India vs England: నేను గానీ ఒక ఈల గానీ వేసానంటే !

చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ రెండో రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫుల్ జోష్‌లో కనిపించాడు. అభిమానుల సమక్షంలో ఈ మ్యాచ్ జరుగుతుండటం.. భారత బౌలర్లు సత్తా చాటడంతో కోహ్లీ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. కరోనా పుణ్యమా గత ఏడాదిగా ప్రేక్షకుల మద్దతుకు దూరమైన కోహ్లీకి.. ఈ మ్యాచ్‌కు ఫ్యాన్స్ రావడంతో ఎక్కడలేని ఊపొచ్చింది. రెండో రోజు మొత్తం కోహ్లీ అదే జోష్‌లో కనిపించాడు. ఓ వైపు ఆటగాళ్లను ఉత్తేజపరుస్తూనే.. మరోవైపు తన సైగలు, చేష్టలతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలుగించాడు.
లంచ్ బ్రేక్ అనంతరం ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆ సంతోషాన్ని విరాట్ కోహ్లి అభిమానులతో పంచుకున్నాడు. వారి వైపు చూస్తూ విజిల్ వేసి ఉత్సాహపరిచాడు. అంతే కాకుండా వారిని విజిల్ వేయమన్నాడు. వారు అతన్ని అనుసరిస్తుండగా.. ప్రేక్షకుల స్టాండ్స్ వైపు చెవులు పెట్టి..'వినబడట్లేదు.. ఇంకా గట్టిగా'అంటూ వారిలో ఉత్సాహాన్ని నింపాడు. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ ట్విటర్ వేదికగా షేర్ చేయగా వైరల్ అయింది. ఇక విరాట్ కోహ్లీ విజిల్ వేస్తున్న ఫొటోను మీమర్స్.. ఒక రేంజ్‌లో వాడుకున్నారు.
తమ ఎడిటింగ్ నైపుణ్యానికి పని పెట్టి సరదా వీడియోలను రూపొందించారు. టాలీవుడ్ మూవీలోని ఫైటింగ్ సీన్స్‌ను ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు. 'నేను గానీ ఈల గానీ వేసానంటే.. ఇంగ్లండ్ టప టపా వికెట్లు కోల్పోతుందని అర్థం వచ్చేలా వీడియోలను రూపొందించారు. ప్రస్తుతం ఈ మీమ్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఇక తొలి రోజు బ్యాట్‌తో చెలరేగిన టీమిండియా.. రెండో రోజు బంతితో విజృంభించి మ్యాచ్‌పై పట్టు బిగించింది. రవిచంద్రన్ అశ్విన్ (5/43) మాయాజాలానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకే కుప్పకూలింది. బెన్ ఫోక్స్ (42 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం 195 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఆదివారం ఆట ముగిసే సమయానికి 54/1తో నిలిచింది. ప్రస్తుతం 249 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో రోహిత్ శర్మ (25 బ్యాటింగ్) పుజారా (7బ్యాటింగ్) ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications