For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు లేనట్లేనా? మళ్లీ జిగ్రి దోస్తులయ్యారా?

India vs England: Is there no rift between Rohit Sharma and Virat Kohli?

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మ.. టీమిండియాకు రెండు కళ్లు. ప్రతిభాపాటవాల్లో, జట్టును నడిపించడంలో ఎవరికి వారే సాటి. అంతర్జాతీయ వేదికపై భారత జట్టు అఖండ విజయాలు అందుకోవాలన్నా.. ఐసీసీ ట్రోఫీల్ని ముద్దాడాలన్నా వీరిద్దరూ సమన్వయంతో పనిచేయడం అత్యంత అవసరం. ఒకరికొకరు సహకరించుకోవడం మరెంతో కీలకం. కానీ.. తరుచూ వీరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయన్న వార్తలు అభిమానులను కలవరపాటుకు గురిచేశాయి. జట్టు భవితవ్యాన్ని ఆందోళనకరంగా మార్చేసాయి. అయితే తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో రోహిత్, విరాట్ మధ్య ఉన్న విభేదాలకు తెరపడిందా? ఈ ఇద్దరు మళ్లీ జిగ్రి దోస్తులయ్యారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

ఇద్దరు కలిసి..

ఇద్దరు కలిసి..

ముఖ్యంగా ఆఖరి టీ20లో వీరి మధ్య ఉన్న సమన్వయం ఆకట్టుకుంది. ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మ స్వేచ్చగా ఆడేలా అండగా నిలబడటం, ఫీల్డింగ్ సమయంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఇద్దరు మ్యాచ్ పరిస్థితులపై పదే పదే చర్చించుకోవడం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా విజయానంతరం వీరిద్దరు ఒకరినొకరు కౌగిలించుకోవడం చూస్తే వీరి మధ్య ఎలాంటి విభేధాల్లేవని విషయం స్పష్టమైంది. దాంతో భారత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆఖరి టీ20లో రోహిత్-విరాట్‌కు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

ప్రపంచకప్ సమయంలో..

ప్రపంచకప్ సమయంలో..

వన్డే ప్రపంచకప్ తుది జట్టు విషయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి విభేధాలు తలెత్తాయని మొదటిసారి ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలకు బలం చేకూర్చేలా కోహ్లీ, అనుష్క ఇన్‌స్టా ఖాతాలను రోహిత్‌ అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశమైంది. అలాగే అనుష్క శర్మ కూడా రోహిత్‌తో పాటు అతని సతీమణి రితికాను అన్ ఫోలో చేయడం వీరి మధ్య విభేదాలు నిజమే అనుకునేలా చేశాయి. ఇక మ్యాచులు ఆడేటప్పుడు అనుష్క ఆ చివరన కూర్చొంటే రితిక ఈ చివరన కూర్చొని వీక్షించిన ఫొటోలు బయటకు వచ్చాయి.

ఆసీస్ టూర్ సందర్భంగా

ఆసీస్ టూర్ సందర్భంగా

ఇక ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్‌ను ఎంపిక చేయకపోవడం వల్ల మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. నిజానికి హిట్‌మ్యాన్‌ ఫిట్‌గా లేడనే అతనికి విశ్రాంతినిచ్చామని సెలక్టర్లు చెప్పారు. కానీ జట్టును ఎంపిక చేసినరోజే అతడు ప్యాడ్లు కట్టుకొని నెట్స్‌లో సిక్సర్లు బాదేస్తున్న వీడియోను ముంబై ఇండియన్స్ ట్విటర్లో పోస్ట్‌ చేయడం అనుమానాలకు తావిచ్చింది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా టాస్‌కు వచ్చినప్పుడు రోహిత్‌, కోహ్లీ కనీసం ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకోలేదు. ఎడమొహం పెడమొహంగా కనిపించిన వీడియో వైరల్‌గా మారింది. ఇవన్నీ వీరి మధ్య విభేదాల వార్తలకు బలం చేకూర్చింది. అంతేకాకుండా ఈ ప్రచారంపై వీరు మౌనంగా ఉండటం కూడా నమ్మేలా చేసింది.

రోహిత్‌ను కెప్టెన్ చేయాలని..

రోహిత్‌ను కెప్టెన్ చేయాలని..

పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రోహిత్‌ను, సుదీర్ఘ ఫార్మాట్‌కు కోహ్లీని సారథులుగా నియమించాలన్న డిమాండ్లు‌ ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ప్రారంభమైన ప్రతీసారి, ముంబై ఇండియన్స్ విజయాన్ని అందుకున్నప్పుడల్లా ఈ డిమాండ్ తెరపైకి వస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఈ స్టార్ ఆటగాళ్ల అభిమానులు రెండుగా విడిపోవడం కూడా వీరి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలకు ఆజ్యం పోసింది. అభిమానులకు తోడు గౌతం గంభీర్ వంటి మాజీ క్రికెటర్లు కూడా కోహ్లీని తప్పుబడుతూ రోహిత్ శర్మను కొనియాడటం, కెప్టెన్సీ ఇవ్వమనడం కూడా విభేదాల వార్తలకు బలం చేకూర్చాయి. ఏది ఏమైనా ఇప్పుడు రోహిత్-కోహ్లీ కలిసిపోవడం.. అది కీలక టీ20 ప్రపంచకప్ ముందు కావడం అభిమానులకు సంతోషాన్నిస్తుంది.

Story first published: Sunday, March 21, 2021, 19:34 [IST]
Other articles published on Mar 21, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+