ఇలాంటి టీమ్‌ను ఎప్పుడూ చూడలేదు.. ఇదే ఆల్‌టైమ్ బెస్ట్ భారత జట్టు: విండీస్ దిగ్గజం

ఆంటిగ్వా: తాను చూసిన భారత క్రికెట్ జట్లలో ప్రస్తుత టీమిండియానే అత్యుత్తమం అని విండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ పేర్కొన్నారు. తాను ఇంతవరకూ ఈ తరహా భారత క్రికెట్ జట్టును చూడలేదన్నారు. వరుస సిరీస్ (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) విజయాలను సాధిస్తూ దూసుకుపోతున్న టీమిండియాపై లాయిడ్ ప్రశంసల వర్షం కురిపించారు. అన్ని విభాగాల్లోనూ కోహ్లీసేన అత్యంత పటిష్టంగా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదని లాయిడ్ అన్నారు. ప్రస్తుత టీమిండియా మొత్తం ప్రొఫెషనల్ ఆటగాళ్లతో నిండి ఉందన్నారు.

ఆల్‌టైమ్ బెస్ట్ టీమ్
తాజాగా 'ద టెలీగ్రాఫ్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లైవ్ లాయిడ్ మాట్లాడుతూ... 'ఆస్ట్రేలియాలో తొలి టెస్టు ఓడిపోయిన తర్వాత భారత జట్టు పుంజుకున్న తీరు అద్భుతం. గత భారత జట్టుల కంటే ప్రస్తుత జట్టు బలంగా ఉంది. స్టార్ ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఆ జట్టును ఓడించాలంటే గతంలో భారత్‌కు సవాల్‌గా ఉండేది. అటువంటి ఇప్పుడు దానిని టీమిండియా అధిగమించింది. ఆ సిరీస్ ప్రకారం చూస్తే ప్రస్తుత భారత క్రికెట్ జట్టును ఆల్‌టైమ్ బెస్ట్ టీమ్ అనక తప్పదు' అని అన్నారు.

బుమ్రా ఇప్పటికే నిరూపించుకున్నాడు
భారత జట్టులో ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్న జస్ప్రీత్ బుమ్రాపై కూడా క్లైవ్ లాయిడ్ ప్రశంసల వర్షం కురిపించారు. 'బుమ్రా ఇప్పటికే అతనేమిటో నిరూపించుకున్నాడు. అతని బౌలింగ్‌లో ప్రత్యేక వైవిధ్యం ఉంది. యార్కర్లు, బౌన్సర్లు, స్లో బాల్స్‌తో ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ఏ సమయంలోనైనా బుమ్రా చేతికి బంతి ఇస్తే అద్భుతాలు చేస్తున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బుమ్రా ఆదుకునే తీరు అమోఘం. టీమిండియా వరుస విజయాలు సాధించడానికి బుమ్రా ప్రధాన కారణం అని నా అభిప్రాయం' అని లాయిడ్ చెప్పుకొచ్చారు.

వరుసగా రెండు టెస్టు సిరీస్‌లు
ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు వరుసగా రెండు టెస్టు సిరీస్‌లు గెలుపొందిన విషయం తెలిసిందే. 2018-19 సీజన్‌లో చేటేశ్వర్ పుజారా, జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శనతో భారత్ టెస్ట్ సిరీస్ గెలిచింది,. ఆసీస్ ప్రధాన బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లేనప్పుడు టీమిండియా విజయం సాధించిందని అక్కడి మీడియాతో పాటు పలువురు విమర్శించారు. అయితే 2020-21లో కూడా పటిష్ట ఆస్ట్రేలియా జట్టును భారత్ చిత్తుచేసింది. పంత్, గిల్, పుజారా, రహానే, ఇషాంత్, బుమ్రా అందరూ తమవంతు పాత్ర పోషించారు. ఇక స్వదేశంలో ఇంగ్లండ్ జట్టుపై కూడా టెస్ట్ సిరీస్ భారత్ గెలిచింది. దీంతో కోహ్లీసేనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
'స్పెషల్‌గా ఎలాంటి జెర్సీని ధరించలేదు.. మిస్ కమ్యూనికేషన్ వల్ల అలా జరిగింది'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications