
సిక్సర్‌తో రూట్ డబుల్
కెప్టెన్ జో రూట్, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ చెలరేగడంతో ఇంగ్లండ్ 450 పరుగుల మార్క్ అందుకుంది. షాబాజ్ నదీమ్ బౌలింగ్‌లో స్టోక్స్ (82; 117 బంతుల్లో 10x4, 3x6) ఔటయ్యాక.. రూట్, పోప్ నిలకడగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే రెండో సెషన్‌లో డ్రింక్స్ విరామ సమయానికి ఇంగ్లండ్ 143 ఓవర్లకు 440/4 స్కోర్‌తో నిలిచింది. రూట్ వికెట్ తీయడానికి భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు రూట్‌కు అండగా పోప్ నిలకడగా ఆడుతున్నాడు. రూట్ (206), పోప్ (22) పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లండ్ 450 పరుగులు చేసింది.

స్టోక్స్ హాఫ్ సెంచరీ
263/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో శనివారం రెండో రోజు ఆట ప్రారంభించిన జో రూట్, బెన్ స్టోక్స్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ జోడి భారత బౌలర్లను ఈజీగా ఎదుర్కొన్నారు. పెద్దగా ప్రభావం లేని పిచ్‌పై.. రూట్, స్టోక్స్‌లు పరుగుల ప్రవాహం సృష్టించారు. బౌండరీల వర్షం కురిపించారు. స్టోక్స్ సిక్సులు కూడా బాదాడు. అయితే స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌లను మనోళ్లు రెండుసార్లు వదిలేశారు. దీంతో అతడు హాఫ్ సెంచరీ బాదాడు. మరోవైపు రూట్ తన శైలిలో ఆడుతూ 150 పరుగుల మార్క్ అందుకున్నాడు. తొలి సెషన్‌లో ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయించింది. భోజన విరామ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 355 రన్స్ చేసింది.

నాలుగవ వికెట్‌కు 124 రన్స్
రెండో సెషన్‌లో కూడా రూట్, స్టోక్స్ ధాటిగా ఆడారు. దీంతో ఇంగ్లండ్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే 82 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టోక్స్ స్పిన్నర్ నదీమ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. స్వీప్ షాట్‌కు ప్రయత్నించిన స్టోక్స్.. డీప్ లెగ్‌లో ఉన్న చేటేశ్వర్ పుజారాకు క్యాచ్ ఇచ్చాడు. దాదాపు క్యాచ్‌ను వదిలేసినంత పని చేసిన పుజారా.. చివర్లో ఆ క్యాచ్‌ను అందుకుని స్టోక్స్‌ను పెవిలియన్‌కు పంపించాడు. స్టోక్స్, రూట్‌లు నాలుగవ వికెట్‌కు 124 రన్స్ జోడించారు. అనంతరం రూట్‌కు పోప్ జతకలిశాడు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 400 దాటింది. ఆపై రూట్ డబుల్ సెంచరీ చేశాడు.
India vs England: కుక్‌లాగా రూట్ రాణిస్తే.. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ గెలుస్తుంది! బెల్ జోస్యం!


Click it and Unblock the Notifications
