
అంతా వాతావరణమే చేసింది
టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌తో తన యూట్యూబ్ ఛానెల్లో రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ...'రెండో టెస్ట్ మ్యాచ్‌కు ముందు లార్డ్స్‌లో వాతావరణం వేడిగా ఉంది. దీంతో తుది జట్టులో ఆడేందుకు సిద్ధంగా ఉండాలని అంతకుముందే జట్టు యాజమాన్యం నాతో చెప్పింది. కానీ ఒక్కసారిగా మ్యాచ్ ప్రారంభమయ్యే రోజు ఉదయం అనుకోకుండా వర్షం కురిసింది. ఆ తర్వాత కూడా ఆకాశం మేఘాలతోనే నిండి ఉంది. దీంతో తిరిగి నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తోనే భారత్ బరిలోకి దిగింది. అలా రెండో టెస్టులో నేను ఆడకపోవడానికి వాతావరణమే కీలక పాత్ర పోషించింది' అని తెలిపాడు.

అంత తేలిక కాదు
వేడి గాలులు వచ్చాకే నా బెర్త్ గురించి చెబితే బావుండేది కదా.. అనవసరంగా ఆశపడ్డానని మేనేజ్‌మెంట్‌తో అన్నాను అని తన యూట్యూబ్ చానెల్‌లో రవిచంద్రన్ అశ్విన్ సరదాగా తెలిపాడు. ఇదే విషయంపై స్పందించిన శ్రీధర్.. టీమిండియాకు మేటి బౌలింగ్ యూనిట్ ఉందని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే ప్రపంచపు అత్యుత్తమ స్పిన్నర్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం అంత తేలిక కాదన్నాడు.
ఓపెనర్ల గురించి మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశారన్నాడు. రాహుల్ శతకంతో మెరవగా, రోహిత్ తనదైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్నాడని మెచ్చుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో 89 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన బుమ్రా, షమీ మేటి ప్రదర్శన చేశారని ప్రశంసించాడు.
బీసీసీఐ పెద్దలతో విరాట్ కోహ్లీ రహస్య సమావేశం.. అసలు విషయం ఏంటంటే?

నలుగురు పేసర్ల సూత్రానికే కోహ్లీ మొగ్గు
ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు.. దశాబ్దాలుగా భారత బౌలింగ్ దళం కూర్పు ఇదే. అయితే విదేశీ పిచ్‌లపై అదనపు స్పిన్నర్‌ను తీసుకోవడం ద్వారా ఫలితం లేదని భావించిన విరాట్ కోహ్లీ.. నలుగురు పేసర్ల సూత్రానికే మొగ్గు చూపాడు. అలసట లేకుండా జోడీలుగా సుదీర్ఘ స్పెల్స్ వేసేందుకు ఇది బాగా తోడ్పడింది.
గతంలో ఓ పేస్ జోడీ బౌలింగ్ దాడి కొనసాగించి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెస్తే.. మరో ఎండ్ నుంచి పరుగులు చేసేందుకు స్పిన్నర్లు అవకాశం కల్పించి ఆ ఒత్తిడిని దూరం చేసేవారు. దీంతో పేసర్లు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయ్యేది. ప్రస్తుతం అందుకు భిన్నంగా.. కొత్త బంతితో బుమ్రా, షమీ నిప్పులు చెరుగుతుంటే.. బంతి పాతబడ్డాక ఇషాంత్, సిరాజ్ ప్రత్యర్థులతో ఆటాడుకుంటున్నారు.

పేసర్లే 19 వికెట్లు
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 364 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 391 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 194 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన సందర్భంలో షమీ (56), బుమ్రా (34) నాటౌట్‌గా నిలిచి ఎనిమిదో వికెట్‌కు 89 పరుగుల అత్యంత కీలక భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలోనే భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 298/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా.. ఆపై ఇంగ్లండ్ 120 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో భారత్ నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగింది. పేసర్లే 19 వికెట్లు పడగొట్టడం విశేషం.


Click it and Unblock the Notifications












