For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: వందేళ్లలో ఇదే తొలిసారి.. టెస్ట్ క్రికెట్‌లో అశ్విన్‌ అరుదైన ఘనత!!

India vs England: Ravichandran Ashwin achieves unique feat in Test cricket after 33 years
Ind vs Eng 2021,1st Test: Ravichandran Ashwin Achieves Unique Feat In Test Cricket | Oneindia telugu

చెన్నై: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ తీసిన తొలి భారత స్పిన్నర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటివరకు ఏ భారత స్పిన్నర్ కూడా టెస్ట్ ఇన్నింగ్స్ మొదటి బంతికి వికెట్ తీయలేదు. మరోవైపు ఇన్నింగ్స్ మొదటి బంతికి వికెట్ తీసిన మూడో స్పిన్నర్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. చెన్నై చెపాక్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఈ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.

 337 ప‌రుగుల‌కు ఆలౌట్:

337 ప‌రుగుల‌కు ఆలౌట్:

ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 337 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 6 వికెట్ల‌కు 257 ప‌రుగుల‌తో నాలుగో రోజు సోమవారం తొలి ఇన్నింగ్స్ కొన‌సాగించిన భారత్‌.. మ‌రో 80 ప‌రుగులు జోడించి మిగ‌తా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ పర్యటనలో అదరగొట్టిన ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ (85 నాటౌట్; 138 బంతుల్లో 12x4, 2x6)‌) అద్భుత పోరాటంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా సాధించింది.రవిచంద్రన్‌ అశ్విన్ ‌(31; 91 బంతుల్లో 3x4, 1x6) అవుటైన త‌ర్వాత అవ‌త‌లి వైపు బ్యాట్స్‌మెన్ ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోవ‌డంతో సుంద‌ర్ సెంచ‌రీ చేసే అవ‌కాశాన్ని కోల్పోయాడు. ఇప్ప‌టికీ ఇంగ్లండ్ కంటే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 241 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది.

తొలి బంతికే వికెట్:

తొలి బంతికే వికెట్:

అయితే ఇంగ్లండ్ మాత్రం టీమిండియాను ఫాలోఆన్ ఆడించ‌కుండా రెండో ఇన్నింగ్స్ ఆడాల‌ని నిర్ణ‌యించుకుంది. రెండో ఇన్నింగ్స్ తొలి బంతికే ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోవ‌డం విశేషం. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ బంతిని నేరుగా రవిచంద్రన్‌ అశ్విన్‌కు అందివ్వడంతో తొలి బంతికే వికెట్‌ దక్కింది. ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ స్లీప్‌లో అజింక్య రహానే చేతికి చిక్కి ఔటయ్యాడు. దీంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో పరుగుల ఖాతా తెరవకముందే ఒక వికెట్‌ కోల్పోయింది. తద్వారా లంచ్‌ విరామానికి ముందు భారత జట్టుకు కాస్త ఊరట లభించింది.

వందేళ్ల తర్వాత:

వందేళ్ల తర్వాత:

రోరీ బర్న్స్ ఔట్ అవ్వడంతో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. 100 ఏళ్ల తర్వాత టెస్ట్ ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ తీసిన స్పిన్నర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. 1907లో దక్షిణాఫ్రికా క్రికెటర్‌ బెర్ట్‌ వాల్గర్‌ ఇలానే ఇన్నింగ్స్‌ తొలి బంతికే వికెట్‌ తీసిన స్పిన్నర్‌ కాగా.. ఆ తర్వాత ఇంతకాలానికి అశ్విన్‌ దాన్ని బ్రేక్‌ చేశాడు. అయితే ఇన్నింగ్స్‌ తొలి బంతికే వికెట్‌ తీసిన జాబితాలో మాత్రం ఇంగ్లండ్‌కు చెందిన బాబీ పీల్‌ తొలి స్థానంలో ఉన్నాడు. 1888లో బాబీ పీల్‌ ఈ ఫీట్‌ సాధించాడు.

 మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్‌:

మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్‌:

టీమిండియాతో చెపాక్‌ స్టేడియంలో తొలి టెస్టులో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ కొనసాగిస్తోంది. ఆతిథ్య జట్టు కంటే 282 పరుగుల ఆధిక్యంలో ఉన్న జో రూట్‌ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో మూడో వికెట్‌ కోల్పోయింది. ఇషాంత్ బౌలింగ్‌లో లారెన్స్ (18) ఔట్ అయ్యాడు. అంతకుముందు‌ సిబ్లీ (16) అశ్విన్‌ బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్‌ జో రూట్ (26)‌, బెన్ స్టోక్స్ (1) బ్యాటింగ్‌ కొనసాగిస్తున్నారు. ఇంగ్లండ్‌ 17 ఓవర్లలో 64 రన్స్ చేసింది.

India vs England: గొడవపడిన సిరాజ్, కుల్దీప్.. మెడ పట్టుకుని ఊపుతూ (వీడియో)

Story first published: Monday, February 8, 2021, 19:13 [IST]
Other articles published on Feb 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+