For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సామ్ కరన్.. ధోనీని తలపించాడు: జోస్ బట్లర్

India vs England: Jos Buttler says Sam Curran has shades of MS Dhoni

పుణే: సామ్‌కరన్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లక్షణాలు కనిపిస్తున్నాయని ఇంగ్లండ్ తాత్కలిక కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. భారత్‌తో ఆదివారం జరిగిన డిసైడర్ వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో సామ్ కరన్(83 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 95 నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌ను ఓడించినంత పనిచేశాడు. అతని అసాధారణ పోరాటంపై మ్యాచ్ అనంతరం స్పందించిన జోస్ బట్లర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతని వీరోచిత పోరాటం టీమిండియా గ్రేట్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోనీని గుర్తు చేసిందన్నాడు.

ధోనీతో మాట్లాడాలి..

ధోనీతో మాట్లాడాలి..

'ప్రస్తుతం అందరి కళ్లు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 సీజన్‌పైనే ఉన్నాయి. ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ ప్లేయర్ అయిన సామ్ ‌కరన్ ఫైనల్ వన్డేలో తను ఆడిన ఇన్నింగ్స్ గురించి మహీతో చర్చిస్తాడని నేను అనుకుంటున్నా. అంతరాతీయ క్రికెట్‌లో అద్భుతమైన క్రికెటర్ గా, ఫినిషర్ గా ఎంఎస్ ధోనీ అంటే ఏమిటో మనందరికీ తెలిసిందే.

కాబట్టి ధోనీ లాంటి గొప్ప ఆటగాడితో ఇలాంటివి పంచుకోవడం సామ్ కెరీర్‌కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఐపీఎల్ కారణంగా మా ఆటగాళ్లకు కూడా ధోనీ దగ్గర క్రికెట్ పాఠాలు నేర్చుకునే అవకాశం లభిస్తుండడం నాకు ఆనందంగా ఉంది'అని బట్లర్ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్‌ 2021లో చెన్నై జట్టు తరఫున ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ కూడా ఆడనున్నాడు.

అందుకే ఓడిపోయాం..

అందుకే ఓడిపోయాం..

మ్యాచ్‌లో సరైన భాగస్వామ్యాలు నెలకోల్పడంలో విఫలమయ్యామని అదే మా ఓటమికి కారణమైందని బట్లర్ చెప్పుకొచ్చాడు. 'రెండో వన్డేలో 43.3 ఓవర్లలో 337 పరుగులు చేసిన ఇంగ్లండ్‌కు మూడో వన్డేలో 330 టార్గెట్ అంత కష్టమేమి కాదు, మేం ఆ స్కోరును చేధించగలమని అనుకున్నాం. రన్-రేట్ సమస్య అవుతుందని అనుకోలేదు, కానీ మేం క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడం, సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేక పోవడం వంటి అంశాలు ఇంగ్లండ్‌కు విజయాన్ని దూరం చేసాయి.

మా తప్పిదాలే..

మా తప్పిదాలే..

చిన్న, చిన్న పొరపాట్లు కలిసి పెద్దవిగా మారుతాయి. ఈ మ్యాచ్ లో అదే జరిగింది. మ్యాచ్‌ ఆరంభంలో మా బౌల్లర్లు క్రమశిక్షణగా బౌలింగ్‌ చేశారు,కానీ చివరి వరకు అది కొనసాగించలేదనే అనుకుంటున్నాను. భారత్‌ బ్యాట్స్‌మెన్‌ కొన్ని బౌండరీల విషయంలో కష్టపడకపోయినా సునాయాసంగా మేమే పరుగులు సమర్పించుకున్నాం. అవే 7 పరుగలు మా పతనాన్ని శాసించాయి.' అని బట్లర్‌ అన్నాడు.

కరన్ ఇన్నింగ్స్‌కు ఫిదా..

కరన్ ఇన్నింగ్స్‌కు ఫిదా..

టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తాత్కాలిక కెప్టెన్‌ బట్లర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 48.2 ఓవర్లలో 329 పరుగులవద్ద ఆలౌటైంది. శిఖర్ ధావన్‌ (56 బంతుల్లో 10 ఫోర్తో 67), పంత్‌ (62 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 78), హార్దిక్‌ పాండ్యా (44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64) దూకుడైన ఆటతో అర్ధ సెంచరీలు సాధించారు. రోహిత్‌ శర్మ (37 బంతుల్లో 6 ఫోర్లతో 37), శార్దుల్‌ ఠాకూర్‌ (21 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 30) కూడా రాణించారు.

అనంతరం 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసి ఓడిపోయింది. మలాన్‌ (50 బంతుల్లో 6 ఫోర్లతో 50), స్టోక్స్‌ (39 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌‌తో 35), లివింగ్‌స్టోన్‌ (31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌ 36) రాణించినా కీలక తరుణంలో ఔటయ్యారు. స్యామ్‌ కరన్‌ (83 బంతుల్లో 95 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) పట్టుదలతో ఆడి ఇంగ్లండ్‌ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన పోరులో భారత్‌ నెగ్గినా... స్యామ్‌ కరన్‌ తన అసాధారణ పోరాటం తో అందరి మనసులు గెలుచుకున్నాడు.

Story first published: Monday, March 29, 2021, 14:27 [IST]
Other articles published on Mar 29, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+