For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మైదానంలో కృనాల్ X టామ్ కరన్ వాగ్వాదం.. బిత్తరపోయిన కోహ్లీ (వీడియో)

India vs England: Krunal Pandya, Tom Curran Involved In Heated Verbal Exchange
India vs England : Krunal Pandya, Tom Curran's Heated Argument కృనాల్‌పై టామ్ కరన్‌ అనుచిత వ్యాఖ్యలు

పుణె: టెస్ట్, టీ20 సిరీస్‌లను ఓటమితో మొదలుపెట్టిన టీమిండియా.. వన్డే వార్‌ను మాత్రం అద్భుత విజయంతో షురూ చేసింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో చెలరేగి ఆడుతూ ఇంగ్లండ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం ఎంసీఏ స్టేడియం వేదికగా జరిగిన ఫస్ట్ వన్డేలో భారత్ 66 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా అరంగేట్ర ప్లేయర్ కృనాల్ పాండ్యా, ఇంగ్లండ్ పేసర్ టామ్ కరన్ మధ్య మైదానంలో చోటు చేసుకున్న వాగ్వాదం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

అసలేం జరిగిందంటే..?

భారత ఇన్నింగ్స్ 49వ ఓవర్‌లో టామ్ కరన్ వేసిన తొలి బంతిని డీప్ స్క్వేర్ లెగ్ దిశగా ఫ్లిక్ చేసి సింగిల్ తీసిన కృనాల్ పాండ్యా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అరంగేట్రం మ్యాచ్‌లో 26 బంతుల్లోనే ఈ ఘనతను అందుకున్న అతను మైదానంలో ఆనందం వ్యక్తం చేస్తూ ఇటీవల మరణించి అతని తండ్రికి అంకితమిచ్చాడు.

అయితే ఈ ఓవర్ ఐదో బంతిని లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించిన కృనాల్.. కుదరకపోవడంతో నిరాశకు గురయ్యాడు. అయితే సింగిల్ తీసే క్రమంలో టామ్ కరన్‌ ఏవో వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహానికి గురయ్యాడు. దాంతో అతనిపై దూసుకెళ్లడానికి ప్రయత్నించగా.. అంపైర్ అడ్డుకున్నాడు.

కోహ్లీ సైతం..

కోహ్లీ సైతం..

జోస్ బట్లర్ కూడా ఏవో వ్యాఖ్యలు చేస్తూ టామ్ కరన్ వైపు వెళ్లాడు. దాంతో మరింత ఆగ్రహానికి గురైన కృనాల్ అంపైర్‌తో వాదించాడు. అయితే అసలేం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. గొడవ గురించి కూడా స్పష్టత లేదు. ఇక డగౌట్‌లో ఉన్న విరాట్ కోహ్లీ సైతం బిత్తరపోయాడు. అసలేం జరుగుతుందా? అని అయోమయంగా చూశాడు. అయితే టామ్ కరన్ వేసిన 5వ బంతి అంపైర్ వైడ్ ఇచ్చాడు. దీనిపై తీవ్ర అసంతృప్తికి గురైన కరన్.. కృనాల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు అనిపించింది. దాంతో వాగ్వాదానికి దారితీసినట్లుంది. టామ్ కరన్ దూరంగా వెళ్లిపోవడం గొడవ సద్దుమణిగింది. ఇక చివరి బంతిని కేఎల్ రాహుల్ సిక్స్ కొట్టడంతో కృనాల్ కోపం చల్లారింది.

కృనాల్‌ భావోద్వేగం

కృనాల్‌ భావోద్వేగం

భారత్‌ తరఫున 18 టీ20లు ఆడిన తర్వాత వన్డేల్లో అరంగేట్రం చేసిన కృనాల్‌ పాండ్యా... కెరీర్‌ తొలి ఇన్నింగ్స్‌లోనే వేగవంతమైన అర్ధ సెంచరీ (26 బంతుల్లో) చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ ఫాస్టెస్ట్ ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ క్రికెటర్ జాన్ మెరిస్(35 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. గత జనవరిలో కన్నుమూసిన తన తండ్రికి ఈ ఇన్నింగ్స్‌ను అంకితమిచ్చిన కృనాల్, ఇంటర్వ్యూ సమయంలో తన భావోద్వేగాలను ఆపుకోలేక కంటతడి పెట్టాడు. వెంటనే సోదరుడు హార్దిక్‌ దగ్గరకు తీసుకొని అతడిని ఓదార్చాల్సి వచ్చింది.

9 ఏళ్ల తర్వాత..

9 ఏళ్ల తర్వాత..

తొమ్మిదేళ్ల తర్వాత ఓ అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో అన్నదమ్ములైన రెండు జోడీలు (హార్దిక్, కృనాల్‌; టామ్‌ కరన్, స్యామ్‌ కరన్‌) తుది జట్టులో ఆడాయి. 2012లో యూఏఈ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ జట్ల మధ్య జరిగిన జరిగిన మూడు వన్డేలలో (మైక్‌ హస్సీ, డేవిడ్‌ హస్సీ; కమ్రాన్‌ అక్మల్, ఉమర్‌ అక్మల్‌) రెండు జోడీలు బరిలోకి దిగాయి. ఇక భారత్ తరఫున ఇర్ఫాన్ పఠాన్-యూసఫ్ పఠాన్ తర్వాత వన్డేల్లో బరిలోకి దిగిన అన్నదమ్ముల జోడిగా కృనాల్-హార్దిక్ పాండ్యాలు నిలిచారు.

Story first published: Wednesday, March 24, 2021, 11:20 [IST]
Other articles published on Mar 24, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+