బౌండరీ లైన్‌పై కేఎల్ రాహుల్ సూపర్ మ్యాన్ షో.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే! (వీడియో)

అహ్మదాబాద్: టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో చిత్తయిన విషయం తెలిసిందే. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా బౌండరీ లైన్‌పై రాహుల్ చేసిన సూపర్ మ్యాన్ షో మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. దాదాపు సిక్స్ అనుకున్న బంతిని అతని మైమరిపించే ఫీల్డింగ్‌తో అడ్డుకొని 4 పరుగులను ఆదా చేశాడు. రాహుల్ మ్యాజిక్ ఫీల్డింగ్‌కు బ్యాట్స్‌మెన్‌తో పాటు మైదానంలోని సహచర ఆటగాళ్లు, అభిమానులు, కామెంటేటర్లు అవాక్కయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
అసలేం జరిగిందంటే..?
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా అక్షర్ పటేల్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతిని ఇంగ్లండ్ ఓపెనర్ జోస్ బట్లర్ డిప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అయితే దాదాపు అది సిక్స్ అనుకున్నారంతా. కానీ ఆ షాట్‌ను రాహుల్ బౌండరీ దగ్గర ఎగురుతూ గాల్లో క్యాచ్ అందుకున్నాడు. అయితే.. అతను నియంత్రణ కోల్పోయి బౌండరీ అవతలకి పడిపోయాడు. కానీ పడిపోయే ముందే చాకచక్యంగా బంతిని మైదానంలోకి విసిరేసి జట్టుకు నాలుగు పరుగులు ఆదా చేశాడు. ఈ థ్రిల్లింగ్ క్యాచ్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా రాహుల్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
రాహుల్ క్లాసీ..
రాహుల్ సూపర్ ఫీల్డింగ్ అని ఒకరంటే.. అద్భుతం.. నీ ఫీల్డింగ్‌తో సంభ్రమాశ్చర్యానికి గురయ్యామని మరొకరు కామెంట్ చేశారు. మూమెంట్ ఆఫ్ ది డే అంటూ రాహుల్ సూపర్ ఫీల్డింగ్‌కు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తున్నారు. వికెట్ కీపర్లు ఫీల్డర్లుగా మారితే ఇలానే ఉంటుందని, గతంలో నికోలస పూరన్, సంజూశాంసన్ సూపర్ ఫీల్డింగ్ ఘటనలను పంచుకుంటున్నారు. ఏదైనా చేయగల సత్తా కేఎల్‌కు ఉందని, ఓ వారం రోజులు సోషల్ మీడియాను ఈ వీడియో షేక్ చేస్తుందని మరో అభిమాని కామెంట్ చేశాడు.
శుభారంభం లేదు..
ఇక నాలుగు టెస్ట్‌ల సిరీస్ 3-1తో కైవసం చేసుకున్న భారత్.. 5 టీ20ల సిరీస్‌ను ఓటమితోనే ప్రారంభించింది. ఇంగ్లండ్‌ను స్పిన్ ఉచ్చులో బిగించాలనుకున్న భారత వ్యూహం బెడిసి కొట్టింది. దాంతో భారత్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో చిత్తయింది. స్పిన్నర్లపై బ్యాట్ ఝుళిపించిన జాసన్ రాయ్ (32 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సునాయాస విజయా న్నందించాడు. ముందుగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (48 బంతుల్లో 67; 8 ఫోర్లు, 1 సిక్స్) పోరాడాడు. కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమ్యాడు. తర్వాత ఇంగ్లండ్ 15.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసి గెలిచింది. ఆదివారం రెండో టి20 ఇక్కడే జరుగుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications