Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్‌కు భారీ ఆధిక్యం

 India vs England: R Ashwin takes 5 wickets as India bowl out England for 134

చెన్నై: భారత్‌తో జరుగుతున్న సెకండ్ టెస్ట్‌లో ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(5/43) ఐదు వికెట్లకు తోడుగా ఇతర బౌలర్లు, ఫీల్డర్లు సమష్టిగా రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకే కుప్పకూలింది. దాంతో భారత్‌కు 195 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో బెన్ ఫోక్స్ (42 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. ఇక భారత బౌలర్లలో అశ్విన్‌కు అండగా అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ రెండేసి వికెట్లు తీయగా.. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. అంతకు ముందు భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.

300/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 29 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓ వైపు డాషింగ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్(77 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్స్‌లతో 58 నాటౌట్) ధాటిగా ఆడినా.. మరోవైపు ఓలిస్టోన్(3/47) దెబ్బకు టెయిలండర్లు నిలబడలేకపోయారు.

అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. ఇషాంత్ శర్మ ధాటికీ ఖాతా తెరవకుండా ఓపెనర్ రోరీ బర్న్స్(0) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత అశ్విన్.. మరో ఓపెనర్ డామ్ సిబ్లీ(16), డాన్ లారెన్స్(9) ఔట్ చేయడంతో ఇంగ్లండ్ 39/4తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. అనంతరం బెన్ స్టోక్స్(9)‌ను అశ్విన్ బౌల్డ్ చేయగా.. క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేసిన ఓలి పోప్(22)ను రిషభ్ పంత్ సూపర్ క్యాచ్ సాయంతో సిరాజ్ పెవిలియన్‌కు చేర్చాడు. కొద్దిసేపటికే మొయిల్ అలీ(6) రహానే సూపర్ క్యాచ్‌లో అక్షర్ ఔట్ చేశాడు.

కొద్దిసేపటికే ఓలి స్టోన్‌ను అశ్విన్ పెవిలియన్‌కు చేర్చడంతో ఇంగ్లండ్ 106/8తో టీ బ్రేక్‌కు వెళ్లింది. బ్రేక్ అనంతరం 10 ఓవర్ల వ్యవధిలోనే ఇంగ్లండ్ ఆలౌటైంది. రిషభ్ పంత్ స్టన్నింగ్ క్యాచ్‌తో జాక్ లీచ్‌(5)ను ఇషాంత్ పెవిలియన్ చేర్చగా.. స్టువర్ట్ బ్రాడ్‌(0)ను అశ్విన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది.

Story first published: Sunday, February 14, 2021, 15:38 [IST]
Other articles published on Feb 14, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+