For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మా ఓటమికి పిచ్ కారణం కాదు.. ఇది మాకు ఓ గుణపాఠం: జో రూట్

India vs England: Joe Root says Pitch not the reason for our defeat, we were outplayed

చెన్నై: పిచ్ కారణంగా తాము ఓడిపోలేదని, అన్ని విభాగాల్లో సమష్టిగా విఫలమయ్యామని ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ అన్నాడు. భారత్‌తో మంగళవారం ముగిసిన సెకండ్ టెస్ట్‌లో ఇంగ్లండ్ 317 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో స్పిన్ వికెట్ ఉపయోగించడంతోనే భారత్ విజయం సాధించిందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, కెవిన్ పీటర్సన్, డేవిడ్ లాయడ్‌లు విమర్శించాడు. అయితే జోరూట్ మాత్రం ఈ విమర్శలను తప్పుబట్టాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తమ జట్టు అన్న విభాగాల్లో విఫలమైందన్నాడు. ఈ ఓటమి తమకు ఓ గుణపాఠమని పేర్కొన్నాడు.

 భారత్ ఆధిపత్యం..

భారత్ ఆధిపత్యం..

బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ మూడు విభాగాల్లోనూ భారత్​ తమపై ఆధిపత్యం ప్రదర్శించిందని తెలిపాడు. విజయానికి వారే సంపూర్ణ అర్హులని పేర్కొన్నాడు. 'ఈ టెస్టులో భారత్​ బ్యాటింగ్​, బౌలింగ్​, ఫీల్డింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మ్యాచ్​ ఆసాంతం ఇండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్​ చేశారు. విజయానికి వారు సంపూర్ణంగా అర్హులు. క్రెడిటంతా టీమిండియాకు దక్కుతుంది. ఈ ఓటమి మాకొక గుణపాఠం. రెండో రోజు నుంచి పిచ్​ బ్యాటింగ్​కు కష్టంగా మారింది. సిరీస్​ 1-1తో సమమైంది. తదుపరి రెండు టెస్టులపై మేము దృష్టి పెట్టనున్నాము. అహ్మదాబాద్​ వేదికగా జరిగే డే/నైట్​ టెస్టుకు అదనపు స్పిన్నర్​తో బరిలోకి దిగుతాం.'అని తెలిపాడు.

 రొటేషన్ పాలసీ..

రొటేషన్ పాలసీ..

తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన అండర్సన్, జోస్​ బట్లర్​ లాంటి ఆటగాళ్లను రొటేషన్​ పాలసీపై పక్కకు పెట్టడం జట్టుకు చేటు చేసిందని ఇంగ్లాండ్​ మాజీలు విమర్శించారు. దీనిపై ఇంగ్లీష్ జట్టు​ సారథి స్పందించాడు. ఓటమికి ఆ విధానం కారణం కాదని తెలిపాడు. ఇక్కడ గెలుపొందడానికి కావాల్సిన ఆటగాళ్లు తమ జట్టులో ఉన్నారని రూట్​ పేర్కొన్నాడు. 'జట్టులో ఉన్న ఆటగాళ్లను సరిగా ఉపయోగించుకోవడం నా బాధ్యత. అందుకు నా శక్తి మేరకు నేను పని చేస్తున్నాను. కొంతమంది అద్భుతమైన ఆటగాళ్లు మా టీమ్​లో ఉన్నారు. ఇక్కడ గెలవడానికి కావాల్సిన సత్తా వారిలో ఉంది.'అని ఇంగ్లండ్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.

 చాలెంజింగ్ వికెట్..

చాలెంజింగ్ వికెట్..

పిచ్, టాస్ గురించి మాట్లాడుతూ.. ఇది చాలెంజింగ్ వికెటని, టాస్ ముఖ్యమే అయినా.. గెలుస్తామనే గ్యారంటీ అయితే లేదన్నాడు. 'స్పిన్ పిచ్ అనేకంటే.. నేనైతే చాలెంజింగ్ వికెట్ అని అంటాను. ఇక టాస్ కీలకమే కానీ గెలుస్తామనే గ్యారంటీ అయితే లేదు. వాస్తవానికి ఈ వికెట్‌పై పరుగులు చేయవచ్చని భారత్ చూపించింది. ఈ విషయంలో వారి నుంచి మేం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓటమికి అనేక సాకులు చెప్పవచ్చు. కానీ ఈ మ్యాచ్‌లో మేం సమష్టిగా విఫలమయ్యామనేది వాస్తవం. నా వరకైతే టాస్ ముఖ్యమే కానీ.. అదే గెలుపు నిర్ణయించలేదు. కాకపోతే మేం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే పరిస్థితి వేరేలా ఉండేది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మేం దారుణంగా విఫలమయ్యాం. పిచ్ ఏ మాత్రం మా ఓటమికి కారణం కాదు.'అని జోరూట్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, February 16, 2021, 18:41 [IST]
Other articles published on Feb 16, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+