For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోహ్లీ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. 1 లేదా 2 సెంచరీలు చేస్తాడు'

India vs England: Michael Vaughan says Virat Kohli will get 1-2 hundreds in Test Series
Ind vs Eng 2021,1st Test : Virat Kohli Will Get 1-2 Hundreds Throughout Series - Michael Vaughan

చెన్నై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ అన్నాడు. విరాట్ బ్యాటింగ్ గురించి తాను ఏమాత్రం ఆలోచించట్లేదని చెప్పాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో ‌కోహ్లీ 1 లేదా 2 సెంచరీలు చేస్తాడని వాన్‌ ధీమా వ్యక్తం చేశాడు. చెన్నై వేదికగా ప్రస్తుతం జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 11 పరుగులకే ఔటైన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో ఇప్పటికే టీమిండియాకు ఇంగ్లండ్ 400లకు పైగా పరుగుల లక్యంను ఉంచింది.

సరైన ఔట్‌ కాదు

సరైన ఔట్‌ కాదు

ఓ క్రీడా సంస్థతో మాట్లాడిన మైఖేల్‌ వాన్‌ మాట్లాడుతూ... 'ఆఫ్‌స్టంప్‌ అవతల పడిన బంతిని విరాట్ కోహ్లీ డిఫెండ్‌ చేసి ఔటయ్యాడు. ఆ షాట్‌లో ఎలాంటి అనుభవం లేదు. కొత్తగా వచ్చిన యువకుడు క్రికెట్‌ ఆడినట్లు ఉంది. ఎవరైనా ఆఫ్ ‌స్పిన్నర్‌ ఆఫ్‌స్టంప్‌ అవతల బంతిని వేస్తే.. దాన్ని డిఫెండ్‌ చేయరు. బంతి గమనాన్ని బట్టి బ్యాట్‌ను ఆడించాలి. ఒకవేళ అది బౌన్స్‌ అయితే షార్ట్‌ లెగ్‌లోకి వెళ్తుంది. ఇది సాంకేతికంగా కోహ్లీకి సరైన ఔట్‌ కాదు' అని అన్నాడు. వాన్‌ ఇంగ్లండ్ తరఫున 82 టెస్టులు, 86 వన్డేలు, 2 టీ20లు ఆడారు.

1 లేదా 2 శతకాలు బాదుతాడు

1 లేదా 2 శతకాలు బాదుతాడు

'విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతని బ్యాటింగ్ గురించి నేను ఏమాత్రం ఆలోచించట్లేదు. ఎందుకంటే కోహ్లీ టాప్ క్లాస్ ఆటగాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో ‌కోహ్లీ 1 లేదా 2 శతకాలు బాదుతాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. యువ ఆఫ్ స్పిన్నర్ బెస్ బాగా బౌలింగ్ చేశాడు. అయితే కోహ్లీ పుంజుకుంటాడు' అని మైఖేల్‌ వాన్‌ పేర్కొన్నాడు. కోహ్లీ చివరిసారి 2019 నవంబర్‌లో శతకం చేశాడు. బంగ్లాదేశ్‌తో ఆడిన తొలి డే/నైట్‌ టెస్టులో శతకం సాధించాడు. ఆపై 31 ఇన్నింగ్స్‌ ఆడినా మూడంకెల స్కోర్‌ చేయలేకపోయాడు.

రెండో ఇన్నింగ్స్‌లోనైనా

రెండో ఇన్నింగ్స్‌లోనైనా

విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో ఇప్పటివరకు 87 టెస్టులు, 251 వన్డేలు, 85 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి మొత్తం 70 శతకాలతో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో 27, వన్డేల్లో 43 సార్లు మూడంకెల స్కోర్లు అందుకున్నాడు. టీ20ల్లో అత్యధిక స్కోర్ 94 నాటౌట్. కోహ్లీకి చివరి టెస్టు సెంచరీ తర్వాత చెన్నై మ్యాచ్‌ 31వ ఇన్నింగ్స్‌. అందులో 11 పరుగులకే ఔట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌లోనైనా విరాట్ 71వ శతకం సాధిస్తాడో లేదో చూడాలి. కోహ్లీ సెంచరీ చేయాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

సుంద‌ర్ ఆదుకోవడంతో

సుంద‌ర్ ఆదుకోవడంతో

ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 337 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 6 వికెట్ల‌కు 257 ప‌రుగుల‌తో నాలుగో రోజు సోమవారం తొలి ఇన్నింగ్స్ కొన‌సాగించిన భారత్‌.. మ‌రో 80 ప‌రుగులు జోడించి మిగ‌తా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ పర్యటనలో అదరగొట్టిన ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ (85 నాటౌట్; 138 బంతుల్లో 12x4, 2x6)‌) అద్భుత పోరాటంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా సాధించింది. రవిచంద్రన్‌ అశ్విన్ ‌(31; 91 బంతుల్లో 3x4, 1x6) అవుటైన త‌ర్వాత అవ‌త‌లి వైపు బ్యాట్స్‌మెన్ ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోవ‌డంతో సుంద‌ర్ సెంచ‌రీ చేసే అవ‌కాశాన్ని కోల్పోయాడు.

India vs England: 2012 తర్వాత చెపాక్‌లో తొలిసారి!!

Story first published: Monday, February 8, 2021, 16:18 [IST]
Other articles published on Feb 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+