India vs England: రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత.. !

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న డే/నైట్ టెస్ట్‌లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 400 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఈ భారత ఆఫ్ స్పిన్నర్ గుర్తింపు పొందాడు. అశ్విన్ కన్నా ముందు శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీ ధరన్ ఈ ఘనతను అందుకున్నాడు. మురళీ ధరణ్ 72 టెస్ట్‌ల్లో 400 వికెట్ల మైలురాయిని అందుకుంటే.. అశ్విన్ 77 టెస్ట్‌ల్లో ఈ ఘనతను సాధించాడు. న్యూజిలాండ్ బౌలర్ రిచర్డ్ హ్యాడ్లీ 80 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్‌ను ఔట్ చేయడం ద్వారా ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు బెన్ స్టోక్స్‌ను ఎల్బీగా ఔట్ చేసిన అశ్విన్.. ఓలిపోప్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఫాస్టెస్ట్ ఇండియన్ బౌలర్‌గా..
ఇక భారత్ తరఫున అత్యంత వేగంగా 400 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అశ్విన్ చరిత్రకెక్కాడు. అశ్విన్ కన్నా ముందు భారత్ తరఫున కపిల్ దేవ్(434), అనిల్ కుంబ్లే(619), హర్భజన్ సింగ్(417) నాలుగు వందల వికెట్ల ఘనతను అందుకున్నారు. మూడు ఫార్మాట్లలో కలిపి ఇప్పటికే 600 వికెట్లు తీసిన అశ్విన్.. ఈ ఘనతను అందుకున్న ఐదో భారత బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే(956), హర్భజన్ సింగ్(711), కపిల్ దేవ్(687), జహీర్ ఖాన్(610) అశ్విన్ కన్నా ముందున్నారు.

బెన్ స్టోక్స్‌ను 11 సార్లు..
ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో స్టోక్స్‌ను ఔట్ చేసిన అశ్విన్ యూనిక్ రికార్డును తన పేరిట లిఖించింది. ఇప్పటి వరకు స్టోక్స్‌ను 11 సార్లు ఔట్ చేసిన అశ్విన్.. వార్నర్‌ను 10 సార్లు, అలిస్టర్ కుక్‌ను 9 సార్లు పెవిలియన్ చేర్చాడు. విదేశీ బ్యాట్స్‌మెన్‌ను అత్యధిక సార్లు ఔట్ చేసిన మూడో భారత బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ముదస్సార్ నజార్‌ను 12 సార్లు ఔట్ చేసిన కపిల్ దేవ్ టాప్‌లో ఉండగా.. అలిస్టర్ కుక్‌ను ఇషాంత్ 11 సార్లు ఔట్ చేశాడు.

ఇంగ్లండ్ 81 ఆలౌట్..
33 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 81 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్ ముందు 49 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. భారత బౌలింగ్‌లో అక్షర్ పటేల్(5/32) ఐదు వికెట్లు తీయగా.. అశ్విన్ (4/48) నాలుగు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్‌కు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకు ఆలౌటైంది. 99/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్.. కేవలం 46 పరుగుల మాత్రమే జోడించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications