ధోనీ రిటైర్మెంట్‌తోనే కుల్దీప్ యాదవ్ పతనం మొదలైందా?

హైదరాబాద్: టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒకప్పుడు మంచి వికెట్ టేకర్. అతని బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడేందుకు ప్రత్యర్థులు ఒకటికి రెండు సార్లు ఆలోచించేవారు. మణికట్టు మాంత్రికుడిగా, చైనామెన్ యాక్షన్‌తో వైవిధ్యమైన బంతులతో భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు. క్లిష్ట స్థితుల్లో కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ వికెట్లు పడగొట్టేవాడు.
కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అతని కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. కుల్దీప్ బౌలింగ్‌కు వస్తే ప్రత్యర్థులు పండుగ చేసుకుంటున్నారు. భారీ షాట్లతో ఈ చైనామెన్ బౌలర్‌పై విరుచుకుపడుతున్నారు. దాంతో కుల్దీప్ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి పదే పదే తప్పిదాలు చేస్తున్నాడు. ఇంగ్లండ్‌తో తాజాగా జరుగుతున్న వన్డే సిరీస్‌లో కుల్దీప్ దారుణంగా విఫలమయ్యాడు.

ధోనీ రిటైర్మెంట్..
తొలి వన్డేలో 9 ఓవర్లు వేసి 68 పరుగులిచ్చిన కుల్దీప్.. సెకండ్ మ్యాచ్‌లో ఏకంగా 84 రన్స్ ఇచ్చుకున్నాడు. భారత్ తరఫున వన్డేల్లో రెండు సార్లు హ్యాట్రిక్ తీసిన కుల్దీప్.. ఈ సిరీస్‌లో కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే కుల్దీప్ పతనానికి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే కారణమా? అతని రిటైర్మెంట్‌తోనే చైనామన్ బౌలర్ పతనం మొదలైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2017లో అంతర్జాతీయ క్రికెట్ షురూ చేసిన కుల్దీప్.. ధోనీ సహచర్యంలోని 31 మ్యాచ్‌ల్లో 67 వికెట్లు తీసి అదరగొట్టాడు. కానీ ధోనీ జట్టుకు దూరమైన తర్వాత కుల్దీప్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది.

ధోనీ సూచనలతో..
ధోనీ గైడెన్స్‌లో అతను చెప్పినట్లుగా బౌలింగ్ చేసి కుల్దీప్ వికెట్లు సాధించేవాడు. మహీ వికెట్ల వెనుకాల ఉండటమే కాకుండా క్రీజులోని బ్యాట్స్‌మన్‌ను బాగా రీడ్ చేసేవాడు. వారి ఫుట్‌వర్క్‌ను గమనిస్తూ దానికి తగ్గ బంతులను వేయాలని కుల్దీప్, చాహల్‌లకు చెప్పేవారు. అతను చెప్పినట్లే ఈ ఇద్దరూ బౌలింగ్ చేసి వికెట్లు తీసేవారు. ఒకవేళ తాను చెప్పినట్టుగా బౌలింగ్ వేయకపోతే బౌలర్లపై అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. దాంతో బౌలర్ తప్పులను గుర్తించి సరిదిద్దుకునేవారు. ఈ విషయాన్ని కుల్దీప్, చాహల్ ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. మహీ చెప్పిన సలహాలతో వికెట్లు పడగొట్టేవాళ్లమని పేర్కొన్నారు.

పంత్, రాహుల్..
మహీతో పోలిస్తే రిషభ్ పంత్‌కు అంత అనుభవం లేదు. బ్యాట్స్‌మన్ కదలికలను, గేమ్ అంత బాగా రీడ్ చేయలేడు. అంతేకాకుండా రెండో వన్డేలో వేగంగా బౌలింగ్ వేస్తే వికెట్ దక్కుతుందని తప్పుగా సలహా ఇచ్చాడు. దాంతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయారు. రిషభ్ పంత్ గైర్హాజరీలో కీపింగ్ చేసే కేఎల్ రాహుల్ కూడా బౌలర్లకు ఎలాంటి సలహాలు ఇవ్వలేడు. కేవలం కీపింగ్ మాత్రమే చేస్తాడు. ఇది కుల్దీప్‌తో పాటు చాహల్ బౌలింగ్‌ను ప్రభావితం చేసింది. బౌలింగ్ వేగం పెంచడం కూడా కుల్దీప్ యాదవ్ వైఫల్యానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరో అజంతా మెండీస్..
ఐపీఎల్‌లో అవకాశాలు దక్కకపోవడం, టీమిండియాకు ఎంపికైనా బెంచ్‌కే పరిమితమవ్వడం కూడా కుల్దీప్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సత్తా ఉన్న ఆటగాడికి అవకాశం ఇవ్వకపోతే మెరుగ్గా రాణించాలనే కసితో ఆడుతాడు. కానీ ఎంపిక చేసి తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడం అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే అవుతుంది.
ఇక సూపర్భ్ బౌలింగ్‌తో కెరీర్‌ను ప్రారంభించిన శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండీస్, ఆ తర్వాత ఆ రేంజ్ పెర్ఫామెన్స్ ఇవ్వలేక కెరీర్‌ను ముగించాడు. ఇప్పుడు కుల్దీప్ యాదవ్ కూడా అలాంటి ప్రమాదంలోనే ఉన్నాడు. మెండీస్, కుల్దీప్ తొలి 20 టీ20 మ్యాచ్‌ల్లో 39 వికెట్లు తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications