For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో టెస్ట్ ముందు ఇంగ్లండ్‌కు గట్టి షాక్.. గాయంతో స్టార్ పేసర్ దూరం!

India vs England: Jofra Archer Ruled Out Of Second Test After Injection To Right Elbow

చెన్నై: భారత్‌తో శనివారం నుంచి జరిగే రెండో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. తన మెరుపు వేగంతో తొలి టెస్ట్‌లో మూడు కీలక వికెట్లతో సత్తా చాటిన పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మోచేతి గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. మోచేతికి నొప్పి కారణంగా బుధవారం అతను ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. గురువారం అతని కుడి చేతికి ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత పరిస్థితి మెరుగుపడలేదు.

ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. అతని స్థానంలో వోక్స్ లేదా ఒలీ స్టోన్ ఆడవచ్చు. ఇక ఆటగాళ్ల రొటేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్, స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ సెకండ్ టెస్ట్‌కు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. అండర్సన్ స్థానంలో స్టువర్ట్ బ్రాడ్ జట్టులోకి రానుండగా.. బట్లర్ స్థానంలో బెయిర్ స్టో లేదా ఫోక్స్ బరిలోకి దిగనున్నాడు.

తన కెరీర్‌లో చూసిన అత్యంత దారుణమైన పిచ్‌ల్లో చెన్నై పిచ్‌ ముందు వరుసలో నిలుస్తుందని జోఫ్రా ఆర్చర్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆఖరి రోజు పిచ్‌ మరింత మందకొడిగా మారిపోయి నిర్జీవంగా ఉండిదన్నాడు. చివరి రోజు ఆటలో లంచ్‌కు ముందు డ్రింక్స్‌ బ్రేక్‌లోపే తమ జట్టు విజయం సాధిస్తుందని ఆశించానని, పిచ్‌ నిర్జీవంగా మారడంతో మ్యాచ్‌ ఫలితం మరింత ఆలస్యమైందని పేర్కొన్నాడు.

ఐదో రోజు పిచ్‌ స్వరూపం ఎలా మారినా తమ బౌలర్‌ జేమ్స్ అండర్సన్‌ మాత్రం అద్భుతమైన రివర్స్‌ స్వింగ్‌ను రాబట్టి మ్యాచ్‌ను త్వరగా ముగించాడంటూ అతని‌పై ప్రశంశల వర్షం కురిపించాడు. అండర్సన్‌ తన చివరి స్పెల్‌ను 5-3-6-3తో ముగించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ 227 పరుగుల తేడాతో పర్యాటక జట్టు చేతిలో ఓటమిపాలై నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో 0-1 తేడాతో వెనకపడింది. కాగా, ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్‌కు కూడా చెన్నై మైదానమే వేదిక కానుంది. ఈ విజయ ఉత్సాహంతోనే ఇంగ్లండ్ ప్రేక్షకుల మధ్య రేపటి నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది.

Story first published: Friday, February 12, 2021, 11:23 [IST]
Other articles published on Feb 12, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+