పిచ్ బాగుంది.. బంతి ముద్దుగా బ్యాట్‌పైకి వస్తుంది.. ఇంగ్లండ్‌దే చెత్త బ్యాటింగ్: మైకేల్ వాన్

లండన్: భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని, కానీ ఇంగ్లండ్ ఆటగాళ్లే చెత్త బ్యాటింగ్‌తో పెవిలియన్ బాట పట్టారని ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అన్నాడు. మొతేరా మైదానం వేదికగానే జరిగిన డే/నైట్ టెస్ట్ రెండు రోజుల్లో ముగియడంపై వాన్ తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. మొతేరా పిచ్ టెస్ట్ క్రికెట్‌కు ఏమాత్రం పనికిరాదని, దాన్ని నాగలితో దున్నారని వరుస పోస్ట్‌లతో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అతనితో పాటు ఇతర మాజీ ఆటగాళ్లు కూడా పిచ్‌ను తప్పబట్టడంతో దిద్దుబాటు చర్యలకు దిగిన బీసీసీఐ.. ఆఖరి టెస్ట్‌కు మంచి బ్యాటింగ్ వికెట్‌ను తీసుకొచ్చింది.

మళ్లీ విఫలమైనా ఇంగ్లండ్..
బ్యాటింగ్‌కు అనువైన వికెట్‌పై కూడా ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ తడబడ్డారు. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్(4/66), రవిచంద్రన్ అశ్విన్(3/47) ధాటికీ ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 205 పరుగులకే కుప్పకూలింది. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(55), డాన్ లారెన్స్(45) మినహా అంతా విఫలమయ్యారు. దాంతో ఇంగ్లండ్ జట్టుపై మైకేల్ వాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు భారత స్పిన్నర్లను కొనియాడాడు.

సాకుల్లేవ్.. చెత్త బ్యాటింగ్..
'ఇది అత్యంత చెత్త బ్యాటింగ్.. ఇంగ్లండ్ వైఫల్యంపై ఎలాంటి సాకుల్లేవ్. గత కొన్ని టెస్టులుగా ఇంగ్లండ్ బ్యాటింగ్ మరి అధ్వాన్నంగా ఉంది. భారీ స్కోర్ చేయడానికి అనువైన పిచ్ ఇది. బాల్ ముద్దుగా బ్యాట్‌పైకి వస్తుంది. కానీ ఇంగ్లండే దారుణ బ్యాటింగ్. భారత్ బౌలింగ్ అసాధారణం. ఈ తరహా కండిషన్స్‌లో వారెంత బాగా రాణిస్తారో మరోసారి చూపించారు'అని మైకేల్ వాన్ వరుస ట్వీట్లు చేశాడు.

భారత్‌దే హవా..
భారీ అంచనాల మధ్య మొదలైన ఆఖరి టెస్ట్ తొలి రోజు ఆటలో భారత్ హవా నడిచింది. అచ్చొచ్చిన స్పిన్ అటాక్‌తో మరోసారి ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది.అనంతరం బ్యాటింగ్‌లో ఖాతా తెరవకుండానే ఓపెనర్ శుభ్‌మన్ గిల్(0) వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ(34 బంతుల్లో 1 ఫోర్‌తో 8 బ్యాటింగ్), నయావాల్ చతేశ్వర్ పుజారా(36 బంతుల్లో 1 ఫోర్‌తో 15 బ్యాటింగ్)తో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది.
అంతకుముందు బ్యాటింగ్‌లో తేలిపోయిన ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 75.5 ఓవర్లలో 205 పరుగులకు కుప్పకూలింది. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(55), డాన్ లారెన్స్(46) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్(4/66) నాలుగు, రవిచంద్రన్ అశ్విన్(3/47) మూడు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్(2/45) రెండు, వాషింగ్టన్ సుందర్(1/14) ఒక వికెట్ పడగొట్టాడు. భారత్ ఇంకా 181 పరుగుల వెనుకంజలో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications