
మలన్‌పై భారీ అంచనాలే
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రోరీ బర్న్స్, హసీబ్ హమీద్ విఫలమయినా.. రెండో ఇన్నింగ్స్‌లో రాణించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. అంతకుముందు మూడో టెస్టులో కూడా మంచి ఆరంభం ఇచ్చారు. దాంతో ఐదో టెస్టులో కూడా మంచి ప్రదర్శన చేయాలని ఇంగ్లండ్ ఆశిస్తోంది. మూడో టెస్టుతో జట్టులోకి వచ్చిన టీ20 హిట్టర్ డేవిడ్ మలన్ హాఫ్ సెంచరీ బాదాడు.
అయితే నాలుగో టెస్టులో 31, 5 పరుగులతో తేలిపోయాడు. అయినా కూడా మలన్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక సిరీస్ ఆసాంతం రాణిస్తున్న కెప్టెన్ జో రూట్ జట్టును ఆదుకునేందుకు మరోసారి సిద్ధంగానే ఉన్నాడు. ఇప్పటికే ఈ సిరీసులో రూట్ మూడు శతకాలు బాదిన విషయం తెలిసందే. నాలుగో టెస్టులో (21, 36) అంచనాలు అందుకొని రూట్‌ను శతకం చేయాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది. ఓలీ పోప్ అంచనాలు అందుకున్నాడు.

బెయిర్‌స్టో డౌటే
మిడిల్ ఆర్డర్‌లో జానీ బెయిర్‌స్టో ఫామ్ ఇంగ్లండ్ జట్టును కలవరపెడుతోంది. వ్యక్తిగత కారణాల చేత ఓవల్ టెస్ట్‌కు దూరమైన వికెట్ కీపర్ జోస్ బట్లర్ స్థానంలో కీపింగ్ చేసిన జానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక బట్లర్ ఐదో టెస్టుకు అందుబాటులోకి రావడంతో బెయిర్‌స్టోపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. ఆఫ్ స్పిన్నర్ జాక్ లీచ్ తిరిగి జట్టులోకి రావడంతో వరుసగా విఫలమవుతున్న మొయిన్ అలీకి చోటు కష్టంగానే మారింది.
అలీ స్థానంలో లీచ్ ఆడనున్నాడు. మొత్తానికి ఐదో టెస్ట్ కోసం ఇద్దరు స్టార్ ఆటగాళ్లపై వేటు పడే అవకాశం ఉంది. మరోవైపు ఒక మ్యాచ్ కూడా ఆడని సామ్ బిల్లింగ్స్‌ను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తుది జట్టు నుంచి తప్పించింది. చివరి టెస్ట్ కోసం 16 మంది సభ్యులతో కూడిన ఇంగ్లండ్ జట్టును ఈసీబీ మంగళవారం ప్రకటించింది.
T20 World Cup: ఓపెనర్‌గా కోహ్లీ.. ధావన్, శ్రేయస్‌కు షాక్! సునీల్ గవాస్కర్ ప్రపంచకప్ జట్టు ఇదే!!

ఓవర్టన్ ఔట్
ఆల్‌రౌండర్‌గా మంచి పేరున్న ఓలి రాబిన్‌సన్ బ్యాటింగ్ విభాగంలో విఫలమవుతున్నాడు. బంతితో వికెట్లు తీస్తున్నా.. బ్యాట్‌తో పరుగులు సాధించలేకపోతున్నాడు. దాంతో రాబిన్‌సన్ నుంచి ఇంగ్లండ్ భారీ ఇనింగ్స్ ఆశిస్తోంది. ప్రధాన పేసర్ జేమ్స్ అండర్సన్ వికెట్లు తీస్తున్నాడు. క్రిస్ వోక్స్ అదరగొడుతున్నాడు. వీరితో పాటు ఓలీ రాబిన్సన్ పర్వాలేదనిపిస్తున్నా.. క్రెయిగ్ ఓవర్టన్ విఫలమవుతున్నాడు. దాంతో అతడి స్థానంలో మార్క్ వుడ్ ఆడనున్నాడు. లేదా సామ్ కరన్ కూడా ఆడే అవకాశం ఉంది. కరన్ బ్యాటింగ్ కూడా చేయగలడు.

ఇంగ్లండ్ తుది జట్టు (అంచనా)
రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలాన్, జో రూట్ (కెప్టెన్), ఓలీ పోప్, జోస్ బట్లర్ (కీపర్), జాక్ లీచ్, సామ్ కరన్/మార్క్ వుడ్, క్రిస్ వోక్స్, ఓలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్.


Click it and Unblock the Notifications












