India vs England: దెబ్బతీసిన అండర్సన్.. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్.. ఓటమి దిశగా భారత్!

చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లో భారత్ బ్యాక్ టు బ్యాక్ వికెట్లు కోల్పోయింది. సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఒకే ఓవర్‌లో శుభ్‌మన్ గిల్(50), అజింక్యా రహానే(0) పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీశాడు. ముందుగా మంచి ఇన్‌స్వింగర్‌తో శుభ్‌మన్ గిల్ ఆఫ్‌స్టంప్‌ను ఎగరగొట్టిన అండర్సన్.. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన రహానేను వికెట్ల ముందు బోల్తా కొట్టించే ప్రయత్నం చేశాడు. కానీ అంపైర్లు నాటౌట్ ఇవ్వడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు రివ్యూకు వెళ్లారు. అయితే బాల్ ట్రాకర్‌లో బంతి ఆఫ్ స్టంప్‌ను హిట్ చేయడంతో అంపైర్స్ కాల్‌తో రహానే బతికిపోయాడు. కానీ అండర్సన్ మరుసటి బంతికే రహానేను బౌల్డ్ చేశాడు.

వరుసగా వికెట్లు...
శుభ్‌మన్ తరహాలోనే ఇన్ స్వింగర్‌తో ఆఫ్ స్టంప్ వికెట్‌ను ఎగరగొట్టాడు. ఈ ఇద్దరికి బ్యాట్, ప్యాడ్ మధ్యలో ఉన్న గ్యాప్‌లో నుంచి బంతి వెళ్లి వికెట్‌ను హిట్ చేయడం గమనార్హం. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్(11) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. అండర్సన్ బౌలింగ్‌లోనే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే సుందర్(0) కూడా డామ్ బెస్ బౌలింగ్‌లో ఔటవ్వడంతో భారత్దాంతో భారత్ 117 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులోకి అశ్విన్ రాగా.. డ్రా కోసం విరాట్ కోహ్లీ పోరాడుతున్నాడు. వరుసగా వికెట్లు కోల్పవోడంతో భారత్ ఓటమి దిశగా సాగుతోంది.

సిడ్నీ పోరాటం..
ఇక ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ గట్టెక్కాలంటే క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ, అశ్విన్ క్రీజులో నిలదొక్కుకోవాల్సిందే. సిడ్నీ టెస్ట్ తరహా పోరాటాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుత పిచ్ దృష్ట్యా ఇది జరగడం అసంభవం. పూర్తి బౌలింగ్‌కు అనుకూలంగా మారిన పిచ్‌పై ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగుతున్నారు.
అశ్విన్‌తో పాటు విరాట్ రాణిస్తేనే భారత్ ఓటమి తప్పించుకోవచ్చు. విరాట్ కోహ్లీ, అశ్విన్ ఓ భారీ ఇన్నింగ్స్ ఆడితేనే భారత్ ఓటమి తప్పించుకో గలదు.

శుభ్‌మన్ హాఫ్ సెంచరీ..
39/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో మంగళవారం ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్.. ఆదిలోనే నయావాల్ చతేశ్వర్ పుజారా(38 బంతుల్లో 15) వికెట్‌ను చేజార్చుకుంది. జాక్ లీచ్ వేసిన షార్ప్ బౌన్స్ పుజారా బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సెకండ్ స్లిప్‌లో ఉన్న బెన్ స్టోక్స్ చేతిలో పడింది. క్రీజులోకి కెప్టెన్ విరాట్ కోహ్లీ రాగా.. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ధాటిగా ఆడాడు. ప్రారంభం నుంచే ఇంగ్లండ్‌పై బౌలర్లపై బౌండరీలతోనే విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో లీచ్ బౌలింగ్ క్విక్ సింగిల్‌తో 81 బంతుల్లో శుభమన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికిది మూడో హాఫ్ సెంచరీ.

నిరాశపరిచిన రోహిత్..
సోమవారం 420 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 39 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (12) మళ్లీ నిరాశపరిచాడు. ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (32 బంతుల్లో 40; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, రవిచంద్రన్ అశ్విన్ (6/61) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అంతకుముందు భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకు ఆలౌటైంది. సోమవారం మరో 80 పరుగులు జోడించిన టీమిండియా చివరి 4 వికెట్లు కోల్పోయింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 241 పరుగుల ఆధిక్యం లభించింది. వాషింగ్టన్ సుందర్ (138 బంతుల్లో 85 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి చక్కటి ప్రదర్శన కనబర్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications