IND vs ENG:మహమ్మద్ సిరాజ్.. వేరే లెవెల్ అబ్బా! హైదరాబాద్‌లో భారీ కటౌట్‌లు! సూపర్ స్టార్ మాదిరి!

హైదరాబాద్: ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన లార్ట్స్ టెస్ట్‌లో టీమిండియా 151 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. బ్యాట్, బంతితో రాణించిన కోహ్లీసేన 2014 తర్వాత క్రికెట్ పుట్టినిళ్లు లార్ట్స్ మైదానంలో భారత్ జయభేరి మోగించాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో భారత్ అప్పుడు విజయాన్ని అందుకుంది. ఇక లార్ట్స్ టెస్ట్‌లో టీమిండియా యువ పేసర్, హైదరాబాద్ గల్లీ బాయ్ మహమ్మద్ సిరాజ్ అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 8 వికెట్లు తీసిన ఈ హైదరాబాద్ పేసర్ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మరోసారి సిరాజ్ హీరో అయ్యాడు.

రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 8 వికెట్లు
రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో వరుస బంతుల్లో ఓపెనర్ డామ్ సిబ్లీ, హసీబ్ హమీద్‌ను పెవిలియన్ చేర్చిన మొహ్మద్ సిరాజ్.. ఆ తర్వాత హాఫ్ సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన జానీ బెయిరిస్టో, ఓలీ రాబిన్సన్‌ను ఔట్ చేశాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వరుస బంతుల్లో కీలక మొయిన్ అలీ, సామ్ కరన్‌ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత భారత విజయానికి అడ్డుగా నిలిచిన జోస్ బట్లర్, జేమ్స్ అండరన్సన్‌ను ఓకే ఓవర్‌లో పెవిలియన్ చేర్చి టీమిండియా విజయాన్ని లాంఛనం చేశాడు. ఒకానొక సమయంలో డ్రా దిశగా సాగుతున్న మ్యాచులో భారత్ గెలిచిందంటే.. అంత సిరాజ్ మహిమే అని చెప్పాలి.

భారీ కటౌట్‌లు
లార్ట్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్ గల్లీ బాయ్ మహమ్మద్ సిరాజ్‌కు భాగ్యనగర వాసులు బ్రహ్మరథం పట్టారు. భారీ కటౌట్లను ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు హైదరాబాద్ అభిమానులు. మూడు అంతస్తుల ఎత్తులో రోడ్డు మధ్యలో సిరాజ్ కటౌట్లను అమర్చారు. పాత బస్తీలో పెద్దఎత్తున కటౌట్లను ఏర్పాటు చేశారు. సిరాజ్ ఇంటిపక్కనవారు, సన్నిహితులు, స్నేహితులు కలిసి పలుచోట్ల సందడి చేశారు. మహ్మద్ సిరాజ్.. హైదరాబాద్ రజనీకాంత్ అంటూ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్.

39 ఏళ్ల రికార్డు బద్దలు
రెండో టెస్ట్ మ్యాచ్ ద్వారా మహ్మద్ సిరాజ్ 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. సిరాజ్ లార్డ్స్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 8 వికెట్లు పడగొట్టాడు. లార్డ్స్ టెస్టులో ఒక టీమిండియా బౌలర్ ఇన్ని వికెట్లు పడగొట్టడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు 1982లో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ ఫీట్‌ను సాధించాడు.
కపిల్ 168 పరుగులిచ్చి 8 వికెట్లు తీయగా.. సిరాజ్ 126 పరుగులకే 8 వికెట్లు పడగొట్టడం విశేషం. కపిల్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి ఓవరాల్‌గా 8 వికెట్లు సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడం విశేషం. లార్డ్స్ టెస్టులో భారత్ తరుపున అత్యుత్తమ గణాంకాలు నమోదుచేసిన బౌలర్‌గా కూడా సిరాజ్ నిలిచాడు.
IND vs ENG: 65 రోజుల తర్వాత భార్యని కలిసిన టీమిండియా క్రికెటర్.. ఆ ఆనందంలో ఏం చేశాడంటే?

151 పరుగులతో చిత్తు
రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 364 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (129), రోహిత్ శర్మ (83) రాణించారు. ఆ తర్వాత ఇంగ్లండ్.. జో రూట్(180) అజేయ సెంచరీతో 391 పరుగులకు ఆలౌటై 27 పరుగులు ఆధిక్యాన్ని అందుకుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత జట్టును మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా 9వ వికెట్‌కు అజేయంగా 89 పరుగులు జోడించి గట్టెక్కించారు. దాంతో కోహ్లీసేన 298/8 వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి 120 పరుగులకే కుప్పకూలి చిత్తయింది. మూడో టెస్ట్ ఆగస్టు 25 నుంచి లీడ్స్ వేదికగా ప్రారంభం కానుంది.

ఐపీఎల్ 2020 ద్వారానే
ఐపీఎల్ 2020లో మొహ్మద్ సిరాజ్ సత్తాచాటాడు. కేకేఆర్ (4-2-8-3)పై అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఒకే మ్యాచ్‌లో రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన సిరాజ్.. టోర్నీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. దీంతో ఆసీస్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం టెస్టు సిరీస్‌లోనే సిరాజ్ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో క్రమశిక్షణగా బౌలింగ్ చేసిన సిరాజ్‌ను ఎదుర్కొనేందుకు.. సొంతగడ్డపైనే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఎంతలా అంటే..? సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. రెండింటిలోనూ ఆరంభంలోనే మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. మొత్తంగా.. సిరీస్‌లో మూడు టెస్టులు ఆడిన సిరాజ్ 13 వికెట్లతో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. గబ్బా వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతం
ఆస్ట్రేలియా పర్యటనలో రాణించడంతో స్వదేశంలో జరిగిన ఇంగ్లండ్ పర్యటనలో చోటు దక్కించుకున్న మొహ్మద్ సిరాజ్ అంచనాలను అందుకున్నాడు. ఆపై జరిగిన ఐపీఎల్ 2021లో సత్తాచాటాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనే సిరాజ్ ఐపీఎల్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా సిరాజ్ బెంగళూరు జట్టుకు ప్రధాన బౌలర్‌గా మారాడు. ఆపై ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ కూడా ఏమికయ్యాడు. ఇప్పుడు ఇంగ్లండ్ గడ్డపైనా సత్తాచాటుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications