ఇండియాను ఓడించే సీన్ ఇంగ్లండ్‌కు లేదు.. టెస్ట్ సిరీస్ కోహ్లీసేనదే: కెవిన్ పీటర్సన్

లండన్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న అప్‌కమింగ్ టెస్ట్ సిరీస్‌లో అతిథ్య జట్టే ఫేవరేట్ అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. ఇండియాను ఓడించే సీన్ ఇంగ్లండ్ జట్టుకు లేదని,ఇంగ్లీష్ టీమ్ అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగడం లేదన్నాడు. ఫిబ్రవరి 5 నుంచి ఇరు జట్ల మధ్య ఫస్ట్ టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో మాట్లాడిన పీటర్సన్ ఈ సిరీస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి రెండు టెస్ట్‌లకు ఇంగ్లండ్ జట్టు ఎంపిక సరిగ్గా లేదని కూడా విమర్శించాడు.

ఇండియా ఈజీగా..
'స్వదేశంలో భారత్ జట్టుకు ఎంతో అనుభవం ఉంది. అంతేకాకుండా కోహ్లీ రాకతో ఆ జట్టు మరింత పటిష్టంగా కనిపిస్తుంది. కానీ ఇంగ్లండ్ మాత్రం తొలి రెండు టెస్ట్‌లకు నామమాత్రపు జట్టుతో బరిలోకి దిగుతుంది. జానీ బెయిర్‌స్టోను తుది జట్టులోకి తీసుకోవాల్సింది. ఈ సిరీస్‌లో భారత జట్టే ఫేవరేట్. ఎందుకంటే ఇంగ్లండ్ అత్యుత్తమ జట్టుతో ఆడటం లేదు. భారత్ జట్టే సునాయసంగా విజయం సాధిస్తుంది.'అని చెప్పుకొచ్చాడు. ఇక పీటర్సన్ వ్యాఖ్యలతో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డొమినిక్ కార్క్ కూడా ఏకీ భవించాడు. భారతే సిరీస్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు.

సిరీస్ మొత్తం..
ఇక ఈ సిరీస్ ఆసాంతం కోహ్లీ, అజింక్యా రహానే చుట్టే చర్చ జరుగుతుందని ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ, అజింక్యా రహానేల సారథ్యం మధ్య పోలిక కూడా తెస్తారన్నాడు. 'కోహ్లీ, అజింక్యా రహానేల చుట్టూనే చర్చ జరుగుతుంది. ఆస్ట్రేలియాలో రహానే సారథ్యంలోని జట్టు.. కోహ్లీ కెప్టెన్సీలోని భారత్ ఎలా ఆడుతుందనే విషయం హాట్ టాపిక్ కానుంది. ఈ సిరీస్ మొత్తం దీని గురించే మాట్లాడుకునే అవకాశం ఉంది. జోఫ్రా ఆర్చర్, పుజారా, బుమ్రా రీ ఎంట్రీ వంటి ఎన్నో విషయాలున్నా.. అజింక్యా రహానే ఆసీస్ విజయం.. విరాట్ కోహ్లీ రీఎంట్రీపైనే అందరి దృష్టి నెలకొంటుంది. 'అని ఈ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ తెలిపాడు.

జోరులో జోరూట్ ఒక్కడే..
ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ జోరూట్ ఒక్కడే జోరు మీదున్నాడని పీటర్సన్ తెలిపాడు. 'జోరూట్ శ్రీలంకలో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అతనొక్కడే సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మిగతా ఆటగాళ్లంతా నామమాత్రంగానే కనిపిస్తున్నారు. ఇంగ్లండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ లయ అందుకున్నారా? అంటే డౌటే. గత మ్యాచ్‌లో మాత్రం సిబ్లీ బాగా రాణించాడు. క్రాలీ, బర్న్స్ టచ్‌లోకి వచ్చారా అనే విషయం తెలియదు. బెన్ స్టోక్స్ అందుబాటులో ఉన్నాడు. అతను అద్భుతమైన ఆటగాడు. అండర్సన్ సత్తా చాటగలడా అనేది కూడా సందేహమే. కానీ ప్రత్యర్థి జట్టులో అశ్విన్, బుమ్రా, కోహ్లీ, రహానే, పుజారా రూపంలో చాలా మంది సూపర్ స్టార్లు ఉన్నారు. అయితే ఈ సిరీస్ అద్భుతంగా సాగుతుందని మాత్రం చెప్పగలను'అని పీటర్సన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications