Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: సిక్సర్‌తో రిషభ్ పంత్ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా భారత్!

India vs England: Rishabh Pant hits 3rd Test hundred, Indias lead goes past 85

అహ్మదాబాద్: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ మరోసారి దుమ్మురేపాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఫామ్ అందుకున్న ఈ యువ వికెట్ కీపర్.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లోనూ జోరు కనబర్చాడు. స్టార్ బ్యాట్స్‌మెన్ విఫలమైన వేళ.. ధాటైన ఇన్నింగ్స్‌తో శతకం బాదాడు. డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో పంత్ తన మార్క్ సిక్సర్‌తో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 146 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును పంత్ తన ధనాధన్ ఇన్నింగ్స్‌తో గట్టెక్కించాడు. ఓ దశలో భారత్ కనీసం 200 పరుగులైనా చేస్తుందా? అనిపించింది.

కానీ క్రీజులోకి వచ్చిన యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సాయంతో పంత్ చెలరేగాడు. ఈ క్రమంలో జోరూట్ వేసిన 84 ఓవర్ తొలి బంతిని స్క్వేర్ లెగ్ దిశగా భారీ సిక్సర్ కొట్టిన పంత్.. 115 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో కెరీర్‌లో మూడో సెంచరీని అందుకున్నాడు. అయితే జేమ్స్ అండర్సన్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో భారీ షాట్‌కు యత్నించిన పంత్.. షార్ట్ మిడ్‌వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రూట్‌కు చిక్కాడు. దాంతో తీవ్ర నిరాశగా పెవిలియన్ చేరాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్‌తో(5 బ్యాటింగ్) సుంధర్ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. పంత్ ఔటైనా.. ఏ మాత్రం జోరు తగ్గకుండా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలోనే స్టోక్స్ వేసిన 87 ఓవర్ తొలి బంతిని ఫోర్, ఆ తర్వాత క్విక్ డబుల్ తీసి కెరీర్‌లో రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతానికి 89 ఓవర్లలో 7 వికెట్లకు 280 పరుగులు చేయగా... భారత్‌కు 75 పరుగుల ఆధిక్యంతో దూసుకెళ్తుంది. ఇక ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.

Story first published: Friday, March 5, 2021, 17:07 [IST]
Other articles published on Mar 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+