అశ్విన్‌తో వ్యూహం..
నాలుగు రోజు ఆటలో డానియల్ లారెన్స్ (26) వికెట్ కోసం రిషభ్ పంత్.. అశ్విన్‌తో కలిసి వ్యూహం రచించి.. సక్సెస్ అయ్యాడు. స్పిన్నర్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో డానియల్ లారెన్స్ పదే పదే క్రీజు వెలుపలికి వెళ్తూ బంతిని డిఫెన్స్ చేస్తూ కనిపించాడు. దాంతో.. అశ్విన్ బౌలింగ్‌కు రాగానే.. అతని వద్దకు వెళ్లిన రిషభ్ పంత్.. తన ప్లాన్ గురించి చెప్పాడు. ఆ వ్యూహానికి అశ్విన్ కూడా అంగీకరిస్తున్నట్లు తలూపాడు. ప్లాన్‌లో భాగంగా వేసిన తొలి బంతికే డానియల్ లారెన్స్ స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.

ట్రాప్‌లో పడ్డ లారెన్స్..
డానియల్ లారెన్స్ క్రీజు వెలుపలికి వచ్చి బంతి ఆడబోతున్నట్లు ముందే పసిగట్టిన అశ్విన్.. కీపర్ రిషబ్ పంత్ చెప్పినట్లు బంతిని లెగ్ స్టంప్‌కి వెలుపలగా విసిరి కట్ చేశాడు. ఊహించని విధంగా బంతి పడటంతో.. దాన్ని అడ్డుకునేందుకు లారెన్స్ చాలా ప్రయత్నించాడు.
కానీ.. అతని కాళ్ల మధ్యలో నుంచి బంతి వెనక్కి వెళ్లగా.. ఆ బంతిని అందుకున్న రిషబ్ పంత్ డైవ్ చేస్తూ క్షణాల్లో బెయిల్స్‌ను ఎగరగొట్టేసాడు. స్టంపౌట్ ప్రమాదాన్ని పసిగట్టి వెనక్కి వచ్చేందుకు డేనియల్ లారెన్స్ డైవ్ చేసినా లాభం లేకపోయింది. గతంలో ధోనీ కూడా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ కదలికల్ని బట్టి స్పిన్నర్లతో కలిసి ఇలానే వికెట్ల వెనుక నుంచి వ్యూహాలు రచించేవాడు. ప్రస్తుతం ఈ స్టంపౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

భారత్ ఘన విజయం..
ఇక లాస్ట్ వికెట్‌గా వెనుదిరిగిన మొయిన్ అలీ(18 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 43)ని కూడా పంత్ స్టంపౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. 9వ స్థానంలో క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ వచ్చి రావడంతో బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వరుస సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. పదే పదే ముందుకు వస్తూ భారీ షాట్లు ఆడాడు.
ఈ క్రమంలోనే కుల్దీప్ బౌలింగ్‌లో క్రీజును వీడిన అలీని పంత్ స్టంపౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ విజయం లాంఛనమైంది. 53/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగు రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. 164 పరుగులకు కుప్పకూలింది. దాంతో భారత్‌కు 317 పరుగుల భారీ విజయం దక్కింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 5 వికెట్లు తీయగా.. అశ్విన్ మూడు, కుల్దీప్ రెండు వికెట్లు పడగొట్టారు.


Click it and Unblock the Notifications
