Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: ఎవరైనా ఇలా ఆడగలరా.. రిషబ్ పంత్ సరికొత్త షాట్‌కి ఫ్యాన్స్ ఫిదా (వీడియో)

India vs England: Rishabh Pant hits reverse scoop six in Jofra Archers bowling

అహ్మదాబాద్: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఇటీవల ముగిసిన ఆఖరి టెస్ట్‌లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడిన విషయం తెలిసిందే. ఈరోజు మరో స్టార్ పేసర్ జోప్రా ఆర్చర్ బౌలింగ్‌లోనూ సాహసోపేత షాట్‌తో క్రికెట్ అభిమానులను సంభ్రమాశ్చర్యాలకి గురిచేశాడు. అహ్మదాబాద్‌ వేదికగా మొతేరా స్టేడియంలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో పంత్ రివర్స్ ల్యాప్ షాట్ ఆడాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రివర్స్ స్వీప్ షాట్

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (1), కెప్టెన్ విరాట్ కోహ్లీ (0) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్.. ఎలాంటి ఒత్తిడికి గురవకుండా రివర్స్ లాప్ సిక్స్ బాదేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన జోప్రా ఆర్చర్.. ఐదో బంతిని గుడ్ లెంగ్త్ రూపంలో సంధించాడు. ముందుగానే రివర్స్ స్వీప్‌కి సిద్ధమైపోయిన పంత్.. ఊహించని విధంగా ఆడాడు. గంటకి 140.6 కిమీ వేగంతో దూసుకొచ్చిన బంతిని రివర్స్ స్వీప్ రూపంలో నేరుగా స్టాండ్స్‌లోకి తరలించాడు. స్లిప్ ఫీల్డర్ల మీదగా వెళ్లిన బంతి స్టాండ్స్‌లో పడింది.

ఎవరైనా ఇలా ఆడగలరా?

రిషబ్ పంత్ కొట్టిన ఈ సిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంత్ షాట్‌ చూసి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ వీడియోకు లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'ఎవరైనా ఇలా ఆడగలరా?' అని ఒకరు కామెంట్ చేయగా.. 'చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది' అని మరొకరు ట్వీట్ చేశారు. 'పంత్.. తన సొంత ప్రపంచంలో జీవిస్తున్నాడు', 'నేను ఇంకా నమ్మలేకపోతున్నా' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆరంభం నుంచే దూకుడుగా కనిపించిన పంత్‌.. 10 ఓవర్‌లో పెవిలియన్‌ చేరాడు. స్టోక్స్‌ బౌలింగ్‌లో డీప్‌ స్వేర్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న జానీ బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

అండర్సన్‌ బౌలింగ్‌లో

మొతేరా మైదానం వేదికగా ముగిసిన ఆఖరి టెస్ట్‌లో రిషబ్ పంత్ రివర్స్ స్వీప్ షాట్ ఆడిన విషయం తెలిసిందే. పంత్‌ 89 పరుగుల వద్ద ఉండగా.. జేమ్స్ అండర్సన్‌ బౌలింగ్‌లో ఆడిన రివర్స్‌ స్కూప్‌ షాట్‌ కూడా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో ఎవరైనా ఇలాంటి షాట్‌ ఆడతారా అనేలా చేశాడు. కొత్త బంతితో తనని కట్టడి చేద్దామని చూసిన అండర్సన్‌ను స్పైడర్ పంత్ ఆశ్చర్యానికి గురి చేశాడు. స్లిప్‌ ఫీల్డర్ల తలలపై నుంచి ఆడిన ఆ షాట్‌ అప్పుడు కూడా వైరల్‌గా మారింది.

మోస్తరు స్కోరుకే పరిమితం

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 124 పరుగులే చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (67; 48 బంతుల్లో 8×4, 1×6) మాత్రమే అర్ధ శతకంతో రాణించి ఆఖరి ఓవర్లో ఔటయ్యాడు. పంత్‌ (21; 23 బంతుల్లో 2×4, 1×6) కాసేపు అలరించాడు. హార్దిక్‌ పాండ్యా (19; 21 బంతుల్లో 1×4, 1×6) సైతం కొంత సమయం అయ్యర్‌కు అండగా నిలిచాడు. ఆర్చర్‌ 3 వికెట్లు తీశాడు.

India vs England: అయ్యర్ హాఫ్ సెంచరీ.. ఇంగ్లండ్ లక్ష్యం 125!!

Story first published: Friday, March 12, 2021, 22:01 [IST]
Other articles published on Mar 12, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+