
తక్కువగా అంచనా వేశాం
మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మాట్లాడుతూ... 'కెప్టెన్‌గా నేను కొన్ని పొరపాట్లు చేశాను. వ్యూహాత్మకంగా కొన్ని భిన్నమైన మార్పులు చేయాల్సింది. మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా భాగస్వామ్యం మ్యాచులో కీలకమనడంలో ఎలాంటి సందేహం లేదు. వారిని నేను అడ్డుకోలేకపోయాను. దాంతో మా జట్టు కష్టాల్లో పడింది. మేం తొలి ఇన్నింగ్స్‌లో ఆడినట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆడనందుకు చాలా నిరాశపడుతున్నా. టీమిండియా లోయర్ ఆర్డర్ డిఫెన్స్‌ను అంచనా వేయడంలో పొరపడ్డాను' అని అన్నాడు.

వారికి ఘనత ఇవ్వాల్సిందే
మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాపై ప్రయోగించిన షార్ట్ బంతుల వ్యూహం విఫలమైందని జో రూట్ తెలిపాడు. 'నిజానికి మేం స్టంప్స్‌కు నేరుగా దాడి చేస్తూ షార్ట్ పిచ్ బంతులతో ఆశ్చర్యపరిస్తే బాగుండేదేమో. ఏదేమైనా వారిద్దరికీ (షమీ, బుమ్రా) ఘనత ఇవ్వాల్సిందే. వారు భిన్నమైన ప్రాంతాల్లో పరుగులు చేయడంతో ఫీల్డర్లను సరిగ్గా మోహరించలేక పోయాను. ఇకముందు మేం మరిన్ని వ్యూహాలతో వచ్చి వికెట్లు పడగొట్టేందుకు ప్రయత్నిస్తాం' అని రూట్ పేర్కొన్నాడు.
India vs England: 39 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన హైదరాబాద్ పేసర్!!

భారత్ నిజాయతీగానే ఆడింది
టీమిండియా దూకుడులో తప్పేమీ లేదని ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్ స్పష్టం చేశాడు. 'విరాట్ కోహ్లీ తన సహజ శైలిలోనే ప్రవర్తించాడు. అతడితో పోలిస్తే.. నాది భిన్నమైన ఆటతీరు. భారత్ నిజాయతీగానే ఆడింది. వారు ఎక్కువ భావోద్వేగం చెందారు. వ్యూహాత్మకంగా రాణించారు. అవకాశాలను కోహ్లీసేన ఒడిసిపట్టింది. నాకు తెలిసినంత వరకు మైదానంలో ఆటగాళ్ల మధ్య తీవ్రమైన వాగ్వాదాలేమీ జరగలేదు. విద్వేషం ప్రదర్శించలేదు. ఆటలో అవన్నీ సహజమే, శృతిమించనంతవరకు అన్ని బాగుంటాయి' అని రూట్ చెప్పుకొచ్చాడు.

కవ్వింపులు, టెన్షన్ సాయం చేశాయి
'మొత్తం జట్టును చూసి గర్వపడుతున్నా. మేం మా ప్రణాళికలను కచ్చితత్వంతో అమలు చేశాం. తొలి 3 రోజులు పిచ్ అంతగా సహకరించలేదు. తొలి రోజైతే అత్యంత కఠినంగా అనిపించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఒత్తిడి పెరిగిన తర్వాత షమీ, బుమ్రా అద్భుతంగా ఆడారు. మేం ప్రత్యర్థిని 60 ఓవర్లలో ఆలౌట్ చేస్తామన్న నమ్మకం కలిగింది. రెండో ఇన్నింగ్స్‌లో మైదానంలో కవ్వింపులు, టెన్షన్ మాకు సాయం చేశాయి.
లోయర్ ఆర్డర్ పరుగులు చేయడం లేదని కొన్నాళ్లుగా అంటున్నారు. ఇప్పుడు వారు పరుగులు చేయగలమని నిరూపించారు. ఎంఎస్ ధోనీ సారథ్యంలో లార్డ్స్ మైదానంలో చివరిసారి గెలిచినప్పుడు నేను ఆడాను. అదెంతో ప్రత్యేకం. ఇప్పుడు 60 ఓవర్లలోపే ఫలితం రావడం మరింత ప్రత్యేకం' అని విరాట్ కోహ్లీ అన్నాడు.


Click it and Unblock the Notifications












