India vs England: వారెవ్వా రిషభ్ పంత్.. వాటే క్యాచ్.. దద్దరిల్లిన చెపాక్ ( వీడియో)

చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఫస్ట్ టెస్ట్‌లో క్యాచ్‌లు నేలపాలు చేసి విమర్శలు ఎదుర్కొన్న ఈ యువ వికెట్ కీపర్.. సెకండ్ టెస్ట్‌లో మాత్రం సత్తా చాటుతున్నాడు. ముందుగా బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీతో తన ఫామ్‌ను కొనసాగించిన ఈ డాషింగ్ ప్లేయర్.. కీపింగ్‌లోనూ మైమరిపిస్తున్నాడు. పంత్ స్పైడర్ మ్యాన్ క్యాచ్ వల్ల స్వదేశంలో ఫస్ట్ టెస్ట్ ఆడుతున్న మహ్మద్ సిరాజ్ తొలి ఓవర్ ఫస్ట్ బాల్‌కే వికెట్ దక్కించుకున్నాడు.
అవాక్కయ్యారు..
సిరాజ్ సూపర్ బౌలింగ్.. పంత్ స్టన్నింగ్ కీపింగ్‌తో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ ఓలీ పోప్ (22) నిరాశగా పెవిలియన్ చేరాడు. 38 ఓవర్‌లో సిరాజ్ వేసిన తొలి బంతి లెగ్‌సైడ్ వెళ్తుండగా పోప్ థర్డ్‌మ్యాన్ బౌండరీ వైపు మళ్లించే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్‌ను తాకుతూ వెళ్లగా.. ఎడమవైపు గాల్లోకి డైవ్ చేసిన పంత్ ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. కిందపడే క్రమంలో చేజారినా బంతిపైనే కన్నేసిన పంత్.. రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. ఈస్టన్నింగ్ క్యాచ్‌లో మైదానంలోని ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు, టీవీ ముందున్న ప్రేక్షకులు సైతం సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు.
సహచర ఆటగాళ్లంతా పంత్‌ను ప్రశంసించారు. ఇక ఆస్ట్రేలియాలో స్ఫూర్తిదాయక బౌలింగ్ ప్రదర్శన చేసిన సిరాజ్ స్వదేశంలో వేసిన తొలి బంతికే వికెట్ తీసి తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ వికెట్ అనంతరం గాల్లోకి చేతులు చూపుతూ తన తండ్రికి నివాళులర్పించాడు.

పంత్‌పై ప్రశంసల జల్లు..
ఈ స్టన్నింగ్ క్యాచ్‌తో చెపాక్ మైదానంలో రిషభ్ పంత్ పేరు దద్దరిల్లింది. అభిమానులంతా పంత్ పేరును ఉచ్చరిస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇక ట్విటర్‌లో కూడా పంత్ సన్నింగ్ క్యాచ్‌పై ప్రశంసల జల్లు కురిస్తుంది. స్టన్నింగ్ క్యాచ్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అయితే ఇలానే ఉంటుందని, పంత్ పంటాస్టిక్ కీపింగని ఇంకొందరు కొనియాడుతున్నారు. రోజురోజుకి పంత్ కీపింగ్ మెరుగువుతుందని ప్రశంసిస్తున్నారు.

కష్టాల్లో ఇంగ్లండ్..
పంత్ సూపర్ క్యాచ్‌తో ఇంగ్లండ్ 87 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓ వైపు అశ్విన్ స్పిన్‌తో ముప్పుతిప్పులు పెడుతుండగా.. మరోవైపు ఇతర బౌలర్లు కట్టడి చేస్తూ ఇరుకున పెడుతున్నారు. ఓపెనర్ రోరీ బర్న్స్(0)ను పెవిలియన్ చేర్చి ఇషాంత్ శర్మ శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ డామ్ సిబ్లీ(16), డాన్ లారెన్స్(9), బెన్ స్టోక్స్‌ను అశ్విన్ ఔట్ చేశాడు. కీలక జోరూట్(6)ను అక్షర్ క్యాచ్‌ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం క్రీజులో మొయిన్ అలీ, బెన్ ఫోక్స్ ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications