
కోహ్లీ కెప్టెన్సీ అద్భుతం
ఇంజమామ్ ఉల్ హక్ తన తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'టీమిండియా ఆట తీరు సూపర్. ముఖ్యంగా విదేశాల్లో కోహ్లీసేన చేస్తున్న ప్రదర్శనను ప్రశంసించాలి. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌటైనా.. తర్వాత నాలుగు రోజులు ఆడిన ఘనత టీమిండియాకే దక్కుతుంది. ఒక దశలో అండర్ డాగ్స్ అయిన జట్టు.. ఆ తర్వాత విజయం సాధించినప్పుడు అందులో కెప్టెన్ కీలకంగా ఉంటాడు' అని అన్నాడు. ఇంజీ భారత్ తరఫున 120 టెస్టులు, 378 వన్డేలు, ఇక టీ20 మ్యాచ్ ఆడాడు.

ఎక్కడా నిరుత్సాహపడలేదు
'విరాట్ కోహ్లీ తన జట్టుని అద్భుతంగా నడిపించాడు. ప్రస్తుతం జట్టులో యువ క్రికెటర్లు, అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నారు. వీరిని సమస్వయం చేసుకుంటూ చక్కగా ముందుకెళ్లాడు. నాలుగో టెస్టులో కోహ్లీ ఎక్కడా నిరుత్సాహపడలేదు. 191 పరుగులకే జట్టు ఆలౌటైనా కూడా. విరాట్ బాడీ లాంగ్వేజ్ జట్టులో ప్రతిబింబించింది' అని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ పేర్కొన్నాడు.
ఓపెనర్లు రోరీ బర్న్స్ మరియు హసీబ్ హమీద్ 100 పరుగుల ఓపెనింగ్ పార్టనర్‌షిప్ ఇచినప్పటికీ.. ఐదవ రోజున ఇంగ్లండ్‌ని కేవలం 210 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. లంచ్ తర్వాత పోప్ మరియు బెయిర్‌స్టోలను బుమ్రా అవుట్ చేశాడు. ఆపై ఠాకూర్ ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ వికెట్‌ను పడగొట్టి భారత్ విజయం ఖాయం చేశాడు.

కోహ్లీ సంబరాలు
ఓవల్ టెస్టులో ఇంగ్లండ్‌పై విజయం సాధించిన తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసుకున్న సంబరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఆ మ్యాచ్‌లో ఏకంగా 157 పరుగుల తేడాతో విజయం సాధించడం, అది కూడా 50 ఏళ్ల తర్వాత ఓవల్ గడ్డపై మ్యాచ్ గెలవడం ఈ సంతోషాన్ని రెట్టింపు చేసింది.
అయితే గతంలోనూ కోహ్లీ ఇలాగే సెలబ్రేషన్స్ చేసుకున్నప్పటికీ.. ఈసారి ఇంగ్లండ్ జట్టు ఫ్యాన్ బార్మీ ఆర్మీని టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఫాక్స్ స్పోర్ట్స్ కోహ్లీ సంబరాన్ని క్లాస్‌లెస్ అని వర్ణించింది. అయితే ఎల్లపుడూ దూషించుకునే టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఈ విషయంలో మాత్రం ఒకే తరహాలో స్పందించడం విశేషం.

కెప్టెన్ ధైర్యవంతుడు
విరాట్ సెలబ్రేషన్స్‌పై స్పందించిన వసీం జాఫర్.. 'కెప్టెన్ ధైర్యవంతుడు. చేజారుతుందనుకున్న మ్యాచ్‌కు జీవం పోసి చారిత్రాత్మక విజయం సాధించిన విరాట్ జట్టును ప్రపంచమంతా కొనియాడుతోంది. నీకైతే ఇది ఫిక్స్ అయిపోయింది' అంటూ ఫాక్స్ క్రికెట్ కామెంట్‌కు కౌంటర్ ఇచ్చాడు.
ఇక మైకేల్ వాన్ ఫాక్స్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. 'కోహ్లీ గొప్ప నాయకుడు. ట్రంపెట్ వాయిస్తున్నట్లుగా సంజ్ఞలు చేయడం ద్వారా బార్మీ ఆర్మీని సరదాగా టీజ్ చేశాడంతే. నాకు తన ఆటిట్యూట్ చాలా నచ్చింది. ఎనర్జీకి మారు పేరుగా ఉంటాడు. మాస్టర్‌క్లాస్ టెక్నిక్, ప్రణాళికాబద్దమైన వ్యూహాలతో మ్యాచ్‌ను గెలుచుకున్నాడు' అని ప్రశంసల వర్షం కురిపించాడు.


Click it and Unblock the Notifications

బట్లర్, లీచ్ రీఎంట్రీ.. ఆ ఇద్దరు స్టార్ ఆటగాళ్లపై వేటు! ఐదో టెస్టులో బరిలోకి దిగే ఇంగ్లండ్ జట్టు ఇదే!!










