For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హెల్మెట్‌తో రోహిత్ శర్మ స్లిప్ ఫీల్డింగ్.. ఇదెక్కడి కామెడీ అంటూ నెటిజన్ల సెటైర్లు!

India vs England: Rohit Sharma becomes a meme material on Twitter as He wears helmet in 2nd slip
Ind vs Eng 2021 : Rohit Sharma Slip Fielding With Helmet During 1st Test Against England

చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తన చేష్టలతో మైదానంలో నవ్వులు పూయించాడు. హెల్మెట్ ధరించి మరి సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేశాడు. రోహిత్ ఇలా హెల్మెట్ పెట్టుకొని ఫీల్డింగ్ చేయడాన్ని చూసి భారత ఆటగాళ్లు ముసి ముసిగా నవ్వుకున్నారు. థర్డ్ స్లిప్‌లో ఉన్న అజింక్యా రహానేతో పాటు వికెట్ కీపర్ రిషభ్ పంత్ అయితే ఓ ఓవర్ మొత్తం నవ్వుతూనే కనిపించారు. ఇక రోహిత్ శర్మ హెల్మెట్ పెట్టుకొని ఫీల్డింగ్ చేయడంపై భారత అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సెటైరికల్ మీమ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

ఇంతకేం జరిగిందంటే..?

ఇంతకేం జరిగిందంటే..?

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 38వ ఓవర్‌లో ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ బౌలింగ్‌‌కు రాగా.. పర్యటక జట్టు కెప్టెన్ జో రూట్ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. ఆ ఓవర్‌లో సెకండ్ బాల్‌ను రూట్ డిఫెన్స్ ఆడగా బంతి గాల్లోకి లేచి రోహిత్‌కు ముందు దూరంగా పడింది. దాంతో కొంచెం ముందుకు వచ్చి రోహిత్ శర్మ.. అప్పటి వరకూ షార్ట్ లెగ్‌‌లో ఫీల్డింగ్ చేసిన మరో ఓపెనర్ శుభమన్ గిల్ నుంచి హెల్మెట్ తీసుకుని వేసుకున్నాడు. దాంతో ఇటు కీపర్ రిషబ్ పంత్.. అటు థర్డ్ స్లిప్‌లో ఉన్న అజింక్య రహానే నవ్వును ఆపుకోలేకపోయారు.

కోహ్లీ వ్యూహం..

స్పిన్నర్లు అశ్విన్, నదీమ్ బౌలింగ్ సమయంలో బ్యాట్స్‌మెన్‌కు అతి సమీపం (షార్ట్ లెగ్)లో శుభమన్ గిల్ ఫీల్డింగ్ చేస్తూ కనిపించాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో స్పిన్నర్, పేసర్ స్పెల్‌ను విరాట్ కోహ్లీ వేయించగా.. ఓవర్ బ్రేక్‌లో ఆ హెల్మెట్‌ను డ్రింక్స్ బాయ్‌ చేతికి ఇచ్చి శుభమన్ గిల్ పంపిస్తూ కనిపించాడు. కానీ.. ఇషాంత్ ఓవర్‌కు ముందు ఆ హెల్మెట్‌ను తీసుకున్న రోహిత్ శర్మ.. దాన్ని ధరించి స్లిప్‌లో ఫీల్డింగ్ చేశాడు.

అభిమానుల సెటైర్లు..

ఇక రోహిత్ స్లిప్‌లో హెల్మెట్ పెట్టుకొని ఫీల్డింగ్ చేయడంపై అభిమానులు ఫన్నీగా స్పందిస్తున్నారు. అభిమానులను ఎదో విధంగా హిట్ మ్యాన్ అలరిస్తూనే ఉంటాడని ఒకరు కామెంట్ చేయగా.. కుదిరితో బ్యాట్ లేకుంటే మైదానంలో తన సరదా పనులతో రోహిత్ అలరిస్తాడని మరొకరు కామెంట్ చేస్తున్నారు. రోహిత్ ఉంటే జట్టులో ఫన్ ఉంటుందని, ఆటగాళ్లను ఉత్తేజపరచడానికి ఇలాంటి పనులు చేస్తుంటాడని మరొకరు కామెంట్ చేశారు. హెల్మెట్ పెట్టుకొని ఫీల్డింగ్ చేస్తున్న ఫొటోతో ఫన్నీ మీమ్స్ ట్రేండ్ చేస్తున్నారు.

స్మిత్‌ను రెచ్చగొడుతూ..

ఇక మైదానంలో రోహిత్ శర్మ ఇలా కామెడీ చేయడం ఇదే తొలిసారి కాదు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన చివరి టెస్టులో కూడా హిట్ మ్యాన్ స్టీవ్‌స్మిత్‌ను ఆట పట్టించే ఉద్దేశంతో ఫీల్డింగ్ చేస్తూ.. ఓవర్ మధ్యలో క్రీజులోకి వెళ్లి తాను బ్యాటింగ్ చేస్తున్నట్లు స్టిల్ ఇచ్చాడు. అంతకముందు టెస్టులో రిషబ్ పంత్ బ్యాటింగ్‌కి వచ్చే ముందు అలా క్రీజులో స్టిల్ ఇచ్చే నెపంతో.. పంత్ గార్డ్ మార్క్‌ను స్మిత్ చెరిపేసాడని భారత అభిమానులు విమర్శించారు. కానీ స్మిత్ కన్నా ముందే మైదాన సిబ్బంది క్రీజును క్లీన్ చేశారు. తరువాత ఈ వీడియో బయటకు రావడంతో స్మిత్ విషయంలో పొరపడ్డామని భారత ఫ్యాన్స్ కామెంట్ చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతుంది. 62 ఓవర్లలో 2 వికెట్లకు 159 రన్స్ చేసింది. క్రీజులో డాబ్ సిబ్లే(60), జోరూట్ (56) ఉన్నారు.

Story first published: Friday, February 5, 2021, 15:37 [IST]
Other articles published on Feb 5, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+