Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: జోరు మీదున్న జోరూట్‌ను త్వరగా ఔట్ చేయాలంటే ఇలా చేయాలి!

India vs England: Manoj Tiwary gives Team India detailed plan to dismiss in-form Joe Root

చెన్నై: సూపర్ ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్‌ను ఔట్ చేయడానికి కావాల్సిన ప్రణాళికను టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్ మనోజ్ తివారీ ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. భారత జట్టుకు కొరకరాని కొయ్యగా మారిన ఈ ఇంగ్లండ్ సారథిని స్పిన్ బౌలింగ్‌లో బోల్తా కొట్టించవచ్చిన పేర్కొన్నాడు. ఇక ఫస్ట్ టెస్ట్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన జోరూట్.. 227 పరుగుల భారీ తేడాతో విజయాన్నందించి నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌కు శుభారంభాన్ని అందించాడు.

జోరూట్ జోరు..

భారత పర్యటనకు ముందే ఫామ్‌లోకి వచ్చిన జోరూట్.. శ్రీలంక పర్యటనలో 228, 186 భారీ స్కోర్‌లతో సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే శ్రీలంక గడ్డపై ఇన్ని పరుగులు చేసిన జోరూట్.. అదే జోరును భారత గడ్డపై చూపించలేడని చాలా మంది విశ్లేకులు, మాజీ క్రికెట్లర్లు అభిప్రాయపడ్డారు. కానీ వారి అంచనాలన్నిటినీ తల కిందులు చేస్తూ భారత బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న జోరూట్(228).. డబుల్ సెంచరీతో అద్భుత విజయాన్నందించాడు.

సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ 40 పరుగులతో రాణించాడు. అతను ఇలానే ఫామ్ కొనసాగిస్తే తదుపరి మ్యాచ్‌ల్లో భారత్‌కు కష్టాలు తప్పవు. దాంతో జోరూట్‌ను వీలైనంత త్వరగా ఔట్ చేసేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్ కూడా వ్యూహాలు రచిస్తుంది. ఈ క్రమంలోనే మనోజ్ తివారీ తన వ్యూహాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు.

లెగ్‌సైడ్‌లో ఏడుగురు ఫీల్డర్లు..

లెగ్‌సైడ్‌లో ఏడుగురు ఫీల్డర్లు..

స్పిన్ బౌలింగ్‌‌లో టర్న్ వికెట్‌పై జోరు మీదున్న జోరూట్‌ను ఔట్ చేయాడానికి కావాల్సిన ఫీల్డింగ్ ప్లేస్ మెంట్ వ్యూహానికి సంబంధించిన పేపర్ మ్యాప్‌ను ఈ భారత వెటరన్ క్రికెటర్ ట్విటర్ వేదికగా షేర్ చేశాడు. ఈ వ్యూహంపై అభిమానులు లేవనెత్తిన ప్రశ్నలకు కూడా మనోజ్ తివారీ ఓపిగ్గా సమాధానాలిచ్చాడు.

రివర్స్ స్వీప్ షాట్లతో స్పిన్‌ను సమర్థవంతంగా ఆడే జోరూట్‌కు తన వ్యూహంతో చెక్‌ పెట్టవచ్చంటున్నాడు. ఇక తన ప్లాన్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌లను దృష్టిపెట్టుకొని రచించానన్నాడు. ఇక అతను షేర్ చేసిన ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్‌లో ఏడుగురిని లెగ్ సైడ్ పెట్టిన తివారీ.. ఆఫ్ సైడ్ కేవలం ఇద్దరి ఫీల్డర్లను మాత్రమే ఉంచాడు.

రివర్స్ స్వీప్ ఆడకుండా..

రివర్స్ స్వీప్ ఆడకుండా..

అది కూడా షార్ట్ థర్డ్ మ్యాన్, మిడాఫ్‌లో పెట్టాడు. రివర్స్‌స్వీప్ షాట్ ఆడినప్పుడు ఎడ్జ్ తీసుకుంటే థర్డ్ మ్యాన్‌కు చిక్కే అవకాశం ఉందని, స్డ్రైట్‌గా ఆడినప్పుడు మిడాఫ్ ఫీల్డర్ కవర్ చేస్తాడని పేర్కొన్నాడు. ఇక ఆఫ్ సైడ్ కవర్ డ్రైవ్‌లు ఆడితే ఎలా? అని ఓ అభిమాని ప్రశ్నించగా.. టర్న్ ట్రాక్‌పై క్యారమ్ బాల్స్‌ను అంత సులువుగా కవర్ డ్రైవ్స్ ఆడలేరని స్పష్టం చేశాడు.

ఇక లెగ్ సైడ్ ఏడుగురి ఫీల్డింగ్‌లో లెగ్ స్లిప్ ఒకరు, షార్ట్ లెగ్, షార్ట్ మిడ్ వికెట్, మిడాన్, బౌండరీకి 20 యార్డ్స్ ముందు డీప్ స్క్వేర్ లెగ్‌లో, షార్ట్ స్క్వేర్ లెగ్‌లో, డీప్ మిడ్ వికెట్‌‌లో ఫీల్డర్లను ఉంచాడు. స్వీప్ షాట్లు ఆడినప్పుడు బంతి గాల్లోకి లేస్తే షార్ట్ స్క్వేర్ లెగ్ ఫీల్డర్‌కు చిక్కుతుందన్నాడు. అలా కాకుండా భారీ షాట్‌కు ప్రయత్నిస్తే డీప్ మిడ్ వికెట్‌లో చిక్కుతాడని స్పష్టం చేశాడు. మొత్తానికి లెగ్ సైడ్ ఎక్కువగా ఆడే జోరూట్‌ను తన ఫీల్డ్ సెటప్‌తో బ్లాక్ చేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో ఆఫ్ సైడ్ ఆడటం జోరూట్‌‌కు సులువైన పని కాదన్నాడు.

Story first published: Thursday, February 11, 2021, 16:26 [IST]
Other articles published on Feb 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+