మొతేరా కెపాసిటీ లక్ష్యా పదివేలు కాదట
సబర్మతి తీరాన కొత్తగా నిర్మించిన మొతేరా స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. లక్షా 10 వేల మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం మొతేరాకు ఉందని ఇప్పటివరకు మనకు తెలిసిందే. అయితే మొతేరా సామర్థ్యం లక్ష్యా పదివేలు కాదట. లక్ష్యా ముప్పై రెండు వేలు అని తాజాగా తెలిసింది. 'మొతేరా స్టేడియం అధికారిక సామర్థ్యం 1,32,000. ఈ సమాచారం 100 శాతం నిజమైనదే. మొతేరా ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం. సూపర్' అని ఓ ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశాడు. మైదానం బయట గేట్ వద్ద ఉన్న హోర్డింగ్‌లో కూడా 13200 అని ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. అయితే ఈ ట్వీట్ నిజమో లేదో తెలియాల్సి ఉంది.

కొత్త ప్రపంచంలోకి
అసలే భారీ స్టేడియం.. పైగా డే/నైట్‌లో, గులాబి బంతితో మ్యాచ్ జరగబోతుండటంతో మూడో టెస్ట్ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. బర్మతి తీరాన బుధవారం భారత క్రికెట్ అభిమానులు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లబోతున్నారు. కళ్లు చెదిరే భారీతనం.. అలా చూస్తూ ఉండిపోయే నిర్మాణ చాతుర్యం, కొత్తగా కనిపించే ఎల్‌ఈడీ లైట్ల వెలుగులు. వీటికి తోడు గులాబీ బంతి.. సుమారు 55-60 వేల మంది ప్రేక్షకులతో మొతేరా మైదానంలో మోత మోగనుంది. లక్షా 10 వేల మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉన్నా.. కరోనా కారణంగా సగం మందికే అనుమతి ఉంది.

ఎలాంటి అంతరాయాలు లేకుండా తిలకించవచ్చు
క్రికెట్ స్టేడియంలో ప్రేక్షకులు ముందు వరుసలో కూర్చొని మ్యాచ్ చూసేందుకు ఇష్టపడతారు. ఎందుకంటే మ్యాచ్‌ను ఆసాంతం ఎలాంటి అంతరాయాలు లేకుండా తిలకించవచ్చు. మోతేరా ప్రత్యేకత ఏమిటంటే.. స్టేడియం మధ్యలో ఒక్క స్తంభంగానీ, మరే ఇతర అడ్డంకులుగానీ లేవు. ఏ స్టాండ్‌లో కూర్చోని అయినా మ్యాచ్‌ను అడ్డంకులు లేకుండా ఆస్వాదించవచ్చు. మోతేరాలో 11 పిచ్‌లను నిర్మించారు. వీటిలోని ఐదింటిని ఎర్ర బంకమట్టి, నల్ల మట్టిని ఉపయోగించబడ్డాయి. మోతేరాలోని ప్రధాన మైదానంతో పాటు రెండు ప్రాక్టీస్ మైదానాలు కూడా ఉన్నాయి. ఈ రెండు ప్రాక్టీస్ మైదానాల్లో కూడా 9 చొప్పున పిచ్‌లు ఉన్నాయి. వీటిలో 5 పిచ్‌లు ఎర్రమట్టితో, 4 పిచ్‌లు నల్ల బంకమట్టితో తయారయ్యాయి.

రూ.700 కోట్ల ఖర్చు
మోతేరా స్టేడియం పునరుద్ధరణ, ఆధునీకరణకు రూ.700 కోట్ల వరకు ఖర్చు అయిందట. స్టేడియం కాంప్లెక్స్ మొత్తం 63 ఎకరాల్లో ఉన్నది. ఒలింపిక్ సైజు స్టేడియం ఈత కొలను కూడా ఉంది. ఈ స్టేడియంలో 4 డ్రెస్సింగ్ రూములు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రతి డ్రెస్సింగ్ రూంకు జిమ్నాసియంను జతచేశారు. స్టేడియంలో 6 ఇండోర్ పిచ్‌లు ఉన్నాయి. ఇక్కడ బౌలింగ్ యంత్రాల సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా బాక్సింగ్, బ్యాడ్మింటన్, టెన్నిస్ కోసం ప్రత్యేక కోర్టులు ఉన్నాయి. హాకీ, ఫుట్‌బాల్ మైదానాలు కూడా ఈ క్యాంపస్‌లో ఉన్నాయి.

ఎంసీజీ కంటే పెద్దది
ఇప్పటివరకు ఆస్ట్రేలియాకు చెందిన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉండేది. మోతేరా స్టేడియంలో 1.10 లక్షల మంది కూర్చుని వీక్షించే సామర్థ్యం ఉన్నది. ఆస్ట్రేలియాకు చెందిన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ మిలియన్ ప్రేక్షకుల సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉన్నది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించేందుకు గుజరాత్ క్రికెట్ సంఘం పెద్దలు కృషి చేస్తున్నారు.


Click it and Unblock the Notifications

టైగర్ వుడ్స్ కారు బోల్తా.. కాళ్లకు తీవ్ర గాయాలు!!










