
రూట్ నిరూపించుకున్నాడు:
చెన్నై చెపాక్ మైదానంలో జో రూట్ వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. 'తన వందో టెస్టులో సెంచరీ చేసిన రూట్.. తానో గొప్ప ఆటగాడినని రుజువు చేసుకున్నాడు. గతేడాది రూట్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో.. విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ లాంటి అత్యుత్తమ ఆటగాళ్ల సరసన అతను చేరగలడా? అని కొంతమంది సందేహించారు. గతేడాది రూట్ 40కి పైగా సగటు నమోదు చేశాడని మర్చిపోవద్దు. కరోనా విరామంలో తనను తాను ప్రశ్నించుకున్న రూట్.. తిరిగి మునుపటిలా మారాడు. తన ఆటను విశ్లేషించుకున్నాడు. ఇప్పుడు వరుసగా మూడు టెస్టుల్లో శతకాలు చేయడమే అందుకు నిదర్శనం' అని నాసర్ హుస్సేన్ అన్నాడు.

ఆటను మెరుగుపర్చుకున్నాడు:
నాసర్ హుస్సేన్ వ్యాఖ్యలతో ఇంగ్లీష్ మాజీ బ్యాట్స్‌మన్ ఇయాన్ బెల్ ఏకీభవించాడు. 'నలుగురు అత్యుత్తమ ఆటగాళ్లు (కోహ్లీ, స్మిత్, విలియమ్సన్, రూట్) అని మనం మాట్లాడుతున్నాం. వీళ్లలో రూట్ మినహా మిగతా ముగ్గురు అత్యుత్తమ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. కానీ రూట్ గత సంవత్సరం ఒక్క సెంచరీ కూడా చేయలేదు. కరోనా వైరస్ విరామంలో తన ఆటను మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారించాడు. ఎంతో కష్టపడ్డాడు. ఇప్పుడా ఆ ఫలితాలు వస్తున్నాయి. ఈ ఏడాది అతనికి అత్యుత్తమంగా ఉండనుంది. ఇప్పటికే పరుగుల ప్రవాహం పారిస్తున్నాడు' అని బెల్ పేర్కొన్నాడు.

కుక్‌లాగా రూట్ రాణిస్తే:
'భారత్‌లో పర్యటన, ఆస్ట్రేలియాలో యాషెస్ అంటే అవి చాలా ప్రతిష్ఠాత్మకమైన సిరీస్‌లు. ఆటగాళ్ల కెరీర్‌ను అవి నిర్దేశిస్తాయి. ఈ ఏడాది కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా జో రూట్‌కు మంచి ఆరంభం దక్కింది. 2012లో మాజీ సారథి అలిస్టర్ కుక్ రాణించినట్లుగా.. ఈ సిరీస్‌లో రూట్ ఉత్తమంగా ఆడితే ఇంగ్లండ్ మరోసారి భారత్‌లో సిరీస్ గెలిచే వీలుంది' అని ఇయాన్ బెల్ చెప్పుకొచ్చాడు. 2012-13 భారత పర్యటనలో కుక్ 562 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు బాదాడు. ఇంగ్లండ్ 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. అప్పటి జట్టులో ఇయాన్ బెల్ కూడా ఉన్నాడు.

మూడు టెస్టుల్లో 150+ స్కోర్లు:
శ్రీలంకతో ఆడిన 98, 99 టెస్టుల్లోనూ జో రూట్ 150+ స్కోర్లు సాధించాడు. ఆ పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 228, 186 పరుగులు సాధించాడు. అదే జోరుతో ఇప్పుడు భారత పర్యటనలో హ్యాట్రిక్ శతకంతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 177 పరుగులు చేసిన రూట్.. ద్విశతకం దిశగా దూసుకెళుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ జట్టు 400 స్కోర్ చేరుకుంది. నదీమ్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్(82; 117 బంతుల్లో 10x4, 3x6) ఔటయ్యాక.. రూట్ (175), పోప్ (5) నిలకడగా ఆడుతున్నారు.
India vs England: రూట్ 156, స్టోక్స్ 63.. భారీ స్కోర్ దిశగా ఇంగ్లండ్!!


Click it and Unblock the Notifications












