Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: పుజారా, రిషభ్ పంత్ హాఫ్ సెంచరీ!

India vs England: Rishabh Pant, Cheteshwar Pujara fifties revive India after Kohli, Rahane exit

చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లో చతేశ్వర్ పుజారా(111 బంతుల్లో 7 ఫోర్లతో 53 బ్యాటింగ్), రిషభ్ పంత్(44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 54 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. దాంతో టీ బ్రేక్ సమాయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ముఖ్యంగా రిషభ్ పంత్ ఆస్ట్రేలియా గడ్డపై చూపించిన జోరునే కొనసాగిస్తున్నాడు. 73 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన క్లిష్ట స్థితిలో క్రీజులోకి వచ్చిన పంత్ వచ్చిరావడంతోనే భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు పుజారా కూడా తన శైలికి భిన్నంగా క్రీజు బయటకు వచ్చి బౌండరీలు తరలించాడు.

సిక్సర్లతో పంత్ వీర విహారం..

సిక్సర్లతో పంత్ వీర విహారం..

ఈ ఇద్దరూ వన్డే తరహాలో బ్యాటింగ్ చేయడంతో స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఇక లీచ్ బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్స్ మీదుగా బౌండరీ తరలించిన ఫుజారా.. 106 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది అతనికి కెరీర్‌లో 29 హాఫ్ సెంచరీ. ఆ వెంటనే పంత్ కూడా జాక్ లీచ్ బౌలింగ్‌లోనే మిడాఫ్ మీదుగా బౌండరీ సాధించి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 40 బంతుల్లోనే 50 పరుగుల మార్క్‌ను అందుకున్న పంత్‌‌కు ఇది కెరీర్‌లో ఐదవ ఫిఫ్టీ. పంత్ 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో బౌండరీల ద్వారానే 40 పరుగులు చేయడం గమానార్హం. లీచ్ వేసిన 32 ఓవర్లలో పంత్ కొట్టిన రెండు వరుస సిక్స్‌లు ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచాయి.

వెను వెంటనే..

వెను వెంటనే..

అంతకు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ(11)తో పాటు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే(1) వికెట్లను టీమిండియా వెంటవెంటనే కోల్పోయింది. ఈ ఇద్దర్ని డామ్ బెస్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చి దెబ్బ తీశాడు. తొలుత కెప్టెన్ విరాట్ కోహ్లీ(11)‌ని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన డామ్ బెస్.. తన మరుసటి ఓవర్‌లోనే రహానే(1)ను కూడా జోరూట్ సూపర్ డైవ్ క్యాచ్‌తో వెనక్కి పంపాడు. డామ్ బేస్ వేసిన టర్న్ కమ్ షార్ప్ బౌన్సర్‌ను అంచనా వేయడంలో విఫలమైన కోహ్లీ.. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న పోప్‌కు చిక్కాడు. బేస్ మరుసటి ఓవర్‌లో అతను వేసిన ఫుల్‌టాస్‌ను ముందుకు వచ్చి ఆడిన రహానే.. జోరూట్ సూపర్ డైవ్ క్యాచ్‌కు నిరాశగా వెనుదిరిగాడు.

ప్చ్.. ఓపెనర్లు..

ప్చ్.. ఓపెనర్లు..

ఓపెనర్లు రోహిత్ శర్మ(6), శుభ్‌మన్‌ గిల్(29)‌ తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఈ ఇద్దర్ని జోఫ్రా ఆర్చరే పెవిలియన్ చేర్చాడు. తొలుత రోహిత్ శర్మను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చిన ఆర్చర్.. ఆ తర్వాత వరుస బౌండరీలతో దూకుడు కనబర్చిన శుభ్‌మన్ గిల్‌ను అండర్సన్ సూపర్ క్యాచ్‌‌తో వెనక్కు పంపాడు.

ఇంగ్లండ్ 578 ఆలౌట్..

ఇంగ్లండ్ 578 ఆలౌట్..

అంతకుముందు ఇంగ్లండ్‌ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 578 పరుగులకు ఆలౌట్‌ అయింది. 555/8 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన రూట్ సేన మరో 23 పరుగులు జోడించి తొలి ఇన్సింగ్స్‌ను ముగించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ జో రూట్‌ (377 బంతుల్లో 218; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) డబుల్‌ సెంచరీతో చెలరేగగా.. బెన్‌ స్టోక్స్‌ (118 బంతుల్లో 82; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), డామ్ సిబ్లీ(87) శతకాలను చేజార్చుకున్నారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ మూడేసి వికెట్లు తీయగా.. షబాజ్ నదీమ్, ఇషాంత్ రెండు వికెట్లు పడగొట్టారు.

Story first published: Sunday, February 7, 2021, 14:55 [IST]
Other articles published on Feb 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+