ముగిసిన భారత్ రెండో ఇన్నింగ్స్.. ఇంగ్లండ్‌కు భారీ లక్ష్యం.. మొదలైన వికెట్ల పతనం!

చెన్నై: రవిచంద్రన్ అశ్విన్(148 బంతుల్లో 14 ఫోర్లు ఒక సిక్స్‌తో 106) వీరోచిత సెంచరీ.. విరాట్ కోహ్లీ(149 బంతుల్లో 7 ఫోర్లతో 62) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌కు తోడు చివర్లో మహ్మద్ సిరాజ్(21 బంతుల్లో 2 సిక్సర్లతో 16 నాటౌట్) ధాటిగా ఆడటంతో రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 286 పరుగులు చేయగలిగింది. ఫలితంగా ఫస్ట్ ఇన్నింగ్స్ 195 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని ఇంగ్లండ్ ముందు 482 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్(4/100), మొయిన్ అలీ(4/98) నాలుగేసి వికెట్లు తీయగా.. ఓలి స్టోన్(1/21) ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్ సిబ్లీ(1) వికెట్ కోల్పోయింది. అక్షర్ బౌలింగ్‌లో సిబ్లీ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో రోరీ బర్న్స్(14 బ్యాటింగ్), డాన్ లారెన్స్(0) ఉన్నారు.

టాపార్డర్ విఫలం..
54/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్, టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా(7) అనూహ్య రీతిలో రనౌట్‌గా వెనుదిరిగాడు. అదే స్కోర్ వద్ద రోహిత్ శర్మ(26) స్టంపౌటయ్యాడు. మరో 10 పరుగుల వ్యవధిలోనే డాషింగ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్(8) కూడా స్టంప్ ఔట్‌గా వెనుదిరగ్గా.. క్రీజులోకి వచ్చే రహానే వరుస బౌండరీలతో దూకుడు కనబర్చాడు. కానీ ఆ వెంటనే షార్ట్ లెగ్ పోప్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో భారత్ 106 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆదుకున్న కోహ్లీ..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అశ్విన్‌తో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. ఓపికగా ఆడుతూ.. వీలు చిక్కిన బంతి బౌండరీలకు తరలించాడు. మరోవైపు అశ్విన్ కూడా లయ అందుకోవడంతో 156/6 స్కోర్‌తో భారత్ లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. అనంతరం మరింత జోరు పెంచిన ఈ జోడి భారత స్కోర్ బోర్డును పరుగెత్తించింది.
ఈ క్రమంలో 107 బంతుల్లో కోహ్లీ, 64 బంతుల్లో అశ్విన్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. దాంతో భారత్ 196/6తో టీ బ్రేక్‌కు వెళ్లింది. విరామం అనంతరం 6 పరుగుల వ్యవధిలోనే విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయింది. మొయిన్ అలీ బౌలింగ్‌లో విరాట్ వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూకెళ్లినా ఫలితం లేకపోయింది. దాంతో 8వ వికెట్‌కు నమోదైన 96 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

అశ్విన్ సెంచరీ..
ఆ వెంటనే కుల్దీప్(3), ఇషాంత్ శర్మ (7)కూడా వెంట వెంటనే ఔటయ్యారు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సిరాజ్‌తో అశ్విన్ పోరాడాడు. 134 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అశ్విన్‌కు ఇది కెరీర్‌లో ఐదవ సెంచరీ. మరోవైపు సిరాజ్ కూడా రెండు భారీ సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. అయితే ఓలీ స్టోన్ అశ్విన్ బౌల్డ్ చేయడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ 329 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 134 పరుగులకే ఆలౌటైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications