India vs England: హమ్మయ్య.. బెయిర్‌స్టో, మోర్గాన్, బట్లర్ ఔట్! తగ్గిన ఇంగ్లండ్ జోరు!

పూణే: భారత్ నిర్దేశించిన 318 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఐదవ వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ ఔట్ అయ్యాడు. 4 బంతులు ఆడి 2 పరుగులు మాత్రమే చేశాడు. పేసర్ శార్దూల్ ఠాకూర్ వేసిన 25వ ఓవర్ నాలుగో బంతికి బట్లర్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. బట్లర్ రివ్యూ తీసుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. అదే ఓవర్ మొదటి బంతికి ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (30 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) ఔట్ అయ్యాడు. శార్దూల్ వేసిన షార్ట్ పిచ్ బంతికి కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
అంతకుముందు ధనాధన్ బ్యాటింగ్‌తో టీమిండియా బౌలర్లను కంగారు పెట్టించిన ప్రమాదకర బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో (66 బంతుల్లో 94; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) ఎట్టకేలకు ఔటయ్యాడు. సెంచరీకి చేరువగా వెళ్లిన బెయిర్‌స్టో.. భారీ షాట్ ఆడే క్రమంలో వికెట్‌ను చేజార్చుకున్నాడు. శార్ధూల్ బౌలింగ్‌లో కుల్దీప్ క్యాచ్ పట్టడంతో అతను పెవిలియన్ బాటపట్టాడు. వెంటవెంటనే మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం ఇంగ్లండ్ బ్యాటింగ్ జోరు తగ్గింది.
318 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పర్యాటక జట్టు బ్యాట్స్‌మెన్లు ఆరంభం నుంచే టీమిండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఓపెనర్లు బెయిర్‌స్టో, జేసన్ రాయ్ (35 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్) వీరవిహారం చేశారు. ఆరంభ ఓవర్లలో నెమ్మదిగా ఆడిన బెయిర్‌స్టో ఒక్కసారిగా గేర్ మార్చాడు. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. మరోవైపు రాయ్ కూడా చెలరేగడంతో 13 ఓవర్ల ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు వికెట్ నష్టపోకుండా 122 పరుగులు చేసింది. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ల ధాటికి టీమిండియా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.
ఎట్టకేలకు టీమిండియాకు బ్రేక్ లభించింది. ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌ని అరంగేట్రం బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ బోల్తా కొట్టించాడు. 15 ఓవర్ రెండో బంతికి ప్రసిద్ధ్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ సూర్యకుమార్ క్యాచ్ పట్టడంతో రాయ్ పెవిలియన్ బాటపట్టాడు. రాయ్‌ని ఔట్ చేసిన ప్రసిద్ధ్.. ఆ తరువాత స్టోక్స్(11 బంతుల్లో 1)ను వెనక్కి పంపాడు. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ శుభ్‌మన్ గిల్ క్యాచ్ పట్టడంతో స్టోక్స్ పెవిలియన్ బాట పట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 17 ఓవర్ వికెట్ మెయిడిన్ కావడం విశేషం. ఆపై మూడు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది ఇంగ్లండ్. ప్రస్తుతం క్రీజులో అలీ (5), బిల్లింగ్స్ (7) ఉన్నారు. ఇంగ్లాండ్ ఇంకా 131 పరుగులు చేయాలి.
ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డ శ్రేయస్ అయ్యర్‌ను స్కానింగ్ కోసం తీసుకెళ్లారు. ఓపెనింగ్ చేస్తుండగా రోహిత్ శర్మ కుడి మోచేతికి బంతి తగిలింది. అతడు నొప్పితో బాధపడుతున్నాడు. వీరిద్దరూ మ్యాచులో ఫీల్డింగ్ చెయ్యట్లేదు. వీరి స్థానంలో సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ సబ్‌స్టిట్యూట్ చేస్తున్నారు. అంతేకాదు చెరో అద్భుత క్యాచ్ పట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications