రిషభ్ పంత్‌కు మిడిల్ ఫింగర్ చూపించిన రోహిత్ శర్మ ( వైరల్ వీడియో)!

పుణె: టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు మిడిల్ ఫింగర్ చూపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అయితే రోహిత్ అలా చూపించడానికి కారణం కరోనా టెస్ట్. అవును ప్రస్తుతం బయో బబుల్‌లో ఉంటూ మ్యాచ్‌లు ఆడుతున్న క్రికెటర్లు.. నిబంధనల మేరకు తరుచూ కోవిడ్ పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే తొలి వన్డే అనంతరం టెస్ట్ చేయించుకున్న రోహిత్ శర్మను.. రిషభ్ పంత్ సరాదాగా పలకరించే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా కొంత ఫన్ క్రియేట్ చేయాలని వీడియో కూడా తీశాడు. కానీ కరోనా టెస్ట్‌తో తీవ్ర చికాకుకు గురైన హిట్ మ్యాన్ తన ఫ్రస్టేషన్‌ను పంత్‌పై చూపించాడు.
కైసే భయ్యా..
కరోనా టెస్ట్ కోసం ముక్కు నుంచి శాంపిల్స్ తీసిచ్చిన రోహిత్ శర్మను 'కైసే హో భయ్యా?' (ఎలా ఉంది?) అంటూ ప్రశ్నించాడు. దీంతో చాలా అసహనానికి గురైన రోహిత్ శర్మ తన మిడిల్ ఫింగర్ చూపించాడు. ఇక ఈ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్న పంత్.. కరోనాతో క్రికెటర్లు ఎలా ఇబ్బంది పడుతున్నారో తెలియజేసే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. పంత్‌తో ఉన్న చనువుతోనే రోహిత్ అలా చూపించాడని, అందులో తప్పేముందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

రోహిత్‌కు గాయం..
ఇక ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో రిషభ్ పంత్‌కు అవకాశం దక్కలేదు. అతని స్థానంలో కేఎల్ రాహుల్ బరిలోకి అదరగొట్టాడు. ఇక రోహిత్ శర్మ(28) అంచనాలు అందుకోలేకపోయాడు. వుడ్ వేసిన బంతి రోహిత్ కుడి మోచేతికి బలంగా తాకింది. నొప్పికి రెండుసార్లు మైదానంలోనే చికిత్స చేయించుకొని ఆట కొనసాగించిన అతను ఆ తర్వాత ఫీల్డింగ్‌కు రాలేదు. అయితే అతను గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. సెకండ్ వన్డేకు ఇంకా టైమ్ ఉండటంతో ఆలోపు పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని అతని ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.

చెలరేగిన గబ్బర్..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' శిఖర్ ధావన్ (106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 98) సెంచరీ చేజార్చుకోగా... కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 నాటౌట్), కృనాల్ పాండ్యా (31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 నాటౌట్), కోహ్లీ (60 బంతుల్లో 6 ఫోర్లతో 56) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం ఇంగ్లండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. బెయిర్‌స్టో (66 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 94) టాప్ స్కోరర్ కాగా, జేసన్ రాయ్ (35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 46) రాణించాడు. ప్రసిధ్ కృష్ణకు 4, శార్దుల్‌కు 3 వికెట్లు దక్కాయి. రెండో వన్డే శుక్రవారం ఇదే వేదికగా జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications