Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: 39 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన హైదరాబాద్ పేసర్!!

India vs England: Mohammad Siraj breaks Kapil Devs 39 Year Old Record at Lords
Ind vs Eng 2021: Mohammad Siraj Breaks Kapil Dev’s 39-year-Old Record | Oneindia Telugu

లండన్: ఐదు టెస్ట్ సిరీసులో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా బౌలర్‌, హైదరాబాద్ పేసర్ మహ్మద్‌ సిరాజ్‌ 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. సిరాజ్‌ లార్డ్స్‌ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 8 వికెట్లు పడగొట్టాడు. ఈ ఎనిమిది వికెట్లలో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు.. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీశాడు. ఇక లార్డ్స్‌ టెస్టులో ఒక టీమిండియా బౌలర్‌ ఇన్ని వికెట్లు పడగొట్టడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు 1982లో భారత మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. కపిల్‌ 168 పరుగులిచ్చి 8 వికెట్లు తీయగా.. సిరాజ్ 126 పరుగులకే 8 వికెట్లు పడగొట్టడం విశేషం.

1982లో లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో కపిల్‌ దేవ్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి ఓవరాల్‌గా 8 వికెట్లు సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడం విశేషం. ఇప్పుడు మొహ్మద్ సిరాజ్ 8 వికెట్లు పడగొట్టాడు. కపిల్‌ 168 పరుగులిచ్చి 8 వికెట్లు తీయగా.. సిరాజ్ 126 పరుగులకే 8 వికెట్లు తీశాడు. దీంతో 39 ఏళ్ల కపిల్ రికార్డు బద్దలైంది. అంతేకాదు లార్డ్స్ టెస్టులో భారత్ తరుపున అత్యుత్తమ గణాంకాలు నమోదుచేసిన బౌలర్‌గా కూడా సిరాజ్ నిలిచాడు.

మాజీ పేసర్ ఆర్‌పీ సింగ్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. అతడు 117 పరుగులకు 7 వికెట్లు తీశాడు. ఇక 2014లో లార్డ్స్‌ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా పేసర్‌ ఇషాంత్‌ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీశాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం ఒక్క వికెట్‌ తీయలేకపోయాడు. భారత స్పిన్నర్లు వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం ఇది రెండోసారి. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా ఎంట్రీ ఇచ్చిన మొదటి రెండు మ్యాచుల్లో భారత స్పిన్నర్లు ఉన్నా వారికి వికెట్లు దక్కలేదు.

రెండో టెస్టులో భారత్ విజయం సాధించడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న నాలుగో కెప్టెన్‌గా విరాట్ నిలిచాడు. కోహ్లీ 63 టెస్ట్ మ్యాచులో 37 విజయాలు అందుకున్నాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ మాజీ సారథి క్లైవ్ లాయిడ్‌ను అధిగమించాడు. లార్డ్స్ టెస్టుకు ముందు వరకు 36 టెస్ట్ విజయాలతో కోహ్లీ లాయిడ్‌ సమానంగా ఉన్నారు. టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా మాజీ సారథి స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. స్మిత్ 109 మ్యాచుల్లో 53 విజయాలు అందుకున్నాడు. రికీ పాంటింగ్ ( 77 మ్యాచుల్లో 48 విజయాలు), స్టీవ్ వా (57 మ్యాచుల్లో 41 విజయాలు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Story first published: Tuesday, August 17, 2021, 18:16 [IST]
Other articles published on Aug 17, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+