న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: నాన్నకు ప్రేమతో.. పాండ్యా బ్రదర్స్ ఏం చేశారంటే? (వీడియో)

India vs England: Krunal Pandya reveals he had his late fathers bag in Indian dressing room

పూణే: మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ వన్డే ద్వారా కృనాల్‌ పాండ్యా వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి వన్డేలోనే హాఫ్ సెంచరీ (31 బంతుల్లో 58 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ఔరా అనిపించాడు. బౌలింగ్‌లో కూడా రాణించిన కృనాల్‌.. తన తండ్రి పట్ల ఉన్న ఎమోషన్‌ను అస్సలు ఆపుకోలేక పోతున్నాడు. తమ్ముడు హార్ధిక్‌ పాండ్యా నుంచి వన్డే క్యాప్‌ అందుకునే సమయంలో భావోద్వేగానికి లోనైన కృనాల్‌.. ఇన్నింగ్స్ అనంతరం కన్నీలను ఆపుకోలేకపోయాడు. ఇక మ్యాచ్ అనంతరం పాండ్యా సోదరులు మరోసారి భావోద్వేగానికి గురయ్యారు.

నాన్న సంతోషించే ఉంటారు:

తొలి వన్డే అనంతరం హార్దిక్ పాండ్యా తన సోదరుడు కృనాల్ పాండ్యా‌ను ఇంటర్వ్యూ చేయగా.. ఆ వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ సందర్భంగా పాండ్యా సోదరులిరువురు మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. తమ తండ్రి తమతో లేకున్నా.. ఆయన దుస్తులైనా డ్రస్సింగ్‌ రూమ్‌లో ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. 'ఈ ప్రదర్శన నాన్నకు అంకితమిస్తున్నా. ఆయన ఆశీర్వాదాలు ఎప్పటికీ మన వెంట ఉంటాయి. మనిద్దరికీ భావోద్వేగం కలిగించే అంశమిది. హార్దిక్‌ నుంచి టోపీ అందుకోవడం చూసి నాన్న సంతోషించే ఉంటారు' అని కృనాల్‌ అన్నాడు.

అందుకే దుస్తులను తీసుకొచ్చా:

అందుకే దుస్తులను తీసుకొచ్చా:

'16న ఉదయం నాన్న మరణించారు. ఆ రోజు నేను సయ్యద్ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ ఆడుతున్నా. తర్వాత రోజు ఉదయం ఏ దుస్తులు వేసుకోవాలో ముందురోజు రాత్రే సిద్ధం చేసుకోవడం నాన్నకు అలవాటు. అందుకే ఆయన దుస్తుల సంచీని బరోడా నుంచి ఇక్కడికి తీసుకొచ్చా. ఆయన లేరని తెలుసు. అందుకే మ్యాచ్‌ వీక్షించేందుకు ఆయన ధరించే దుస్తులను ఇక్కడికి తీసుకొచ్చాను. డ్రస్సింగ్‌ రూమ్‌లో ఉంచాలనుకున్నా' అని కృనాల్‌ పాండ్యా చెప్పాడు.

నాన్న మనతోనే ఉంటారు:

నాన్న మనతోనే ఉంటారు:

'మన జీవిత కాలంలో తొలిసారి మన నాన్న డ్రస్సింగ్‌ రూమ్‌లోకి వచ్చారు. ఆయనెప్పుడూ మనతోనే ఉంటారు. మనిద్దరి తరఫున నువ్వు అద్భుతంగా ఆడావ్‌ కృనాల్‌. నాన్నకు నువ్వు ముందే పుట్టినరోజు కానుక ఇచ్చినట్టు నాకు అనిపించింది' అని హార్దిక్‌ పాండ్యా భావోద్వేగం చెందాడు. ఈ ఏడాది జనవరి 16న పాండ్యా సోదరుల తండ్రి హిమాన్షు పాండ్యా (71) గుండె పోటుతో మృతి చెందారు. తొలి వన్డేలో అరంగేట్రం ఆటగాళ్లు కృనాల్ పాండ్యా‌, ప్రసిద్ద్‌ కృష్ణ (4/54)) అద్భుతంగా రాణించడంతో టీమిండియా విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం జరగనుంది.

ప్రపంచ రికార్డు:

ప్రపంచ రికార్డు:

తొలి వన్డేలో క్లిష్ట సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన కృనాల్ పాండ్యా ఇంగ్లండ్‌ బౌలర్లను చీల్చిచెండాడు. ఈ క్రమంలో అతను ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 26 బంతుల్లోనే అర్ధ శతకాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. దీంతో అరంగేట్రంలో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ క్రికెట్‌లో ఇన్ని తక్కువ బంతుల్లో ఇప్పటివరకు ఏ అరంగేట్ర ఆటగాడూ అర్థం సెంచరీ చేయలేదు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్‌ ఆటగాడు జాన్‌ మోరిస్‌ (35 బంతుల్లో) పేరిట ఉంది.

IPL 2021కి శ్రేయస్‌ అయ్యర్‌ దూరం.. ఢిల్లీ కెప్టెన్సీ రేసులో ఐదుగురు! అవకాశం ఎవరికంటే?

Story first published: Wednesday, March 24, 2021, 20:50 [IST]
Other articles published on Mar 24, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X