For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: రాహుల్ సెంచరీ.. పంత్ మెరుపు ఫిఫ్టీ! ఇంగ్లండ్‌కు భారీ లక్ష్యం!

India vs England: KL Rahul 108, Rishah Pant 77, England need 337 runs to win 2nd ODI

పూణే: ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండ‌వ వ‌న్డేలో టీమిండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 336 రన్స్ చేసి.. ఇంగ్లండ్ ముందు 337 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కేఎల్ రాహుల్ ఏడు ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 108 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. శ్రేయ‌ర్ అయ్యర్ స్థానంలో వ‌చ్చిన రిష‌బ్ పంత్ (108; 114 బంతుల్లో 7×4, 2×6) దూకుడు బ్యాటింగ్‌తో చెలరేగాడు.

విరాట్‌ కోహ్లీ (79 బంతుల్లో 66; 3 ఫోర్లు, సిక్స్‌) కూడా అర్ధ శతకం చేయగా.. హార్దిక్ పాండ్యా (35; 16 బంతుల్లో 1×4, 4×6) సిక్సర్లతో చెలరేగి జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌ (4), రోహిత్‌ శర్మ (25) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టోప్లీ, టామ్ కరన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

ఆరంభంలోనే టీమిండియాకు షాక్‌

ఆరంభంలోనే టీమిండియాకు షాక్‌

రెండో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. మొదటగా భారత్ బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే టీమిండియాకు షాక్‌ తగిలింది. సీనియర్ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ (4) విఫలమయ్యాడు. నాలుగో ఓవర్‌ ఐదో బంతికి గబ్బర్ తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. రీస్ టోప్లీ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో టీమిండియా 9 పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఇక బౌండరీలు బాదుతున్న రోహిత్‌ శర్మ (25; 25 బంతుల్లో 5×4)ను సామ్‌ కరన్‌ పెవిలియన్‌ పంపించాడు. కరన్‌ వేసిన 9 ఓవర్‌ నాలుగో బంతిని రోహిత్‌ లెగ్‌ సైడ్‌ వైపు ఫ్లిక్‌ చేయబోయి రషీద్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.

ఆదుకున్న కోహ్లీ, రాహుల్

ఆదుకున్న కోహ్లీ, రాహుల్

ఓపెన‌ర్లు త్వరగా ఔట్ అవ్వడంతో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వికెట్‌పై లభిస్తున్న అదనపు బౌన్స్‌ను ఆసరాగా చేసుకొని ఇంగ్లిష్‌ పేసర్లు కట్టుదిట్టమైన ప్రాంతాల్లో బంతులేయడంతో మొదటలో ఇద్దరూ నిదానంగా బ్యాటింగ్ చేశారు. క్రీజులో కుదురుకున్నాక కాస్త వేగం పెంచారు. ఎక్కువగా బౌండరీల జోలికి పోకుండా.. స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకునడిపారు. ఈ క్రమంలోనే మొయిన్ అలీ వేసిన 27వ ఓవర్ చివరి బంతికి సింగల్ తీసిన కోహ్లీ ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. ఆపై ఇద్ద‌రి మ‌ధ్య భాగ‌స్వామ్యం వంద ప‌రుగులు దాటింది. ఇక మొయిన్ అలీ వేసిన 31వ ఓవర్ మొదటి బంతికి సింగల్ తీసిన రాహుల్ ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు.

28 బంతుల్లోనే పంత్ అర్ధ శతకం

28 బంతుల్లోనే పంత్ అర్ధ శతకం

అయితే పరుగుల వేగం పెరిగే క్రమంలో జట్టు స్కోరు 158 వద్ద కోహ్లీని ఆదిల్‌ రషీద్‌ పెవిలియన్‌ పంపించాడు. ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్నప్పటికీ.. దొరికిన ప్రతి బంతిని రాహుల్‌ బౌండరీకి పంపించాడు. అతడికి రిషభ్ పంత్‌ తోడయ్యాడు. వచ్చిరావడంతోనే పంత్ విరుచుకుపడ్డాడు. దీంతో 39 ఓవర్లకు భారత్ స్కోరు 200 దాటింది. ఆ తర్వాత స్టోక్స్‌ వేసిన 41వ ఓవర్లో పంత్‌ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలోనే 28 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. ఆపై రాహుల్‌ సైతం కళ్లు చెదిరే సిక్సర్లు బాదేసి కెరీర్లో ఐదో శతకం అందుకున్నాడు.

చెలరేగిన హార్దిక్

చెలరేగిన హార్దిక్

భారీ షాట్లు ఆడే క్రమంలో 44.5వ బంతికి రాహుల్‌ను టామ్‌ కరన్‌ ఔట్‌ చేశాడు. దాంతో నాలుగో వికెట్‌కు 113 (80 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత పంత్, హార్దిక్ పాండ్యా బౌండరీలు, సిక్సర్లు బాదడంలో పోటీపడ్డారు. స్కోర్ వేగం పెంచే క్రమంలో టామ్‌ కరన్‌ వేసిన 46.5వ బంతికి పంత్‌ ఔటయ్యాడు. చివరలో కృనాల్‌ పాండ్యా (12; 9 బంతుల్లో 1×4)తో కలిసి హార్దిక్‌ జట్టు స్కోరును 336కు చేర్చాడు. చివరి రెండు ఓవర్లలో అంతగా పరుగులు చేయకపోవడంతో భారత్ 350 మార్క్ అందుకోలేకపోయింది.

ఆ ఘటన తర్వాత యువరాజ్‌ను గౌరవించడం ప్రారంభించా.. అభిమానిగా మారిపోయా: మంజ్రేకర్‌

Story first published: Friday, March 26, 2021, 17:56 [IST]
Other articles published on Mar 26, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+