Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: అలాంటి బౌలర్‌గా నన్ను గుర్తించాలని కోరుకుంటాను: ప్రసిద్ధ్‌ కృష్ణ

India vs England: Prasidh Krishna said Id like to be known as a hit-the-deck bowler

పుణె: సరైన సమయంలో జట్టు కోసం భాగస్వామ్యాలు విడదీసే బౌలర్‌గా గుర్తింపు పొందాలనుందని అరంగేట్రం పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ తెలిపాడు. వికెట్‌పై బంతిని బలంగా విసిరే పేసర్‌గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనుభవం తనకు ఎంతో ఉపయోగపడిందని ప్రసిద్ధ్‌ పేర్కొన్నాడు. మంగళవారం ఎమ్‌సీఏ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 66 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. ఇంగ్లండ్ గెలుపు ఖాయం అనుకున్న దశలో ప్రసిద్ధ్‌ తన అద్భుత బౌలింగ్‌తో మాయ చేసి.. టీమిండియాను మ్యాచులోకి తెచ్చాడు.

కీలక సమయంలో రాయ్‌ను ఔట్‌ చేసి

కీలక సమయంలో రాయ్‌ను ఔట్‌ చేసి

తొలి వన్డేతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన పాతికేళ్ల ప్రసిద్ధ్‌ కృష్ణ.. తన బౌలింగ్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ గెలిచేలా కనిపించింది. ఓపెనర్లు జేసన్‌ రాయ్‌ (46), జానీ బెయిర్‌స్టో (94) వీర విధ్వంసం సృష్టించడంతో 14 ఓవర్లకే 135 పరుగులు చేసింది.

తొలుత తన మూడు ఓవర్లలో 37 పరుగులు ఇచ్చేసిన ప్రసిద్ధ్‌.. కీలక సమయంలో రాయ్‌ను ఔట్‌ చేసి జట్టుకు బ్రేక్‌ ఇచ్చాడు. తన తర్వాతి ఓవర్లోనే ప్రమాదకర బెన్ స్టోక్స్‌ (1)ను వెనక్కి పంపి భారత్‌లో ఉత్సాహం నింపాడు. ఆపై సామ్‌ బిల్లింగ్స్‌ (18), టామ్ కరన్ (11) వికెట్లు తీశాడు. మ్యాచ్‌లో మొత్తం 8.1 ఓవర్లు బౌలింగ్ చేసిన ప్రసిద్ధ్‌.. 54 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

మూడో ఓవర్‌ తర్వాత అర్థం చేసుకున్నా

మూడో ఓవర్‌ తర్వాత అర్థం చేసుకున్నా

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రసిద్ధ్‌ కృష్ణ మాట్లాడుతూ... 'తొలి వన్డేలో ఆరంభం బాలేదు. మేం సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బంతులు వేయకపోవడంతో ఇంగ్లండ్ ఓపెనర్లు విధ్వంసకరంగా ఆడారు. అయినా మేం నమ్మకం కోల్పోలేదు. వరుసగా వికెట్లు తీయడంతో జట్టుకు మేలు జరిగింది. ఫుల్లర్‌ లెంగ్త్‌ బంతులు వేయొద్దని మూడో ఓవర్‌ తర్వాత అర్థం చేసుకున్నా. ఆ తర్వాత సరైన ప్రాంతాల్లో బంతులు విసిరి ఫలితం సాధించాను' అని తెలిపాడు. విజయ్‌ హజారె ట్రోఫీ 2021లో 7 మ్యాచులాడిన ప్రసిద్ధ్‌.. 24.5 సగటుతో 14 వికెట్లు తీశాడు.

భాగస్వామ్యాలు విడదీసే బౌలర్‌గా

భాగస్వామ్యాలు విడదీసే బౌలర్‌గా

'ఐపీఎల్‌ నాకు ఎంతో ఉపయోగపడింది. అయితే 50 ఓవర్ల ఫార్మాట్లో బలంగా పుంజుకోవడం ముఖ్యం. బంతి బలంగా విసిరే బౌలర్‌గా నన్ను గుర్తించాలని కోరుకుంటాను. అలాగే సరైన ప్రాంతాల్లో నిలకడగా బంతులు విసురుతాను. నేను మరింత మెరుగవుతాను. భాగస్వామ్యాలు విడదీసే బౌలర్‌గా సుదీర్ఘకాలం కొనసాగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే జట్టుకు ప్రతిసారీ అది అవసరమే. అందుకే ఆ పని చేయడం నాకు సంతోషం' అని ప్రసిద్ధ్‌ కృష్ణ తెలిపాడు. ఆరడుగులకు పైగా ఎత్తున్న ప్రసిద్ధ్‌ అదనపు బౌన్స్‌ రాబట్టడంలో దిట్ట. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు అతడు ఆడుతున్నాడు.

అరంగేట్రం వన్డేలో అత్యధిక వికెట్లు:

అరంగేట్రం వన్డేలో అత్యధిక వికెట్లు:

భారత్ తరఫున అరంగేట్రం వన్డేలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాని పరిశీలిస్తే.. 1997లో వెస్టిండీస్‌పై స్పిన్నర్ నోయల్ డేవిడ్ 3/21తో ఇప్పటి వరకూ టాప్‌లో ఉన్నాడు. 8 ఓవర్లు వేసి మూడు వికెట్లు పడగొట్టాడు. తర్వాత స్థానాల్లో వరుణ్ అరోణ్ (3/24), హార్దిక్ పాండ్యా (3/31), పీయూస్ చావ్లా (3/37)లు ఉన్నారు. తొలి వన్డేలో 4 వికెట్లతో రాణించిన ప్రసిద్ధ్‌ కృష్ణ.. నోయల్ డేవిడ్‌ని వెనక్కి నెట్టి నెం.1 స్థానానికి ఎగబాకాడు. దాదాపు 24 ఏళ్ల పాటు నోయల్ అగ్రస్థానంలో ఉండటం విశేషం.

ఇలాంటి‌ టీమ్‌ను ఎప్పుడూ చూడలేదు.. ఇదే ఆల్‌టైమ్‌ బెస్ట్ భారత జట్టు: విండీస్‌ దిగ్గజం

Story first published: Thursday, March 25, 2021, 15:45 [IST]
Other articles published on Mar 25, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+