Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ISL 2020 21: చివరలో అడ్రియెన్‌ గోల్.. హైదరాబాద్‌కు మరో‌ డ్రా!

ISL 2020-21: Hyderabad FC and SC East Bengal play out 1-1 draw

వాస్కోడిగామా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఏడో సీజన్‌లో హైదరాబాద్‌ ఎఫ్‌సీ మరో మ్యాచును ‌'డ్రా'గా ముగించింది. శుక్రవారం రాత్రి తిలక్ మైదాన్ స్టేడియంలో ఈస్ట్‌ బెంగాల్‌తో పోరును హైదరాబాద్‌ 1-1తో డ్రా చేసుకుంది. దీంతో ఐఎస్‌ఎల్‌ ఏడో సీజన్‌లో హైదరాబాద్‌ ఖాతాలో 9వ డ్రా చేరింది. ఈ సీజన్‌లో డ్రా చేసుకున్న మ్యాచులలో హైదరాబాద్‌ ముందుంజలో ఉంది. గోవా, నార్త్ ఈస్ట్, చెన్నయిన్, ఈస్ట్ బెంగాల్ జట్లు 8 డ్రాలతో ఉన్నాయి.

హైదరాబాద్‌, ఈస్ట్‌ బెంగాల్‌ తొలి అర్ధ భాగంలో ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయాయి. ఆటగాళ్లను మార్చినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. రెండో భాగంలోని 59వ నిమిషంలో బ్రైట్‌ బంతిని నెట్‌లోకి పంపడంతో.. బెంగాల్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆపై హైదరాబాద్‌ గోల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసింది. ఇక మ్యాచ్ బెంగాల్‌దే అనుకున్న సమయంలో హైదరాబాద్ ఆటగాడు అడ్రియెన్‌ అద్భుతం చేశాడు. 92వ నిమిషంలో అడ్రియెన్‌ గోల్ బాదాడు. ఈ గోల్‌తో హైదరాబాద్‌ డ్రాతో గట్టెక్కింది.

ప్రస్తుతం హైదరాబాద్‌ ఎఫ్‌సీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. 17 మ్యాచులు ఆడిన హైదరాబాద్‌ 5 విజయాలు, మూడు ఓటములను ఎదుర్కొని 24 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక ఈస్ట్‌ బెంగాల్‌ 17 మ్యాచులు ఆడి మూడు విజయాలతో 9వ స్థానంలో ఉంది. శనివారం రాత్రి చెన్నయిన్ ఎఫ్‌సీతో గోవా ఎఫ్‌సీ తలపడనుంది. ఈ మ్యాచులో గోవా ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగనుంది. గోవా చివరి ఐదు మ్యాచులలో ఒక్కటి కూడా ఓడిపోలేదు. ఇక చెన్నయిన్ ఏకంగా మూడు ఓడిపోయింది.

పాయింట్ల పట్టికలో ముంబై సిటీ, ఏటికే మోహన్ బగాన్, హైదరాబాద్‌ ఎఫ్‌సీ టాప్-3లో ఉన్నాయి. 16 మ్యాచులలో 10 విజయాలు అందుకుని 34 పాయింట్లతో ముంబై అగ్రస్థానంలో ఉంది. 16 మ్యాచులు ఆడిన ఏటికే 10 విజయాలతో 33 పాయింట్లు ఖాతాలో వేసుకుని రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్‌ ఐదు విజయలతో 24 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. గోవా ఎఫ్‌సీ, నార్త్ ఈస్ట్ యునైటెడ్ టాప్-5లో ఉన్నాయి.

Story first published: Saturday, February 13, 2021, 10:59 [IST]
Other articles published on Feb 13, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+