India vs England: పంత్‌ను పక్కనపెట్టారు ఓకే.. మరి సూర్యకుమార్‌ను ఎందుకు తీసుకోలేదు! చాలా ఆశ్చర్యంగా ఉంది!

పూణే: మూడు మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో పుణె వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా తుది జట్టు ఎంపిక పట్ల ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రిషబ్ పంత్‌ను పక్కనపెట్టినా.. టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించిన స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌కు చోటు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. మొదటి వన్డే కోసం కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత జట్టులో మార్పులు చేశాడు. పంత్ స్థానంలో కేఎల్ రాహుల్ జట్టులోకి రాగా.. కృనాల్ పాండ్యా, ప్రసీద్ కృష్ణ వన్డేల్లో అరంగేట్రం చేశారు.

పంత్‌ను పక్కనపెట్టారు ఓకే.:
తాజాగా మైకేల్ వాన్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ... 'భారత జట్టు శక్తివంతమైనదని కచ్చితంగా ఒప్పుకొంటాను. అయితే మొదటి వన్డే మ్యాచ్‌లో ఆటగాళ్ల ఎంపిక నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. రిషబ్ పంత్ చాలాకాలంగా విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడుతూనే ఉన్నాడు. కాబట్టి అతడికి టీమిండియా మేనేజ్మెంట్ కాస్త విశ్రాంతినివ్వాలని భావించి పక్కన పెట్టి ఉంటుంది. అదే నిజమైతే..పంత్‌కు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేదీ లేదు' అని అన్నాడు.

సూర్యను ఆడించాల్సింది:
'మొదటి వన్డేలో సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించాల్సి ఉండాల్సింది. అతడు టీ20 మ్యాచ్‌లలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. హాఫ్ సెంచరీతో తనను తాను నిరూపించుకున్నాడు. 50 ఓవర్ల క్రికెట్‌లోనూ అతడు రాణించగలడు. అలాంటి మంచి ఆటగాడిని పక్కన పెట్టడంతో ఆశ్చర్యానికి లోనయ్యా. సూర్యకుమార్ లేకుండా భారత్ ఆడుతోంది. అయినా కూడా టీమిండియాకు శక్తివంతమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఆ బ్యాటింగ్ లైనప్ చూస్తే సంతోషంగా ఉంది. శిఖర్ ధావన్‌కుఇది పెద్ద మ్యాచ్' అని మైకేల్ వాన్ పేర్కొన్నాడు.

గిల్ ప్రతిభావంతుడు:
టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ఆటతీరు తనకు ఇష్టమని మైకేల్ వాన్ చెప్పాడు. 'ప్రస్తుత బ్యాటింగ్ లైనప్ బాగుంది. యువ ఆటగాళ్లు దూసుకువస్తున్నారు. కాబట్టి శిఖర్ ధావన్‌కు ఇది కీలకమైన మ్యాచ్. శుభ్‌మన్ గిల్ ప్రతిభావంతుడు. తన ఆట తీరు అద్భుతం. ఓపెనింగ్‌తో పాటు మిడిలార్డర్‌లోనూ తనను ఆడించే అవకాశాలు పరిశీలించాలి' అని ఇంగ్లీష్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సూచించాడు. ఈ మ్యాచులో ధావన్ (98:106 బంతుల్లో 11ఫోర్లు, 2సిక్సర్లు) శతకానికి రెండు పరుగుల దూరంలో ఔటయ్యాడు.

టీమిండియా భారీ స్కోర్:
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ తృటిలో సెంచరీ మిస్ చేసుకోగా.. వన్డేలో అరంగేట్రం చేసిన కృనాల్ పాండ్యా (58; 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులు) ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. కేఎల్ రాహుల్ (62; 43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు), విరాట్ కోహ్లీ (60 బంతుల్లో 56; 6 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. ఇంగ్లీష్ బౌలర్లలో స్టోక్స్ 3, వుడ్ 2 వికెట్లు పడగొట్టారు.
India vs England: హమ్మయ్య.. బెయిర్‌స్టో, మోర్గాన్, బట్లర్ ఔట్! తగ్గిన ఇంగ్లండ్ జోరు!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications