
వ్యక్తిగత కారణాతో
జస్ప్రీత్ బుమ్రాను టీమ్ నుంచి రిలీజ్ చేసినట్లు బీసీసీఐ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. వ్యక్తిగత కారణాల కారణంగా తనను టీమ్ నుంచి రిలీజ్ చేయాల్సిందిగా బుమ్రానే కోరాడని, అందుకే అతన్ని నాలుగో టెస్ట్ ఎంపికకు పరిగణలోకి తీసుకోవడం లేదని బోర్డు ట్వీట్ చేసింది. అతని స్థానంలో జట్టులోకి మరెవరినీ తీసుకోవడం లేదని కూడా పేర్కొంది. మొదటి టెస్ట్ ఆడిన బుమ్రా.. రెండో టెస్టు ఆడలేదు. మూడో టెస్ట్ మొత్తం స్పిన్నర్లదే హవా ఉండటంతో బుమ్రా తుది జట్టులో ఉన్నా అతని ప్రభావం ఏమాత్రం కనిపించలేదు.

ఆందోళన కలిగించే అంశం
నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా ఇప్పటికే 2-1తో సిరీస్‌లో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో జరిగిన మూడో టెస్టు విజయంతో ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఆఖరి టెస్టులో విజయం సాధించినా లేదంటే డ్రా చేసుకున్నా కోహ్లీసేన ఫైనల్‌లో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరం కావడం కాస్త ఆందోళన కలిగించే అంశం.

ఇటీవల భారత్‌లో తొలి టెస్ట్
2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన జస్‌ప్రీత్ బుమ్రా.. ఇటీవల భారత్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ (చెన్నైలో జరిగిన తొలి టెస్టుతో) ఆడాడు. అప్పటివరకు బుమ్రా భారత్ తరపున 17 టెస్టులకు ప్రాతినిధ్యం వహించగా.. అవన్నీ విదేశాల్లోనే ఆడడం విశేషం. భారత్‌లో తొలి టెస్టు ఆడడానికి బుమ్రాకు మూడేళ్లు పట్టింది. సొంతగడ్డపై అరంగేట్రం చేసే ముందు విదేశాల్లో అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్‌గా బుమ్రా నిలిచాడు. బుమ్రా కంటే ముందు వెస్టిండీస్ ప్లేయర్ డారెన్ గంగా కూడా స్వదేశం బయట 17 టెస్టులు ఆడాడు.

నాలుగో టెస్టుకు అందుబాటులో ఉన్న ఆటగాళ్లు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్.
India vs England: మొతేరా తరహా పిచ్‌లపై విజయవంతమవ్వడం ఎలాగో చెప్పిన అజహరుద్దీన్!!


Click it and Unblock the Notifications












