For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓయ్ కోహ్లీ.. ఏందయ్యా ఇది.. సూర్యకుమార్ యాదవ్‌‌ను ఎందుకు తీసుకోలేదు?

India vs England: Netizens unimpressed with Virat Kohli for not picking Suryakumar Yadav in 2nd ODI

పుణె: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో యువ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకోకపోవడంపై అభిమానుల మండిపడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ భుజ గాయంతో సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ వన్డే అరంగేట్రం ఖాయమని అందరూ భావించారు. కానీ టీమ్‌మేనేజ్‌మెంట్ మాత్రం స్కైకి మొండిచెయ్యి చూపిస్తూ.. రిషభ్ పంత్‌కు అవకాశం ఇచ్చింది. దాంతో తీవ్ర అసహానికి గురైన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోహ్లీ, బీసీసీఐపై దుమ్మెత్తిపోస్తున్నారు.

పాపం సూర్య..

పాపం సూర్య..

బ్యాడ్ లక్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచే సూర్యకుమార్ యాదవ్‌కు అది ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఐదు టీ20ల సిరీస్‌లో సెకండ్ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన సూర్యకు ఫస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఆ తర్వాత మూడో టీ20కి రోహిత్ అందుబాటులోకి రావడంతో మళ్లీ జట్టులో చోటు కోల్పోయాడు. ఇక నాలుగో టీ20కి ముందు ఇషాన్ కిషన్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన సూర్య.. తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల అందిపుచ్చుకున్నాడు. వివాదాస్పద రీతిలో ఔటైనా 31 బంతుల్లో 57 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆఖరి టీ20లోనూ ధనాధన్ బ్యాటింగ్‌తో 32 రన్స్ చేసి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అయ్యర్ దూరమైనా..

అయ్యర్ దూరమైనా..

ఈ సూపర్భ్ పెర్ఫామెన్స్‌తో వన్డే జట్టుకు ఎంపికైన సూర్య.. అయ్యర్, రాహుల్ కారణంగా తొలి వన్డేలో చోటు దక్కించుకోలేకపోయాడు. శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడటం.. భుజానికి సర్జరీ చేయాల్సి రావడంతో మిగిలిన మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్ ఫస్టాఫ్ మ్యాచ్‌లకు దూరంకానున్నాడు. అయ్యర్ గైర్హాజరీతో సూర్యకు మార్గం సుగుమమైందని అంతా భావించారు. కానీ టీమ్‌మేనేజ్‌మెంట్ మాత్రం అనూహ్యంగా పంత్‌ను జట్టులోకి తీసుకొచ్చింది. దాంతో సూర్యకు మరో సారి నిరాశే ఎదురైంది.

రాహుల్ ఉండగా పంత్ ఎందుకు?

రాహుల్ ఉండగా పంత్ ఎందుకు?

అయితే కేఎల్ రాహుల్ జట్టులో ఉండగా మరో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ అయిన రిషభ్ పంత్‌ను ఎందుకు తీసుకున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సూర్య జట్టులోకి రావాలంటే ఇంకేం చేయాలని, ఇది చాలా అన్యాయమని టీమ్‌మేనేజ్‌మెంట్ తీరును తప్పుబడుతున్నారు. పంత్ మంచి బ్యాట్స్‌మెన్ అయినప్పటికీ సూర్యకు అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అసలు సూర్యను వన్డే సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేశారని, ఫామ్‌లో ఉన్న ఆటగాడిని బెంచ్‌పై కూర్చోబెట్టడం తీవ్ర బాధకు గురి చేస్తోందని కామెంట్ చేస్తున్నారు.

ఓపెనర్లు విఫలం..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(4), రోహిత్ శర్మ(25) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ధావన్‌ను టాప్లీ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చగా.. సామ్ కరన్ రోహిత్‌ను ఔట్ చేశాడు. దాంతో భారత్ 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(27 బ్యాటింగ్), కేఎల్ రాహుల్(17 బ్యాటింగ్) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. నిదానంగా ఆడుతూ వీలుచిక్కిన బంతులను బౌండరీలకు తరలిస్తున్నారు. దాంతో 17 ఓవర్లు ముగిసే సరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.

Story first published: Friday, March 26, 2021, 15:02 [IST]
Other articles published on Mar 26, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+