న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: ఆ ఒక్క ఇన్నింగ్సే అతడి కెరీర్‌ను మార్చేసింది.. ఏకంగా టీమిండియాలో చోటు!!

India vs England: IPL 2020 single innings changed Rahul Tewatias career
Ind Vs Eng 2021: Rahul Tewatia In T20 Series Squad Agaist England,Single Innings Changed His Career

కోల్‌కతా: లెగ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్ రాహుల్‌ తెవాటియా యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 2020లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. 31 బంతుల్లో 7 సిక్సర్లతో 53 పరుగులు చేసి రాజస్థాన్‌కు ఊహించని విజయాన్ని అందించాడు. ఆ ఒక్క ఇన్నింగ్సే అతడి కెరీర్‌ను మార్చేసింది. ఏకంగా టీమిండియాలో చోటు దక్కేలా చేసింది. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు శనివారం ప్రకటించిన భారత జట్టులో తెవాటియాకు చోటు దక్కిన సంగతి తెలిసిందే. అయితే భారత మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చహల్‌ ఫోన్‌ చేసి చెబితే జోక్‌ చేస్తున్నాడని అనుకున్నానని తెవాటియా తెలిపాడు.

అస్సలు ఊహించలేదు

అస్సలు ఊహించలేదు

'నేను భారత జట్టుకు ఎంపికయ్యానని యుజువేంద్ర చహల్‌ భాయ్‌ ఫోన్‌చేసి చెబితే జోక్‌ చేస్తున్నాడేమో అనుకున్నా. ఆ తర్వాత మోహిత్‌ శర్మ కూడా నా వద్దకొచ్చి అదే విషయం చెప్పాడు. ఎంతో సంతోషమేసింది. అయితే ఇంత త్వరగా భారత్‌ జట్టుకు ఎంపికౌతానని మాత్రం అస్సలు ఊహించలేదు. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా. హరియాణా నుంచి ఇప్పటికే ముగ్గురు స్పిన్నర్లు చహల్‌, అమిత్‌ మిశ్రా, జయంత్‌ యాదవ్‌ టీమిండియాకు ఆడారు. నాకు అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా' అని రాహుల్‌ తెవాటియా తెలిపాడు.

ఐపీఎల్‌ ద్వారా ప్రజలు గుర్తుపడుతున్నారు

ఐపీఎల్‌ ద్వారా ప్రజలు గుర్తుపడుతున్నారు

'ఐపీఎల్‌ 2020 ద్వారా ప్రజలు నన్ను గుర్తుపడుతున్నారు. ఇలాగే మంచి ప్రదర్శన చేస్తే భారత జట్టుకు ఎంపికౌతానని అనుకున్నా. కానీ ఇంత త్వరగా అని మాత్రం అనుకోలేదు. విరాట్ కోహ్లీతో ఆడడానికి ఎదురుచూస్తున్నా' అని రాహుల్‌ తెవాటియా చెప్పాడు. ఐపీఎల్‌ 2020లో పంజాబ్‌తో తలపడిన ఓ లీగ్‌ మ్యాచ్‌లో రాహుల్‌ (53; 31 బంతుల్లో 7x6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఓటమివైపు వెళుతున్న రాజస్థాన్‌ను తన సిక్సులతో గెలిపించాడు. విండీస్ పేసర్ షెల్డన్ కాట్రెల్‌ వేసిన 18వ ఓవర్‌లో ఐదు సిక్సులు బాది అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో తన పేరును ప్రపంచానికి తెలిసేలా చేశాడు.

39 బంతుల్లో 73 పరుగులు

39 బంతుల్లో 73 పరుగులు

టీమిండియాకు ఎంపికయిన మరునాడే దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హరియానా తరఫున ఆడుతున్న రాహుల్ తెవాటియా.. చండీగఢ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. 39 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. తెవాటియా రాణించినా హరియానాకు ఓటమి తప్పలేదు. హిమన్షు రాణా సెంచరీతో రాణించడంతో హరియానా 50 ఓవర్లలో 9 వికెట్లకు 299 పరుగులు చేసింది. అనంతరం చండీగఢ్ 49.3 ఓవర్లలో 7 వికెట్లకు 300 రన్స్ చేసి మూడు వికెట్లతో గెలుపొందింది. కెప్టెన్ మనన్ వోహ్రా (117) సెంచరీకి తోడు అంకిత్ కౌశిక్ (73 నాటౌట్) రాణించడంతో చండీగఢ్ విజయం సులువైంది.

సూర్యకుమార్‌ ఆనందం

సూర్యకుమార్‌ ఆనందం

ముంబై బ్యాట్స్‌మన్ సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ కూడా టీ20 జట్టుకు ఎంపికయిన విషయం తెలిసిందే. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారత జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్న ‌సూర్యకుమార్‌ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'నమ్మశక్యంగా లేదు. ఆనందంగా ఉన్నా' అని సూర్యకుమార్‌ ఆదివారం ట్వీట్‌ చేశాడు.

India vs England: అశ్విన్.. ఇక ఆశలు వదిలేయ్! జట్టులో చోటు కష్టమే: గవాస్కర్

Story first published: Monday, February 22, 2021, 15:04 [IST]
Other articles published on Feb 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X