
విరాట్‌పై తీవ్ర ఒత్తిడి..
'విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ గ్రేటేస్ట్ బ్యాట్స్‌మన్. ఈ విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ సారథిగా అతను విఫలమవుతున్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ వరుసగా నాలుగు టెస్ట్‌ల్లో ఓడింది. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ గైర్హాజరీలో రహానే రాణించడంతో అతనిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ పరిస్థితుల్లో భారత్ మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడితే మాత్రం విరాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఖచ్చితంగా తప్పుకుంటాడు.'అని ఈ ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు.

చిత్తుగా ఓడిన భారత్..
420 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 58.1 ఓవర్లలో 192 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (104 బంతుల్లో 72; 9 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (83 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ లీచ్‌కు 4 వికెట్లు దక్కగా, పేసర్ అండర్సన్ 3 కీలక వికెట్లు తీశాడు. చివరి రోజు తొలి సెషన్‌లో ఐదు వికెట్లు కోల్పోయిన భారత్ ఇన్నింగ్స్ టీ విరామానికి ముందే ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 'డబుల్ సెంచరీ' చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. ఈ ఓటమితో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ అవకశాలను భారత్ సంక్షిష్టం చేసుకుంది.

ఫస్ట్‌టైమ్..
సుదీర్ఘ ఫార్మాట్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ ఎన్నో ఘనతలు సాధించాడు. ఆసీస్ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ (62.33%) తర్వాత అత్యధిక గెలుపు శాతం సాధించిన సారథి కోహ్లీ (57.89%)నే. అయితే విరాట్ వరుసగా గత నాలుగు టెస్టుల్లో ఓటమిపాలయ్యాడు. న్యూజిలాండ్ పర్యటనలో రెండు టెస్టులు, ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ టెస్టు, చెన్నై వేదికగా జరిగిన ఇంగ్లాండ్ టెస్టులో పరాజయాన్ని చవిచూశాడు. అయితే కెప్టెన్సీలో కోహ్లీ వరుసగా నాలుగు టెస్టుల్లో ఓటములు చవిచూడటం ఇదే ప్రథమం. అంతకుముందు అతడు వరుసగా ఏడు టెస్టుల్లో విజయం సాధించడం గమనార్హం.

ధోనీ తర్వాత కోహ్లీనే..
2014లో సారథిగా బాధ్యతలు అందుకున్న కోహ్లీ ఇప్పటివరకు 57 టెస్టులకు నాయకత్వం వహించాడు. 33 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 14 టెస్టుల్లో పరాజయాన్ని చవిచూశాడు. 10 మ్యాచ్‌లు డ్రాగా ముగించాడు. భారత్ తరఫున ఎక్కువ టెస్టులకు కెప్టెన్సీ వహించిన రికార్డు ధోనీ పేరిట ఉంది. ధోనీ 60 టెస్టుల్లో 27 విజయాలు, 18 ఓటములు, 15 డ్రాలు సాధించాడు.


Click it and Unblock the Notifications
