India vs England: ఫాస్టెస్ట్ ఓపెనర్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డు!

అహ్మదాబాద్: ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఓపెనర్‌గా టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు.ఇంగ్లండ్‌తో మొతేరా మైదానం వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హిట్‌మ్యాన్(49) తృటిలో హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు. అయినా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు ఛాంపియన్‌షిప్ ఓపెనర్ల జాబితాలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ తర్వాత డేవిడ్ వార్నర్(948), డీన్ ఎల్గర్(848) ఉన్నారు.

తొలి ఆసియా ప్లేయర్‌గా
అలాగే టెస్టు చాంపియన్‌షిప్‌లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి ఆసియా ప్లేయర్‌గానూ హిట్‌మ్యాన్ రికార్డు నెలకొల్పాడు. మరోవైపు టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానె (1,068) సైతం ఈ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. భారత్ నుంచి ఈ ఇద్దరే ఈ ఘనతను అందుకున్నారు. ఈ జాబితాలో మార్నస్ లబుషేన్(1,675), జోరూట్(1,630), స్టీవ్‌స్మిత్(1,341), బెన్‌స్టోక్స్ (1,301)లు మాత్రమే భారత ఆటగాళ్లకన్నా ముందున్నారు.
మయాంక్ రికార్డు బ్రేక్..
ఇదే ఇన్నింగ్స్‌తో రోహిత్.. టీమిండియా మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. టెస్టుల్లో 17 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి ఆసియా ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇదివరకు మయాంక్ 19 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ కన్నా ముందు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్‌స్మిత్ సరసన చేరాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ మాజీ ఓపెనర్లు హర్బర్ట్ సక్లిఫ్ 13 ఇన్నింగ్స్, లెన్ హుట్టన్ 16 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించి తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
స్టోక్స్ సూపర్ బాల్..
ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఓపికగా ఆడిన రోహిత్ శర్మ(49) ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సూపర్ బాల్‌కు ఎల్బీగా వెనుదిరిగాడు. స్టోక్స్ వేసిన 50 ఓవర్ ఆఖరి బంతిని పుల్ చేయబోయిన హిట్‌మ్యాన్ వికెట్లు ముందు అడ్డంగా దొరికిపోయాడు. బంతి అనూహ్యంగా స్వింగ్ అవ్వడంతో అంచనా వేయలేకపోయాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

పంత్ హాఫ్ సెంచరీ..
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. 24/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ 146 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. ఓవైపు పుజారా(17), విరాట్ కోహ్లీ(0), రహానే(27) విఫలమైనా రోహిత్.. నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ స్టోక్స్ దెబ్బతో అతను కూడా ఔటవ్వడం, ఆ వెంటనే అశ్విన్(13) కూడా పెవిలియన్ చేరడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుంధర్(24 బ్యాటింగ్)తో కలిసి యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్(55 బ్యాటింగ్) ఆదుకున్నాడు. ఆచితూచి ఆడుతూ.. ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే 82 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో కెరీర్‌లో 7వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications