఎంకరేజ్:

తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని విరాట్ కోహ్లీ స్పష్టం చేసినా.. ఆ వార్తలకు మాత్రం పులిస్టాప్ పడలేదు. తాజా ఘటన మాత్రం కోహ్లీ-రోహిత్ మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేస్తోంది. చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్ చేస్తోంది. రోహిత్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తున్నాడు. స్టోక్స్, బ్రాడ్ బౌలింగ్‌లలో చూడముచ్చటైన షాట్లు ఆడాడు. దీంతో డ్రెసింగ్ రూమ్‌లో ఉన్న కోహ్లీ.. చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశాడు. రోహిత్ బాదిన ప్రతి షాట్‌ను విరాట్ ప్రశంసించాడు. దీనికి సంబందించిన ఫొటో నెట్టింట వైరల్ అయింది. 'కోహ్లీ-రోహిత్ అనుబంధం బాగుంది', 'ఇద్దరినీ చూస్తుంటే ఇప్పడు సంతోషంగా ఉంది', 'ఇప్పుడు చెప్పండిరా అబ్బాయిలు.. కోహ్లీ-రోహిత్ మధ్య ఎలాంటి గొడవలు లేవని' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రోహిత్‌ ఫిప్టీ :

రోహిత్‌ ఫిప్టీ :

రెండో టెస్ట్ మ్యాచ్‌లో సున్నా ప‌రుగుల‌కే శుభ్‌మ‌న్ గిల్‌ (0) వికెట్ కోల్పోయిన‌ప్ప‌టికీ.. రోహిత్ శ‌ర్మ అర్ధ సెంచ‌రీతో చెలరేగాడు. జాక్‌ లీచ్‌ వేసిన 14వ ఓవర్‌ ఐదో బంతిని ఫోర్‌ కొట్టిన రోహిత్‌ ఫిప్టీ పూర్తి చేసుకున్నాడు. వన్డే తరహాలో వేగంగా ఆడిన రోహిత్‌ 47 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో కెరీర్‌లో 12వ అర్థ సెంచరీ సాధించాడు. అయితే మూడు వికెట్లు కోల్పోయిన భారత్ ప్రస్తుతం కష్టాల్లో పడింది. పుజారా 21 పరుగుల వద్ద పెవిలియన్ చేరగా.. కోహ్లీ డకౌట్ అయ్యాడు. అయితే రోహిత్ మాత్రం తగ్గట్లేదు. వ‌న్డే త‌ర‌హాలో బ్యాట్ ఝుళిపిస్తూ వీలైన్న‌ని ఎక్కువ ప‌రుగులు రాబ‌డుతున్నాడు. అతనికి రహానే సహకారం అందిస్తున్నాడు. భారత్ 24 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 94 రన్స్ చేసింది. రోహిత్ (71), రహానే (4) క్రీజులో ఉన్నారు.

ISL 2020 21: చివరలో అడ్రియెన్‌ గోల్.. హైదరాబాద్‌కు మరో‌ డ్రా!

Story first published: Saturday, February 13, 2021, 12:10 [IST]
Other articles published on Feb 13, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+