
చెన్నై: భారత్-ఇంగ్లండ్ మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌ను ప్రధాని నరంద్ర మోదీ ఆకాశం నుంచే వీక్షించారు. ఈ విషయాన్నే ఆయనే ట్విటర్ వేదికగా వెల్లండించారు. దానికి సంబంధించిన ఫొటోను సైతం పంచుకున్నారు. దాంతో ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తమిళనాడు పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ.. ఆకాశంలో విహరిస్తూ చెపాక్ మైదానం మీదుగా వెళ్తుండగా..భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఆసక్తికర మ్యాచ్‌ను చూసినట్లు తెలిపారు.
'చెన్నైలో జరుగుతున్న ఆసక్తికర మ్యాచ్‌కు సంబంధించి స్పెషల్ వ్యూ లభించింది'అని విమానంలో నుంచి తీసిన ఫొటోకు క్యాప్షన్‌గా పేర్కొన్నారు.ఇక ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మ్యాచ్‌కు హాజరై ఆటగాళ్లలో మరింత ఉత్సాహం నింపాలని కోరుతున్నారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. రవిచంద్రన్ అశ్విన్(5/43) ఐదు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 134 పరుగులకే ఆలౌటైంది. దాంతో భారత్ 195 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఫోక్స్(42) మినహా అంతా విఫమయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్‌కు తోడుగా ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 339 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.